2-08-2019 నుండి8-08-2019 వరకు వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

ఈవారం మొత్తం మీద సమయాన్ని అధిక భాగం సరదాగా గడుపుటకు వెచ్చిస్తారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. బంధువులతో లేక కుటుంబసభ్యులతో సమయం గడుపుతారు. చర్చా పరమైన విషయాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకోకుండా చేయవల్సి వస్తుంది. మానసికంగా దృడంగా ఉండుట సూచన. అధికారులతో వారికి అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. స్త్రీ పరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం.


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం మొత్తం మీద నూతన పరిచయాలు ఏర్పడుతాయి , సమయాన్ని మీకు నచ్చిన విధంగా గడిపే ఆస్కారం కలదు. కుటుంబంలో కొంత భాద్యతలు పెరుగుటకు ఆస్కారం ఉంది, ఈ విషయంలో కాస్త స్పష్టంగా ఉండుట సూచన. జీవితభాగస్వామితో కఠినంగా ఉండకపోవడం మంచిది, సర్దుబాటు విధానం తప్పక మేలుచేస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలకు పెద్దల నుండి అనుమతి లభిస్తుంది. విదేశాలలో ఉన్న మిత్రులతో నూతన ఆలోచనలు చేస్తారు. గతంలో చేపట్టిన పనుల వలన సమాజంలో మంచిపేరు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేక బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న విషయంలో ఫలితాలు వస్తాయి. 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం మొత్తం మీద ఆరంభంలో ఒత్తిడి తప్పక పోవచ్చును, తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టత అవసరం. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలను అశ్రద్ధ చేయకండి. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. విదేశాల్లో ఉన్నవారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటుంది. నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో తడబాటు కలిగి ఉంటారు. దైవ పరమైన విషయాలకు సమయం ఇవ్వడం వలన తప్పక మేలుజరుగుతుంది.

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో లేక వృత్తిలో మీరు నలుగురితో గౌరవింప బడుతారు. ఆత్మీయుల నుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోండి. చేపట్టు ప్రతి పనిలో జాగ్రత్త అవసరం. అహంకారం కావొచ్చు అతివిశ్వాసం కానీ ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది, జాగ్రత్త. అనుకోని ఖర్చులు మిమ్మల్ని కొంత బాధిస్తాయి. కుటుంబంలో మీ ఆలోచనలను తెలియజేసే ప్రయత్నంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును. రుణపరమైన విషయాల్లో శక్తికి తగిన విధంగా ప్రవర్తించుట మేలు. నూతన వ్యాపారపరమైన ఒప్పనాదాలకు ఆస్కారం కలదు. ఆరోగ్యం ఇబ్బందులు ఏర్పడ్డ , పెద్దగా నష్టం ఉండకపోవచ్చును, విశ్రాంతి అవసరం.

 

 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం మొత్తం మీద సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మీ కంటూ ఒక స్పష్టమైన విధానం కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సోదరులతో చేపట్టిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు. కుటుంబంలో పెద్దలతో విభేదాలు తప్పక పోవచ్చును. రుణపరమైన విషయాల వలన కొంత మానసికపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. వాహనాల వలన ఇబ్బందులు అలాగే చికాకులు తప్పక పోవచ్చును.

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం మొత్తం మీద అధికారులతో మీ ఆలోచనలను పంచుకుంటారు, వారితో కలిసి నూతన పనులను మొదలు పెడతారు. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విదేశీ ప్రయాణ ప్రయాత్నాలు చేయుటకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశీప్రయాణాలు అనుకోకుండా చేయవల్సివస్తుంది. కుటుంబంలో పెద్దలతో మీ నిర్ణయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. సోదరులతో చేపట్టిన చర్చలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. ఇంతకుముందు మధ్యలో ఆపిన పనులను ముందుకు కొనసాగిస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలు తప్పక పోవచ్చును. చిన్న చిన్న విషయాలకు సర్దుబాటు అవడం వలన మేలుజరుగుతుంది.
 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం మొత్తం మీద సంతానపరమైన విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. పెద్దలతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. గతంలో చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపు లభించనను, సంతృప్తి ఉండకపోవచ్చును. తండ్రి తరుపు బంధువులలో ఒకరి ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోండి. పెద్ద పెద్ద పెట్టుబడుల కన్నా చిన్న చిన్న పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, వారం ఆరంభంలో మాత్రం కొంత పనిఒత్తిడి ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి.

 

 

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో మార్పుకు ఆస్కారం ఉంది, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం సూచన. పూజాది కార్యక్రమంలో పాల్గొనడం మంచిది. పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ముందుగా మీ ఆలోచనల్లో స్పష్టత అవసరం,మేలుచేస్తుంది. వాహనాల విషయాల్లో ఒకింత జాగ్రత్త అవసరం. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం పొందుతారు, ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. చర్చాపరమైన విషయాల్లో లేక స్త్రీ పరమైన విషయాలకు దూరంగా ఉండుట ఉత్తమం. కుటుంబంలో చిన్న చిన్న మార్పులకు ఆస్కారం ఉంది, ప్రేక్షకపాత్ర వహించుట వలన చాలావరకు సమస్యలు తగ్గుతాయి.


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం మొత్తం మీద మీ ఆలోచనల్లో మార్పు ఉండే అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో మీదైన విధానాలు కలిగి ఉండుట వలన తప్పక మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే ఆస్కారం ఉంది. కుటుంబంలో మీ కోపం వలన వ్యక్తులను దూరం చేసుకొనే ఆస్కారం ఉంది. రుణపరమైన విషయాల్లో ఖచ్చితత్వం పాటించుట సూచన. సోదరులతో మీ ఆలోచనలు పాటించుట మంచిది. వ్యాపారపరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. చర్చలకు దూరంగా ఉండుట సూచన.

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

 ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో లేక వృత్తిలో మార్పుకు ఆస్కారం ఉంది. చిన్న చిన్న ప్రయత్నాలు మీకు గుర్తింపును తెచ్చి పెడతాయి. తలపెట్టిన పనులను కాస్త ఇబ్బందితో పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రామ ఫలితాలు పొందుతారు. బంధువులను లేదా మిత్రులను కలుస్తారు. చర్చాపరమైన విషయాల్లో ఇష్టంగా పాల్గొనే ఆస్కారం ఉంది. అనుకోకుండా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో నూతన ఆలోచనలకు ఆస్కారం ఉంది. పెద్దలతో వారై సూచనల మేర అంగీకారం తెలుపుట , వాటిని పాటించుట చేత సమస్యలు తగ్గుతాయి. జీవిత భాగస్వామితో బాగాఉంటుంది, ఇబ్బందులు సర్దుకుంటాయి.
 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం మొత్తం మీద బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి, వారితో గతంలో ఉన్న మాటపట్టింపులను వదిలేయడం మంచిది. నూతన ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మీ మాటతీరు కొంతమందికి ఇబ్బందిని కలుగజేస్తాయి. ఆహరం విషయంలో కాస్త నిబంధనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. వాహనాల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సంతానం విషయంలో ఒకింత ఆందోళన తప్పక పోవచ్చును,ఆలోచనలు తగ్గించుకోవడం సూచన.
 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం మొత్తం మీద మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు, వారితో కలిసి నూతన పనులను మొదలు పెడతారు. కుటుంబ పరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దలనుండి రావాల్సిన సహకారం లభిస్తుంది. స్థాయికి మించిన పనులకు దూరంగా ఉండుట మంచిది. ఆరోగ్యపరమైన సమస్యలు తొలగుటకు ఆస్కారం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయంలో నూతన ఒప్పనందాలకు ఆస్కారం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు.  

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని వ్యాసాలు