ఈ వారం ( 9/8—15/8 ) మహానుభావులు.
జయంతులు
ఆగస్ట్ 13
1.శ్రీ రేలంగి వెంకటరామయ్య : వీరు ఆగస్ట్ 13, 1910 న , రావులపాడు లో జన్మించారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్యనటుడు. “పద్మశ్రీ “ పొందిన మొదటి హాస్యనటుడు. 300 కి పైగా చిత్రాలలో నటించారు.
2. శ్రీ ఎక్కిరాల వేదవ్యాస్ : విరు ఆగస్ట్ 13, 1934 న బాపట్ల లో జన్మించారు. I A S కి చెందిన ఉన్నతాధికారి, విద్యావేత్త, ఆధ్యాత్మిక గురువు గా ప్రసిధ్ధి చెందారు.
ఆగస్ట్ 15
1.శ్రీ వేమూరి గగ్గయ్య : వీరు ఆగస్ట్ 15, 1895 న, వేమూరు లో జన్మించారు. మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ప్రతినాయక పాత్రల్లో పేరు పొందారు..
2. శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి : వీరు ఆగస్ట్ 15, 1929 న విజయనగరంలో జన్మించారు. ప్రముఖ రచయిత్రి.. తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ భాషల్లో పరిజ్ఞానం కలిగిన వీరు అనేక కథలు, కవితలు, వ్యాసాలు, రేడియో నాటికలు రచించారు.
వర్ధంతులు
ఆగస్ట్ 9
డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు : మన దేశానికీ, రాష్ట్రానికీ చెందిన , అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రతిష్టలు పొందిన, ప్రముఖ వైద్యశాస్త్రజ్ఞులు.
క్షయ, టైఫాయిడ్ మొదలగు వ్యాధులనిర్మూలనకై అద్భుతమైన మందులు కనుగొన్న ప్రజ్ఞాశాలి.
వీరు ఆగస్ట్ 9, 1948 న స్వర్గస్థులయారు.
ఆగస్ట్ 14
శ్రీ ఇందుకూరి రామకృష్ణం రాజు : “ రాజశ్రీ “ గా ప్రసిధ్ధులు. పరభాషాసినిమాల అనువాదాలలో పేరు తెచ్చుకున్నారు. ఎన్నో అనువాదచిత్రాలకు మాటలు, పాటలు రాసారు. సుమారు 1000 చిత్రాలకు రచన చేసారు.
వీరు ఆగస్ట్ 14, 1994 న స్వర్గస్థులయారు.
ఆగస్ట్ 15
శ్రీ గూడ వెంకట సుబ్రహ్మణ్యం : సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి. సాహితీరంగంలో విమర్శకునిగా చెరగని ముద్ర వేశారు. నన్నయ నుంచి ప్రారంభించి నాటి ప్రఖ్యాత కవులైన సినారె, శివారెడ్డిల వరకూ తెలుగు కవుల సాహితీ ప్రక్రియల స్వరూప స్వభావాలను విశ్లేషిస్తూ ఈయన రచించిన "సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు" అన్న వ్యాస పరంపర ఆయనకు విశేష ఖ్యాతిని ఆర్జించిపెట్టింది.
వీరు ఆగస్ట్ 15, 2006 న స్వర్గస్థులయారు.