మేష రాశి : (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )
ఈవారం ఆరంభంలో కాస్త ఉద్యోగంలో పనిఒత్తిడికి గురయ్యే ఆస్కారం ఉంది, తోటివారి సహకారం తీసుకోవడం వలన]మేలుజరుగుతుంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. అధికారుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. బంధువుల కుటుంబంలో జరిగే కార్యక్రమాలకు హాజరుఅయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో మీ ఆలోచనలను పెద్దలతో పంచుకుంటారు. సంతానం విషయంలో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు. రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన.
వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)
ఈవారం పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారి అభిప్రాయాల మేర ముందుకు వెళ్ళండి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. సంతానం విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట మంచిది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
మిథున రాశి : (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈవారం అధికారుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకండి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు, పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు పెద్దగా అనుకూలించకపోవచ్చును. సంతానం నుండి ఊహించని విధంగా ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విదశీప్రయాణ ప్రయత్నాలు చేయునపుడు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.
కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)
ఈవారం సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది, పెట్టుబడి కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరిగే విషయంలో చర్చలు జరుగుతాయి, నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.
సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )
ఈవారం కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మిత్రులతో కలిసి ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు అలాగే తలపెట్టిన పనులను వారితో కలిసి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విలువైన వస్తువులను నష్టపోయే ఆస్కారం ఉంది. ఊహించని ఖర్చులకు ఆస్కారం కలదు. తండ్రి తరుపు బంధువులను కలిసే అవకాశం ఉంది, వారినుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి.
కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )
ఈవారం స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది , ఆత్మీయులను కలిసే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. సంతానం విషయంలో కొత్త ఆలోచనలకు అవకాశం ఉంది, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. వాహనాలను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదావేయుట సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు.
తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )
ఈవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది, చేపట్టిన పనులను విజయవంతగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చిన్న చిన్న విషయాల్లో సైతం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విదేశీప్రయాణాలు చేయువారికి అనుకూలమైన సమయం. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో పెద్దలతో కలిసి ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది.
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )
ఈవారం మిత్రులను కలుస్తారు, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. శుభకార్యక్రమాల్లో లేదా విందులలో పాల్గొనే అవకాశం ఉంది. బంధువులతో మాత్రం మాటపట్టింపులకు వెళ్ళకండి. కొన్ని కొన్ని విషయాల్లో మీ మాటతీరు ఒకింత ఇబ్బందికి గురిచేసేలా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.
ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )
ఈవారం ఏ విషయాల్లో కూడా తొందరపాటు పనికిరాదు, చేపట్టిన పనుల విషయంలో స్పష్టత లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను నష్టపోయే ఆస్కారం కలదు. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి, ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. విదేశాల్లో ఉన్నవారు అనుకోకుండా స్వదేశానికి రావాల్సి వస్తుంది. వాహనాల వలన మాత్రం ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, జాగ్రత్త అవసరం.
మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )
ఈవారం రావాల్సిన ధనం ను సమయానికి పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం పొందుతారు. మిత్రులతో కలసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ప్రయాణాల్లో నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుతాయి, జాగ్రత్త అవసరం. నూతన ఒప్పందాలకు ఆస్కారం ఉంది. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సంతానం విషయంలో కాస్త స్పష్టంగా ఉండుట మంచిది. చర్చాపరమైన విషయాల్లో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది.
కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )
ఈవారం ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు, ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విదేశాలలో ఉన్న మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. బంధువులతో కలిసి కొత్త చర్చలు అలాగే నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. భాగస్వామితో ఊహించని విధంగా విభేదాలు ఏర్పడే ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మీన రాశి : (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )
ఈవారం అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సంతానం విషయంలో నూతన ఆలోచనలు క్లైగి ఉంటారు, అలాగే వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. గతంలో తీసుకున్న నిర్ణయాల వలన మేలుజరుగుతుంది. జీవితభాగస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదగా గడుపుటకు అవకాశం ఉంది. చర్చల్లో నిదానం అవసరం.
డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం