ఈ వారం ( 16/8—22/8 ) , మహానుభావులు.
జయంతులు
ఆగస్ట్ 16
శ్రీ వానమామలై వరదాచార్యులు : వీరు, ఆగస్ట్ 16, 1912 న , మడికొండలో జన్మించారు. తెలంగాణాకి చెందిన ప్రముఖ రచయిత, పండితుడు. వీరు తమ 13 వ ఏటనే పద్యరచన ప్రాంరంభించి, 60 కి పైగా రచనలు చేసారు.
ఆగస్ట్ 19
శ్రీ అట్లూరి పుండరీకాక్షయ్య : వీరు ఆగస్ట్ 19, 1925 న , మెకాసా కలవపూడి లో జన్మించారు. ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. ఎన్నో విజయవంతమైన తెలుగు సినిమాలు నిర్మించారు.
ఆగస్ట్ 20
శ్రీ బసవరాజు వెంకట పద్మనాభ రావు : “ పద్మనాభం “ గా ప్రసిధ్ధి చెందిన వీరు, ఆగస్ట్ 20, 1931 న సింహాద్రిపురం లో జన్మించారు. ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు, నిర్మాత. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించడమే కాక నిర్మించారు కూడా.
ఆగస్ట్ 21
శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు : వీరు ఆగస్ట్21, 1918 న పెనుకొండ లో జన్మించారు. దక్షిణ దేశపు అగ్రశ్రేణి గాయకులలో ఒకరు. శ్రద్ధతో, ఉత్సాహంతో, పట్టుదలతో అనేక ప్రాచీన సంప్రదాయ కీర్తనలుసేకరించి, స్త్రీలపాటలు, పల్లెపదాలు అనేకం ప్రోదిచేసి వాటి ద్వారా ప్రాచీన రాగాల స్వరూపాలను కల్పన చేశారు..వీరు తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, సంస్కృతము, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించారు..
వర్ధంతులు
ఆగస్ట్ 16
శ్రీమతి పి.జి. కృష్ణవేణి : “ జిక్కి “ గా ప్రసిధ్ధివెందిన వీరు, ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయని. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ మరియు హిందీభాషలలో ప్రసిద్ధ సినీ గాయకురాలు. మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు.
వీరు ఆగస్ట్ 16, 2004 న స్వర్గస్థులయారు.
ఆగస్ట్ 17
శ్రీ కొడవటిగంటి కుటుంబరావు : ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది. కొకు గా చిరపరిచితుడైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసారు.. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించారు.
వీరు ఆగస్ట్ 17, 1980 న స్వర్గస్థులయారు.
ఆగస్ట్ 18
శ్రీ వేదగిరి రాంబాబు : ప్రముఖ తెలుగు రచయిత, పుస్తకాల ప్రచురణకర్త.. దూర్ దర్శన్ కోసం ఎన్నో లఘు చిత్రాలు నిర్మించి, ప్రభుత్వ పురస్కారాలు పొందారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.
వీరు ఆగస్ట్ 18, 2018 న స్వర్గస్థులయారు.
ఆగస్ట్ 21
శ్రీమతి మాలతీ చందూర్ : వీరు ప్రముఖ రచయిత్రి, సాహిత్య ఎకాడెమీ బహుమతి గ్రహీత. ఆంధ్రప్రభ వార పత్రికలో , “ ప్రమదావనం “ శీర్షికను రెండు దశాబ్దాలపాటు నిర్వహించారు. 300 కి పైగా ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు కూడా..వీరు ఆగస్ట్ 21, 2013 న స్వర్గస్థులయారు.