16-08-2019 నుండి 27-08-2019 వరకు వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

ఈ వారం బంధువుల నుండి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు, వారితో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొద్దిగా కష్టం మీద అనుకున్న ఫలితాలు వస్తాయి. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాలకే హైరానా చెందుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుటకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత మేర ఆరోగ్యం తదితర విషయాల్లో అశ్రద్ధ పనికిరాదు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. అధికారులతో మీ ఆలోచనలను స్పష్టంగా తెలియజేయుట సూచన.

 

 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం ఉద్యోగంలో బాగాఉంటుంది, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న ఆలోచనలను సైతం శ్రద్ధతో పట్టించుకోవడం మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. బంధువులనుండి వచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. కుటుంబ పరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఆత్మీయుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే విషయంలో తడబాటు వద్దు, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో పెద్దలనుండి మీ ఆలోచనలకు మద్దతు లభిస్తుంది. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. మీ మొండితనం వలన సమాజంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు, చర్చలు చేస్తారు.

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తడబాటు ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త ఓపిక అవసరం అలాగే అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట సూచన. ప్రయాణాలు చేయునపుడు ఇబ్బందులు తప్పక పోవచ్చును, తప్పక జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో ఒకింత పనిఒత్తిడి ఉన్న, తోటివారి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుట చేత కొంత ఇబ్బందులు తగ్గతాయి. మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి.

 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం పెద్దలనుండి వచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చర్చాపరమైన విషయాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే ఆస్కారం ఉంది. స్వల్పఆరోగ్యపరమైన సమస్యలు తప్పక పోవచ్చును. సాధ్యమైనంత మేర కోపాన్ని తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువుల విషయంలో కాస్త శ్రద్ద అలాగే జాగ్రత్త అవసరం. వ్యాపారపరమైన విషయాల్లో మరింత శ్రద్ద తీసుకోవడం వలన మేలుజరుగుతుంది.

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం మిత్రులను కలుస్తారు, మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. చర్చాపరమైన విషయాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు.
 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

 ఈవారం సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉన్న కొంత శ్రమ పెరుగుటుకు అవకాశం ఉంది. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలలో ఉన్నవారు స్వదేశానికి తిరిగి రావడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. మీ మాటతీరు విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బంధువుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం సూచన. చర్చల్లో పాల్గొంటారు.

 

 

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం అధికారుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు, వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. మీ ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం వలన కొంత ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. విలువైన వస్తువులను కొనుగులు చేయుటకు ఆస్కారం ఉంది. జీవితబాగస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆ దిశగా ఆలోచనలు చేయుట మంచిది.

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటలో కాస్త శ్రమించాల్సి వస్తుంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. విలువైన వస్తువులను నష్టపోయే ఆస్కారం ఉంది , కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. మానసికంగా దృడంగా ఉండుట సూచన, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా ఉండుట అలాగే పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన.

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

 ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది. ఆరంభంలో కాస్త తడబాటు ఉంటుంది, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి, ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆత్మీయులను కలిసే అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో నూతన ప్రయత్నాల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. పెద్దలను కలిసే అవకాశం ఉంది , చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది.
 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం మిత్రులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది, ఈ విషయంలో మరింతగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విదేశిప్రయాణప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. జీవితభాగస్వామితో విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది. తండ్రి ట్రూప్ బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. వాహనాల వలన ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్త అవసరం.
 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం ఆరంభంలో కాస్త నిదానంగా ఉండుట సూచన. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు ఇబ్బందులు తప్పక పోవచ్చును. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు అవకాశం ఉంది. విదేశాలలో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకశాహ్మ్ ఉంది. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుటకు ఆస్కారం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. చర్చల్లో పాల్గొంటారు.

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి