స్నే'హితుడు' - బన్ను

a real friend by bannu

నిజమైన స్నేహితుడు మన హితవు కోరేవాడై వుండాలి.

  • మనం బాధగా వున్నప్పుడు నవ్విస్తూ ఆనందంగా వుంచాలి.
  • మనం మంచి నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సాహించేవాడై వుండాలి.
  • జీవిత పాఠాల్ని మనల్ని నొప్పించకుండా నేర్పే నేర్పరి అయివుండాలి.
  • మనం తప్పు త్రోవ పడుతుంటే ప్రశ్నించి అడ్డుకునేవాడై వుండాలి.


అంతేకాదు నమ్మకస్తుడై ఉండాలి. అతనే నిజమైన స్నే'హితుడు'!

మనం చెప్పే ప్రతిదాన్ని 'కరక్ట్' అంటూ మనల్ని ప్రతీదానికీ పొగుడుతూ వుండేవాడు మన నుంచి ఏదో ఆశించే స్వార్ధపరుడనే నా అభిప్రాయం. సంతోషాల్లో పాలు పంచుకొని, కష్టాల్లో వున్నప్పుడు కనీసం ఫోన్ కూడా ఎత్తని వాళ్ళు నిజమైన స్నేహితులు కారు.

మనకి తగిన, మనం చేయగల సాయం మన స్నేహితులకి చేస్తే... మనకి అంతకన్నా తృప్తి మరోటుండదు. 'సాయం' అంటే డబ్బు సాయమే కాదు - మాట సాయం, ధైర్యం ఇవ్వటం, 'నేనున్నాను' అంటూ అండగా నిలబడటం ఏదైనా సరే... సాయమే!

స్నేహితులు విడిపోవటానికి 'ప్రేమ', 'డబ్బు'గా చూపిస్తారు. సినిమాల్లో... అది కొంతవరకు నిజమేకానీ, మనసులు కలిస్తేనే నిజమైన స్నేహితులు!

మరిన్ని వ్యాసాలు

శ్రీరామ నవమి విశిష్టత
శ్రీరామ నవమి విశిష్టత
- సి.హెచ్.ప్రతాప్
Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్