రోజులు మారినా, talent గుర్తింపబడకపోవడం మాత్రం ఏమీ మారలేదు. బయటి దేశాల్లో చైనా, East European Countries లోనూ అయితే, ఆటల్లో ఎవరైనా ప్రతిభ చూపిస్తే, ప్రభుత్వమే ఆ పిల్ల్లల ఆలనా పాలనా చూసుకుని, ఆ బిడ్డ తల్లితండ్రులకీ, దేశానికీ కూడా గౌరవం కలిగేటట్టు చూస్తారు. బహుశా అందుకేనేమో, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో, బయటి దేశాలవారికే అన్నన్ని పతకాలు వస్తాయి. ఇలాటి పోటీలు జరిగినప్పుడల్లా మన నాయకులూ, పాలకులూ ఓసారి గుండెలు బాదేసుకుంటారు. మనదేశంలో క్రీడలకి ప్రోత్సాహంలేదూ, 100 కోట్ల జనాభా అయితే ఉంది కానీ, ఒక్కడూ అంతర్జాతీయ స్థాయిలో లేడూ.. అంటూ.. అసలంటూ, ప్రభుత్వాలు మన యువక్రీడాకారుల ప్రతిభ గుర్తించి ప్రోత్సాహం ఇచ్చినప్పుడు కదా..
కుల , మత ప్రాతిపదికలమీదే ప్రభుత్వ ప్రోత్సాహాలు లభిస్తాయన్నది కఠోర సత్యం… అదీ కాకపోతే Prominent position లో మనకు తెలిసినవాడైనా ఉండాలి… ఇవేమీ లేకపోతే, తల్లితండ్రులే ఆస్థులు అమ్ముకుని తమ పిల్లల భవిష్యత్తుకి బాటవేసుకోవాల్సిన దుస్థితి….
దిక్కుమాలిన కోడిపందాలకే కోటానుకోట్లు చేతులు మారడం చూసాము.. లక్షలకోట్లు IPL అనే క్రికెట్ తమాషా లో చూసాము, Match fixing లు అవుతున్నాసరే. గమనించే ఉంటారు…
ఈ మధ్యన మన దేశ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో , మన దేసానికి ఎంతో పేరు తెస్తున్నారు.. badminton, Para Badminton లలో అయితే ప్రపంచ కప్పే నెగ్గారు. మిగిలిన Shooting, Archery లలో ఒకటికాదు, రెండేసీ మూడేసీ స్వర్ణ పతకాలు సాధించి. దేశానికి గర్వకారణమయారు. సిందూ బాడ్మింటన్ ప్రపంచ కప్పు నెగ్గినరోజున జరిగిన హడావిడి అంతా ఇంతాకాదు.. ఆమాత్రం పబ్లిసిటీ ఉండాలే, తాను తెచ్చిన దేశగౌరవానికి, కాదనడం లేదు. దేశాద్యక్షుడినుండి, ప్రధానమంత్రితో సహా పొగిడారు. తప్పనడం లేదు. కానీ, అంతకు ముందు రోజు కూడా ఓ క్రీడాకళాకారిణి,మానసీ జోషి అనే ఆమె, మరో బాడ్మింటన్ ప్రపంచ కప్పు నెగ్గింది Para Badminton లో అంటే , శారీరిక లోపం ఉన్నాకానీ… ఒక్కడు మాట్టాడలేదు ఈ విషయం.. పైగా ఆ అమ్మాయి ప్రధానమంత్రికి ట్వీట్ చేస్తే, అభినందించడం పోయి, “ సిందు ఇంత గౌరవం తెచ్చిందీ.. అంతగౌరవం తెచ్చిందీ..అంటూ సిందు తనతో తీయించుకున్న ఫొటోలు పెట్టారని చదివాము. అదీ క్రీడలకి మన పాలకులు ఇచ్చే గౌరవ మర్యాదలు. పోనీ ప్రపంచవ్యాప్తంగా మన క్రీడాకారులు పాల్గొనే పోటీలూ, వారి విజయాలూ, ఈ పాలకులేమైనా చదివి తెలుసుకోవాలా అంటే, అదీ కాదూ.. ఏ సెక్రటరీయో చదివి, పైవారి దృష్టికి తెస్తే వాళ్ళేమో ఓ అభినందనా సందేశం ఇస్తారు. అంటే ఈ వార్తలు తెలుసుకునే వాడి దృష్టిలో , ఆ రెండో అమ్మాయి మానసి జోషి, విజయం అంత చెప్పుకోదగ్గది కాదన్నమాటేకదా.. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామన్న మాటే కదా…పైన చెప్పినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే..
దేశంలో కులప్రాతిపదిక మీదే బహుమతులు వస్తాయన్నది వింటూంటాము..దేశం మొత్తం మీద, ఏ పేరూ ప్రతిష్టా లేని కళాకారులెందరో ఉన్నారు.. వారికి గుర్తింపుండదంతే.. ప్రతిభ వెతికి పట్టుకోడానికి, ప్రభుత్వాలు కూడా ఎటువంటి ప్రయత్నాలూ చేయరు. మన దేశంలోని ఏ క్రీడా పాలక వ్యవస్థని తీసుకున్నా, ఎన్నో అంతరంగ కలహాలు.. ఎవరి పలుకుబడినిబట్టి వారికే, జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాలు వస్తూంటాయి.. ఒక్కసారి ఎలాగోలాగ జట్టులో కాలు పెట్టగలిగితే చాలు.. ఎలాగోలాగ స్థానాన్ని కాపాడుకోగలడు. మరో చిత్రం ఏమిటంటే, ప్రభుత్వ గుర్తింపూ, ఆదరణా స్థితిమంతులకే ఎక్కువగా దొరుకుతుంది. ఒక విషయమైతే అర్ధమవదు – కొంతమంది క్రీడాకారులకి, జాతీయస్థాయిలో ఏదో ఇచ్చారంటే అర్ధముంది, కానీ వేలంవెర్రిగా అన్ని రాష్ట్రాలవారూ కూడా ఇవ్వడం.. పోనీ అదే ప్రోత్సాహం అందరు ప్రతిభావంతులైన క్రీడాకారులకీ ఇస్తారా అంటే అదీలేదు.. ఎంతో పలుకుబడుంటేనే కానీ సాధ్యమవదు. పైగా ఒక్కోరికీ ఒక బిరుదుతో సరిపెట్టరు.. ఓసారి “ అర్జున్” అంటారు, ఓసారి “ ఖేల్ రత్న” అంటారు, ఇవిచాలవన్నట్టు “ పద్మ “ ఎవార్డులైతే ఉండనే ఉన్నాయి.. ఒకసారి ఇచ్చినతరువాత తిరిగి ఇన్ని ఎవార్డులు అవసరమంటారా? ఒకే వ్యక్తికి ఇన్నేసిచ్చేబదులు కొత్తవారికి ప్రోత్సాహమిద్దామని ఆలోచన ఎందుకు కలగదో ఆ భగవంతుడికే తెలియాలి …
సర్వేజనా సుఖినోభవంతూ…