నవ్వుల జల్లు - జయదేవ్

మహారాజు : మహామంత్రీ గూబలదిరి పోతున్నాయి. కోట బురుజులు కూలే శబ్దాలు వినవస్తున్నాయి. కొంపదీసి శత్రురాజు మన కోట ముట్టడి చేశాడా?
మహా మంత్రి : లేదు మహారాజా! యువరాజులు మందు గుండు సామానుతో, ఫిరంగులు ఫేల్చి ఆడుకుంటున్నారు. దీపావళి కదా!


చంద్రుడు : ఆకాశమంతా తోక చుక్కలతో నిండిపోయింది! అన్నీ ఒకేసారి ఎక్కడినుండి వూడి పడ్డాయి?
తార : అవి తారాజువ్వలు స్వామీ! భూలోకంలో ప్రజలు దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు.

సేనాధిపతి: రాజుగారు, రాణిగారికి విడాకులిచ్చారా ఎందుకూ?
మంత్రి : రాజుగారు, టపాయకి నిప్పంటిస్తుండగా, రాణిగారు "తుస్ స్ స్ స్" అని నోటితో శబ్దం చేసి నవ్వారు, రాజుగారికి కోపం వచ్చింది!
సేనాధిపతి : సరే... ఇంతకీ టపాకాయ పేలిందా?
మంత్రి : అది తుస్సు మంది! అందుకేగా రాజుగారు, రాణిగారికి విడాకులిచ్చింది!


సూరన్న : నరకాసురుడితో యుద్ధం చేస్తుండగా, శ్రీ కృష్ణుడు అలిసిపోయాడటగా?
వీరన్న : ఆయనకి అలుపెక్కడిదీ? సత్యభామ విల్లూ బాణం పట్టుకోవాలని, అలిసినట్లుగా నటించాడు!
సూరన్న : ఎందుకూ?
వీరన్న : నరకాసురుడి మరణం ఒక స్త్రీ వల్ల సంభవిస్తుందని కృష్ణుడికి తెలుసు! అందుకూ!!
సూరన్న : నరకాసురుడికి తెలుసా?
వీరన్న : వాడికి తెలిస్తే... మనకి దీపావళెక్కడిదీ?


నాయుడు : చిచ్చు బుడ్డి అంటిస్తే నీళ్ళు చిమ్ముతోందే? ఎలా?
రాయుడు : ఇన్నిరోజులు వర్షంలో తడిసి ముద్దయిందిగా? నీళ్ళు గాక మతాబా పూలు ఎలా పడతాయ్??


కోటయ్య : నీ తల వున్నట్లుండి బట్ట తలైంది ఎలా?
వీరయ్య : మా బుజ్జిగాడు టపాకాయ అంటించి, తల మీదికి విసిరాడు!!
 


గోపన్న : ఒరేయ్! మన చిన్నికృష్ణుడు ఏమేం టపాకాయలు కాల్చాడు? చిచ్చుబుడ్లా? తారా జువ్వలా? భూచక్రాలా?
వెంకన్న : వెన్నముద్దలు!!


యమకింకరుడు : బావా నాలుక చేదు చేదుగా వుంది!
ఇంకో కింకరుడు : మనం యీ పాపిని పట్టుకొచ్చేవేళ వాడు కాకరపువ్వొత్తులు కాలుస్తున్నాడు!!
 


దళపతి : ఆకాశంలోకి దూసుకుపోయే అనుభూతి కలుగుతోంది!
మంత్రి : (కింద నుంచి) తారాజువ్వ కాడ పట్టుకున్నావ్, వొదిలి పెట్టు!
దళపతి : అఘాతంలోకి పడిపోయే అనుభూతి కలుగుతోంది మహామంత్రీ!
మంత్రి : నీ ఖర్మ!!


కుమార రత్నం : పితాశ్రీ టపాసులు కొనాలి! డబ్బులివ్వు!
పితాశ్రీ : ఇంద... నీ యిష్ట మొచ్చిన టపాసులు కొనుక్కో! ఉల్లిపాయలు మాత్రం వొద్దు... ఈ డబ్బులు చాలవు... పో!!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు