ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు` - భమిడిపాటిఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

ఈవారం  ( 13/9 -19/9 ) మహానుభావులు

జయంతులు

సెప్టెంబర్ 14
శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమ రావు : వీరు, సెఫ్తంబర్ 14, 1883 న కర్నూలు లో జన్మించారు. స్వాతంత్ర సమరం లో,  జైలుకి వెళ్ళిన మొట్టమొదటి ఆంధ్ర జాతీయనాయకుడి గా  ప్రసిధ్ధి చెందారు.  పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించాడు. ఆంగ్ల పదం ఎడిటర్ (Editor) కు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి.

సెప్టెంబర్ 15
1.భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య : వీరు సెప్టెంబర్ 15, 1912 న మద్దెనహళ్ళి లో జన్మించారు. వీరి పూర్వీకులు తెలుగువారు. ప్రకాశం జిల్లాలోని, మోక్షగుండం గ్రామానికి చెందినవారు, ప్రముఖ ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు.. దేశంలోని ఎన్నో ఎన్నెన్నో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు, వీరి సలహా సంప్రదింపుల ఫలితాలే. వీరి సంస్మరణార్ధం, వీరి పుట్టిన రోజుని , దేశవ్యాప్తంగా, “  Engineers Day “  గా, గుర్తిస్తున్నారు.

2. శ్రీ పులిపాటి వెంకటేశ్వర్లు : వీరు సెప్టెంబర్ 15, 1890 న తెనాలి లో జన్మించారు.   తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు. ఆనాటి ఎందరో ప్రముఖ నాటక కళాకారుల సరసన నటించి, తమ సత్తా చాటుకున్నారు. 12 సినిమాల్లో కూడా నటించారు.సెప్టెంబర్ 18
శ్రీ గరికపాటి మల్లావధాని : వీరు సెప్టెంబర్ 18, 1899 న కొవ్వూరు లో జన్మించారు.  స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు.

సెప్టెంబర్ 19

శ్రీ తాపీ ధర్మారావు నాయుడు : వీరు సెప్టెంబర్ 19, 1887 న , బరంపురం లో జన్మించారు. తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది . పత్రికా నిర్వహణలో వీరి ప్రతిభ అనన్యసామాన్యమయినది.. శ్రీ బోయి భీమన్న : వీరు సెప్టెంబర్ 19, 1911 న, కోనసీమ లోని, మామిడికుదురు లో జన్మించారు. సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత.  ఈయన సుమారు 70 పుస్తకాలు రాశారు. పద్య, గేయ, వచన రచనలతో పాటు, నాటకాలను కూడా వ్రాశారు.

వర్ధంతులు

సెప్టెంబర్ 13

శ్రీ కిళాంబి వెంకట నరసింహాచార్యులు : “ ఆత్రేయ : గా ప్రసిధ్ధి చెందారు. తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన గొప్పకవి.  గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి ఆయన మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా ఆయన స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే  ఆత్రేయ  నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు.వీరు సెప్టెంబర్ 13, 1989 న స్వర్గస్థులయారు.

సెప్టెంబర్  14.
శ్రీ బూర్గుల రామకృష్ణారావు :  బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది.. హైదరాబాదు రాష్ట్రానికి తొలిసారిగా ఎన్నికైన ముఖ్యమంత్రి.  సాహితీవేత్త. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, ఉర్దూ, పారశీక, సంస్కృత భాషల్లో బూర్గులకు ప్రావీణ్యం ఉండేది. ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలను, తెలుగులోకి అనువదించిన ఘనత వీరికుంది.  వీరు సెప్టెంబర్ 14, 1967 న స్వర్గస్థులయారు.

సెప్టెంబర్ 19
శ్రీ ఉప్పలపు శ్రీనివాస్ :  ప్రముఖ మాండలీన్ వాద్య కళాకారుడు. జాతీయ స్థాయిలో “ పద్మ శ్రీ “ తో సహా ఎన్నో ఎవార్డులు సంపాదించిన కళాకారుడు. వీరు సెప్టెంబర్ 19, 2014 న స్వర్గస్థులయారు.

మరిన్ని వ్యాసాలు