
కావలిసినపదార్ధాలు: బంగాళదుంపలు, కోడిగుడ్లు, కొత్తిమీర, కారం, ఉప్పు, నూనె, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ
తయారుచేసేవిధానం: ముందుగా బాణలిలో నూనె వేసి అందులో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి తరువాత కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి బంగాళదుంప ముక్కలను, ఉడకబెట్టిన కోడిగుడ్డును వేసి కొద్దిగా ఇవి మునిగేంత నీళ్ళు పోసి 10 నిముషాలు ఉడకైవ్వాలి. చివరగా కొత్తిమీర, మసాలపొడిని వేయాలి. అంతే ఎగ్ ఆలూ కర్రీ రెడీ...