ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు` - భమిడిపాటిఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ వారం ( 20/9 – 26/9 ) మహానుభావులు

జయంతులు

సెప్టెంబర్ 20

శ్రీ అయ్యగారి సాంబశివరావు : వీరు సెప్టెంబర్ 20, 1914 న మోగల్లు లో జన్మించారు.  భారతదేశ అణు శాస్త్రవేత్త. హైదరాబాదు లోని ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు మరియు పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. ఈయన పేరు మీదుగానే హైదరాబాదులో ఈ.సి.ఐ.ఎల్ ఉద్యోగులు నివసించే కాలనీకి  AS Rao Nagar  గా నామకరణం చేశారు.

సెప్టెంబర్ 21

1.శ్రీ గురజాడ అప్పారావు :  వీరు సెప్టెంబర్ 21, 1862 న, రాయవరం ( ఎలమంచలి ) లో జన్మించారు. ప్రముఖ రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది. 19 వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి.

2. శ్రీ అద్దంకి శ్రీరామ్మూర్తి  : వీరు సెప్టెంబర్ 21, 1898 న కల్వకుర్తి లో జన్మించారు.  సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటుడు మరియు సంగీత విశారదుడు. . నాటక కళలోని మెళకువలు నేర్చుకొన్నారు,. అనేక పాటకచేరీలు నిర్వహించారు.. పాటలు పాడడంలో విశిష్టమైన బాణీ సృష్టించుకున్నారు.

సెప్టెంబర్ 23
1.శ్రీ స్థానం నరసింహారావు :  వీరు సెప్టెంబర్ 23, 1902 న బాపట్ల లో జన్మించారు. ప్రసిద్ధ రంగస్థల మరియు తెలుగు సినిమా నటుడు. సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక స్త్రీ పాత్రలను సుమారు 40 సంవత్సరాలకు పైగా ధరించి ప్రేక్షకాభిమానంతో సహా పద్మశ్రీ పురస్కారం పొందారు..

2 శ్రీ ఈమని శంకర శాస్త్రి : వీరు సెప్టెంబర్ 23, 1922 న దాక్షారామం లో జన్మించారు. ప్రముఖ వైణిక శిఖామణి. కేవలం తాను నేర్చుకున్న కర్ణాటక సంగీతంలోని కీర్తనలను మాత్రమే వాయించకుడా, లౌకిక ప్రపంచంతో కూడా తన సంగీతాన్ని అనుసంధానించారు. టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ అధిరోహించిన వార్తను విన్న శంకరశాస్త్రిగారు, ‘ఆదర్శ శిఖరారోహణం’ అని ఒక సంగీత కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేశారు..

వర్ధంతులు

సెప్టెంబర్ 22
శ్రీ అడివి బాపిరాజు :   బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు.వీరు సెప్టెంబర్ 22 , 1952 న స్వర్గస్థులయారు.

2. శ్రీ బొడ్డు గోపాలం  : ప్రముఖ సంగీత దర్శకుడు. నలదమయంతి చిత్రానికి సంగీత దర్శకుడుగా చేశాడు. నాగభూషణం గారి రక్తకన్నీరు, కలికాలం, పాపంపండింది, నాటకాలరాయుడు నాటకాలకు సంగీతము సమకూర్చారు.. అత్యంతప్రాచుర్యం పొందిన  “  చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా “ పాటను స్వరపరిచింది కూడా వీరే. వీరు సెప్టెంబర్ 22, 2004 న స్వర్గస్థులయారు.

సెప్టెంబర్ 24
శ్రీ ఆలూరు వెంకట సుబ్బారావు :  “ చక్రపాణి “ గా ప్రసిధ్ధి చెందారు. బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరు. వీరు సెప్టెంబర్ 24, 1975 న స్వర్గస్థులయారు.

సెప్టెంబర్ 25
శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ :  గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది, సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ప్రముఖ న్యాయవాది. ఆయన నవల మాలపల్లి తెలుగు సాహితీ చరిత్రలోనూ, సామాజిక దృక్పధంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం. వీరు సెప్టెంబర్ 25, 1958 న స్వర్గస్థులయారు.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి