20-09-2019 నుండి 26-09-2019 వరకు వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

 ఈ వారం  ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. పెద్దలనుండి వచ్చే సూచనల విషయంలో స్పష్టత కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. సంతానం విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నం విఫలం అయ్యే అవకాశం ఉంది. విదేశీప్రయాణప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. చిన్న చిన్న విషయాల్లో మరింతగా జాగ్రత్తగా ఉండుట సూచన. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి.

 

 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం మిత్రులనుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది, వారితో చర్చలు చేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం కలదు. సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్దత ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఆత్మీయులను కలుస్తారు, వారినుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. మీఆలోచనల్లో కొంతమార్పుకు అవకాశం కలదు.
 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం ముఖ్యమైన ఆలోచనల్లో తడబాటు ఉంటుంది, అలాగే చేసే పనిలో ఒకింత పనిఒత్తిడి పెరుగుటకు ఆస్కారం కలదు. గతంలో మీకు రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోండి, సమయానికి భోజనం చేయుట మంచిది. సంతానం గురుంచి ఆందోళన చెందుతారు, వారం చివరలో వారి పనులు పూర్తిఅవుతాయి. నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది , వారితో సమయాన్ని గడుపుతారు. సాధ్యమైనంత మేర చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి, ప్రయత్నం చేయుట సూచన.

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం ముఖ్యమైన నిర్ణయాల్లో తడబాటు ఉండే అవకాశం ఉంది, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. రావల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఉద్యోగంలో పనిఒత్తిడి పెరుగుటుకు ఆస్కారం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు.

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. బంధువులను కలుస్తారు వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. స్త్రీపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విదేశీప్రయాణప్రయత్నాలు చేయువారికి పెద్దగా అనుకూలంగా లేదు. సాధ్యమైనంత మేర కోపాన్ని తగ్గించుకోవడం సూచన. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.
 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

 ఈవారం ముఖ్యమైన నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తారు, చేపట్టే పనుల విషయంలో స్పష్టత అవసరం. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారినుండి ఉద్యోగంలో సహాయం పొందుతారు. వాహనాల వలన అనుకోని ఖర్చులకు ఆస్కారం కలదు. తండ్రితరుపు బంధువులలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తుంది. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు సోదరుల లేదా మిత్రుల సహకారం తీసుకుంటారు. జీవితభాగస్వామితో మీ ఆలోచనలు పంచుకుంటారు.

 

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం ఆరంభంలో కాస్త ఇబ్బందులు తప్పక పోవచ్చును, తీసుకొనే నిర్ణయాల్లో తొందరపాటు పనికిరాదు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. నష్టాన్ని పూడ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు పెద్దగా సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చును. రావాల్సిన ధనం విషయాల్లో స్పష్టత తీసుకోవడం సూచన. నూతన ఉద్యోగప్రయత్నాలు వారం చివరలో కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ద అవసరం. వాహనాలను కొనుగోలు చేయుటకు లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. 
 

 


వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

 ఈవారం ముఖ్యమైన నిర్ణయాల్లో కఠినమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న సమస్యలు వచ్చిన , వాటిని అధిగమిస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు కలిసి వస్తయి. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా ఉపయోగపడుతుంది. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభ్సితుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి తోటివారి సహకారంతో పూర్తిచేసే అవకాశం ఉంది. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. చర్చలకు దూరంగా ఉండుట సూచన.

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం మిత్రులను కలుస్తారు, మిత్రులతో సమాయన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభించిన ఎదో తెలియని అసంతృప్తిని కలిగి ఉంటారు. ఆత్మీయులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. స్వల్పఆరోగ్యసమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకోవడంలో విఫలం చెందుతారు. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మానసికంగా దృడంగా ఉండుట సూచన.

 

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. మానసిక పరమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం కలదు. దృడంగా ఉండుట సూచన. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. ప్రయాణాలు లేదా అనుకున్న పనులు వాయిదా పడే ఆస్కారం కలదు. దైవపరమైన విషయాల్లో పాల్గొనడం సూచన. ఆత్మీయుల నుండి వచ్చే సూచనలు పరిగణలోకి తీసుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. వారం చివరలో ఉద్యోగంలో సానుకూల మార్పులకు అవకాశం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి సంతోషకరమైన ఫలితాలు పొందుతారు.

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం కుటుంబంలో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది, మీ నిర్ణయాలను జీవితభాగస్వామితో తెలియజేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాల్లో ఆందోళన ఉంటుంది. ఉద్యోగంలో బాగాఉంటుంది. పెద్దలతో మీకున్న పరిచయం ఉపయోగపడుతుంది. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. స్వదేశీప్రయాణప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తల్లితరుపు బంధువులతో అనుకోకుండా విభేదాలు లేదా మనస్పర్థలు ఏర్పడే ఆస్కారం కలదు, కాస్త నిదానం అవసరం.
 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను కొద్దిగా ఆలస్యంగా నైనా పూర్తిచేసే అవకాశం ఉంది. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. తల్లితరుపు బంధువులను కలుస్తారు, వారినుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోవడం సూచన. విదేశీ ప్రయాణాలు చేయువారికి అనుకూలమైన సమయం. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. మీ ఆలోచనల్లో ఊహించని మార్పులకు ఆస్కారం ఉంది.

 

 

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి