పేరు' మారినా 'ఫేట్‌' అదిరింది.! - ..

fate

సినిమాలకు టైటిల్స్‌ మారడం అనేది ఇప్పటిది కాదు. ఎప్పటి నుండో ఉంది. ఎన్టీఆర్‌ కాలం నుండే ఈ టైటిల్స్‌ మార్పు చూస్తూనే ఉన్నాం. అప్పుడెప్పుడో ఓ సినిమాకి 'పోలీసోడి పెళ్లాం' అనే టైటిల్‌ పెడితే, పోలీసు భార్యల మనోభావాలు దెబ్బ తిన్నాయన్న కారణంతో అప్పటికప్పుడు ఆ సినిమా టైటిల్‌ని 'పోలీస్‌ భార్య' అని మార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సినిమా 'ఖలేజా'ని 'మహేష్‌ ఖలేజా' అని మార్చి విడుదల చేశారు. నితిన్‌ సినిమాకి ఒకానొక సందర్భంలో టైటిల్‌ మార్చాల్సి వచ్చింది. కళ్యాణ్‌రామ్‌ నటించిన 'కత్తి' టైటిల్‌ని కొన్ని కారణాలతో 'కళ్యాణ్‌ రామ్‌ కత్తి'గా మార్చి విడుదల చేశారు. అంతెందుకు యంగ్‌ హీరో నిఖిల్‌ నటించిన 'ముద్ర' సినిమాని పూర్తిగా సంబంధం లేకుండా 'అర్జున్‌ సురవరం'గా మార్చేశారు. అయితే, టైటిల్‌ మార్పు కారణంగా ఆ సినిమా ఇంతవరకూ విడుదలకు నోచుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా సినిమాలు ఆయా కారణాలతో టైటిల్స్‌ మార్చుకుని ప్రేక్షకుల ముందుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే, వాటిలో కొన్ని హిట్‌ అయ్యాయి. ఇంకొన్ని ఫెయిలయ్యాయి. అదంతా అప్పుడు. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.

మనోభావాల పేరు చెప్పి, ప్రతీ చిన్న విషయానికీ ఆందోళనలు పెరిగాయి. కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాలపై అభ్యంతరాల పేరుతో అనవసర వివాదాలు రేపుతున్నారు. ఆ వివాదాలకు అనూహ్యమైన వ్యక్తులు అండగా నిలస్తున్నారు. ఇప్పుడీ టాపిక్‌ ఎందుకు రైజ్‌ చేయాల్సి వచ్చిందంటే, భారీ ఎత్తున బిజినెస్‌ జరిగింది. ప్రమోషన్స్‌ ఆకాశాన్నంటేశాయి. మరో ఆరు గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాకి అనూహ్యంగా టైటిల్‌ మార్చాల్సి వస్తే, ఆ చిత్ర యూనిట్‌ పరిస్థితి ఎలా ఉంటుంది.? ఊహించడమే కష్టం. కానీ, ఇది నిజమైంది. ఈ రకమైన మార్పు ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఈ పరిస్థితి ఏ సినిమాకి వచ్చిందో తెలిసిన సంగతే. మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ నటించిన 'వాల్మీకి' చిత్రాన్ని 'గద్దలకొండ గణేష్‌'గా మార్చి విడుదల చేశారు. అదృష్టం కలసొచ్చింది సినిమా బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టింది. కలెక్షన్ల మోత మోగించింది. అయితే, అదృష్టం అన్ని సార్లూ కలిసి రాదు.

సినిమాని కేవలం వినోదాత్మకం సాధనంగా మాత్రమే చూడాలని ఆందోళనకారులు గమనించాల్సి ఉంది. ఒక సినిమా వెనక ఎన్ని కోట్ల ఖర్చు ఎంతో మంది జూనియర్‌ ఆర్టిస్టుల భవిష్యత్తు, డబ్బుతో కొనలేని శ్రమ, ఒత్తిడి ఇలా ఒక్కటేమిటి చాలా రకాల భావోద్వేగాలు నిండి ఉంటాయి. అలాంటిది సింపుల్‌గా మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ చిన్న విషయాలకే ఆందోళనల బాట పడుతూ రోడ్డెక్కేస్తున్నారు. ఈ ధోరణి సినీ పరిశ్రమను దారుణంగా కృంగదీస్తోంది. విపరీతమైన ఫ్రభావాన్ని చూపిస్తోంది. కొన్ని సందర్బాల్లో మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలు కూడా వివాదాల కారణంగా మరుగున పడిపోతున్నాయి. వెర్రితలలు మోస్తున్న ఈ వింత సాంప్రదాయానికి చెక్‌ పెట్టాల్సిందే. అయితే, ఆ సాహసం ఎవరు చేయగలరు చెప్పండి. ఎవరైతే ఈ విపరీత ధోరణిని ప్రవృత్తిగా పెట్టుకున్నారో వారిలోనే మార్పు రావాల్సి ఉంది. ఒక్క గద్దలకొండ గణేష్‌తోనే వివాదం మొదలు కాలేదు. ఈ వివాదవం సినిమా విజయాన్ని అడ్డుకోలేకపోయిందని ఇక్కడితో వివాదాలకు చెక్‌ పడుతుందనుకోలేము. వివాదాల దారి వివాదాలదే. సినిమాల దారి సినిమాలదే. అయితే ఈ వింత ధోరణిలో మార్పు కోసం ఎదురు చూడడంలో తప్పు లేదు కదా. ప్రయత్నిస్తే, ఖచ్చితంగా ఈ వివాదాల సమస్యకు పరిష్కారం దక్కుతుంది. ఆ ప్రయత్నమే గొప్ప ఫలితాన్నిస్తుంది. 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి