ఇంటర్వ్యూకి అంటెండవుతున్నారా. జస్ట్‌ రిమెంబర్‌ ఇట్‌.! - ..

just remember it

చదువులు పూర్తయ్యాయి. డిగ్రీ చేతపట్టేశారు. ఇకపై ఉద్యోగాన్వేషణే మిగిలి ఉంది. ఉద్యోగానేష్వణకు మొదటి అడుగు ఇంటర్వ్యూతోనే కదా మొదలయ్యేది. అరెరె.. ఇంటర్వ్యూలో రిటెన్‌ టెస్ట్‌ పాసయ్యాను. కానీ, ఆ ఒక్క టెస్ట్‌ ఫెయిల్‌ అయ్యాను.. అనేది చాలా మంది నిరుద్యోగుల నుండి వినబడే మాటే. ఇంతకీ ఆ ఒక్కటీ ఏమిటంటే, ప్రజెన్స్‌. అదేనండీ మన బాడీ లాంగ్వేజ్‌. అవతలి వ్యక్తిని ఇంప్రెస్‌ చేయగల మన కేపబులిటీ. ఇదే అసలు సిసలు ముఖ్య లక్షణం ఇంటర్వ్యూకి అటెండ్‌ అయ్యేవారికి. అయితే, ప్రతీ వ్యక్తికీ ఓ బాడీ లాంగ్వేజ్‌ ఉంటుంది. కానీ, దాన్ని అవతలి వ్యక్తిని ఇంప్రెస్‌ చేసేలా ఎలా మలచుకోవాలి.? అనేది తెలుసుకోవల్సిన అంశం. అదేంటో బ్రీఫ్‌గా తెలుసుకుందాం.

ఉద్యోగాన్వేషణలో క్వాలిఫికేషన్‌కి, కేపబులిటీకి ఎంత ప్రాధాన్యం దక్కుతుందో బాడీ లాంగ్వేజ్‌ కూడా అంతే కీలక భూమిక పోషిస్తుంది. సమర్ధత ఉంటే, ఏ సంస్థయినా పెద్ద పీట వేస్తుంది. సమర్ధత అంటే, ఇక్కడ కేవలం విద్యార్హత మాత్రమే కాదని ముందుగానే చెప్పుకున్నాం కదా. అవునండీ ప్రవర్తన ముఖ్యం. ఆ ప్రవర్తన బయట పెట్టడానికి గ్రూప్‌ డిస్కషన్స్‌ అనేది ఇప్పుడు అత్యంత ఆవశ్యకంగా మారింది. ఇంటర్వ్యూల్లో నయా ట్రెండ్‌గా మారింది ఈ గ్రూప్‌ డిస్కషన్‌. థియరీ పరంగా ఎంతటి నాలెడ్జ్‌ ఉన్నప్పటికీ, ఈ నయా ట్రెండ్‌ని ఫాలో కాకుంటే, ఇంటర్వ్యూలో పాస్‌ అవడమనేది అసాధ్యమని పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలు బల్ల గుద్ది చెబుతున్నాయి.

పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలకూ, హై అండ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకూ దీంతో పని లేదేమో కానీ, ఇంకే ఇతర చిన్న ఉద్యోగాలకైనా ఈ గ్రూప్‌ డిస్కషన్‌ అనే ట్రెండ్‌ కంపల్సరీ అయిపోయింది. పెద్ద పెద్ద సంస్థలు ఈ గ్రూప్‌ డిస్కషన్స్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. గ్రూప్స్‌తో సక్రమంగా కలిసి మెలిసి మసలితేనే సంస్థకు మంచి ఫలితాలందుతాయి. అందుకే ఆయా అంశాల చుట్టూ ఉద్యోగాల ఎంపిక జరుగుతోంది. బాడీలాంగ్వేజ్‌లో మరో అతి ముఖ్యమైన ఘట్టం వాక్‌ చాతుర్యం. మంచి వాగ్ధాటి ఉన్నవారికే ఆయా రంగాల్లో ఉద్యోగాలకు ఆస్కారం ఉంటుంది. కలిసి పని చేయడం, అలా చేస్తున్న పనిని ఎంజాయ్‌ చేయడంతో పాటు, చక్కటి వాక్‌ చాతుర్యం ప్రదర్శించడం, క్లాస్‌ లుక్‌తో ఆకట్టుకోవడం వంటివి బాడీ లాంగ్వేజ్‌లో క్యాలిక్యులేటెడ్‌ అంశాలుగా పరిగణించొచ్చు.

ఈ తరహా బాడీ లాంగ్వేజ్‌ని ఓన్‌గా బిల్డప్‌ చేసుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాకపోవచ్చు. అందుకే ఈ విభాగంలో మిమ్మల్ని మీరు స్ట్రాంగ్‌ చేసుకోవడానికి కొన్ని ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ అంకురించాయి. సంస్థ ఏదైనా సరే, ఇంటర్య్వూకి హాజరయ్యే ముందు, మిమ్మల్ని మీరు మానసికంగా ఎలా సిద్ధం చేసుకోవాలి అన్న అంశంపై సదరు సంస్థలు ట్రైనింగ్‌ ఇస్తారు. వారిచ్చిన శిక్షణలో అక్కడే టెస్ట్‌లు కూడా జరగుతాయి. టెక్నిక్స్‌ తెలుసుకుని, అక్కడ పాస్‌ అయిన వాళ్లు తదనుగుణంగా ఈజీగా ఇంటర్య్యూస్‌కి అటెండ్‌ కావచ్చు. చక్కని ఉద్యోగాలు కొట్టేయొచ్చు. మై డియర్‌ యూత్‌.! ఈ విషయాన్ని గమనిస్తారు కదా.

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి