చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

సాధారణంగా చూసేదేమిటంటే,  ఎవరైనా ఒక నిర్ణయం తీసికునేముందర,  నలుగురినీ సంప్రదిస్తే బావుంటుంటొందేమోనని. ఓ పెళ్ళి సంబంధమనండి, ఓ ఇల్లు కొనుక్కునేటప్పుడనండి, లేదా  పిల్లలని ఏ స్కూల్లో/ కాలేజీలో చేర్పించాలో అనండి, లేదా ఏ మొబైలో, టీవీ యో కొనేటప్పుడనండి.. ఇలా చెప్పుకుంటూ పోతే  ప్రతీ విషయంలోనూ ఇంకొకరి సలహా / అభిప్రాయమూ అడగడం వలన, చివరకి జరిగేదేమిటంటే   utter confusion  అని నా ఉద్దేశం.  Second opinion  అనేది ఏదో కొంత మితంగా ఉంటే  పరవాలేదు కానీ, మోతాదు మించితే ఎక్కువగా వచ్చేవి కష్టాలే.

ఇదైవరకటి రోజుల్లో పరిస్థితులు ఇంకో రకంగా ఉండేవి. ఏదో ఊరికి ఏ ఇద్దరో ముగ్గురో పెద్దవారు , అన్ని విషయాలలోనూ అనుభవం ఉన్నవారుండేవారు కాబట్టి గొడవుండేది కాదు. వారుకూడా, స్వలాభేపేక్ష లేకుండా సలహా ఇచ్చేవారు.  నూటికి తొంభై పాళ్ళు వారుకూడా మంచి సలహాలే ఇచ్చేవారు.. ఫలానా పెద్దాయన చెప్పారు , మావాడు జీవితంలో పైకొచ్చాడూ అని నాలుక్కాలాలపాటు చెప్పుకునేవారు.
కానీ ఈరోజుల్లో అలా కాదే. అడిగినా అడక్కపోయినా సలహాలిచ్చేవారే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేశారు. వాటికి స్టైలుగా   Consultants , కౌన్సెలర్స్  అని పేరోటీ. వాళ్ళైతే సలహాకింతా అని డబ్బులుకూడా వసూలు చేస్తూంటారు…  ఈ సలహాలకి  గారెంటీ / వారెంటీ క్లాజులుండవు, అంతా దైవాధీనం. పైగా అయినదానికీ, కాని దానికీ వీళ్ళ దగ్గరకి వళ్ళడంకూడా ఓ  status symbol.  అలాగని, వీళ్ళు చెప్పేవి ఉపయోగించవని కాదూ, నూటికీ ఏ పాతిక మందో ఉంటారు అసలు సిసలైన సలహాలిచ్చేవారు… మిగిలినవారు.. ” చెప్పేవాడికి వినేవాడు లోకువా..” టైపు. అదేకాకుండా,  వెళ్ళేవారి విశ్వాసం మీద కూడా ఆధారపడుంటుంది.

ఒక విషయం మాత్రం అర్ధం అవదు. ఏ విషయానికైనా మంచీ చెడూ ఉంటాయి. మంచి అనుభవం పొందినవాడు, అడిగితే  ” మీరింకేమీ ఆలోచించకండి… ఆ కాలేజీ / సంబంధం / డాక్టరు /  … బెస్టు మాస్టారూ.. ” అని అలవోకగా చెప్పేస్తాడు.  ఇంక ఆ రెండో వాడిని అడిగితే… ”  వామ్మోయ్.. వాళ్ళు పేచీకోరులు ,/ ఆ కాలేజీలో సదుపాయాలంత బాగాలేవూ /  ఆ డాక్టరుగారా.. అడక్కండి మహప్రభో నానా టెస్టుల పేర్లూ చెప్పి ముక్కుపిండుతాడు…  etc.. ”  అని చెప్తాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరి మాట పట్టుకోవడమో తెలియక, ఇంకా తికమకపడిపోయి   BP  పెంచేసికోవడం తప్ప ఒరిగేదేమీ లేదు. అయినా అడిగేవాళ్ళు అడుగుతూనే ఉంటారూ, చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు.
హాయిగా ఎవరిక్కావాల్సిన దేదో చేసికోక  ఎందుకొచ్చిన గొడవలూ? పోనీ ఈ అడిగేవాళ్ళైనా అంత అమాయకులా అంటే అదీ కాదూ…, రేపెప్పుడో జరగరానిదేదో జరిగితే, ఆయుద్దాయమున్నంతకాలమూ, ఆ సలహా చెప్పినవాడిని సాధిస్తూ ఉంటారు.. ” నువ్వు చెప్పేవుకాబట్టి చేశానూ… ఇప్పుడు చూడు ఏమయిందో… ” అని. ఏదో పుణ్యానికి వెళ్తే పాపం ఎదురైనట్టయింది.

స్కూలు చదువు పూర్తిచేసి, ఏ ఇంజనీరింగులోనో చేరడానికి  నానా రకాల  Entrance Test  లకీ  హాజరవడం. తీరా వాటి ఫలితాలొచ్చిన తరువాత, ఏ కాలేజీలో , ఏ  stream  లో చేరాలో తెలియదు. ఇంక మొదలూ ఈ  Second Opinion  process  ప్రారంభం.  దేంట్లోనూ పాసేఅవకపోతే గొడవే లేదూ… పాపం తెలివైన పిల్లలకే ఈ గొడవలన్నీనూ. ఆ పిల్లాడికో పిల్లకో ఫలానా  stream  లోనే చేరాలనుంటుంది, ( ఎంతైనా చదవాల్సింది తనే కదా ), ఇంట్లో తల్లితండ్రులేమో మన పిల్ల/ పిల్లాడూ ఫలానా దాంట్లో చేరితే బావుంటుందేమో ( peer pressure ) ( వారి జీవితంలో పరిస్థితుల ప్రభావం మూలాన చేయలేనివి ) అనుకుంటారు. ఇంక  Second Opinion  సలహాదార్లు వారికి తోచిన సలహాలిస్తారు. 12  th class  పరీక్షలు రాసి, నానా  entrance tests  రాసి, వాటి ఫలితాలు వచ్చినప్పటినుంచీ అంటే   April to June/July  దాకా ఈరోజుల్లో తల్లితండ్రులు  భరించే ఒత్తిడి  పగవాడిక్కూడా రాకూడదు.

ఇది వరకటి రోజుల్లో అసలు ఈ గొడవలే ఉండేవి కావూ, ఏం చదివించాలో, ఏం చదవాలో ముందరే నిర్ణయించేసికోవడమూ, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుని, వాళ్ళక్కావాల్సిన కాలేజీలో చేరిపోవడమూ… బస్…నాలాటివాడికి ఆ గొడవా లేదూ, అసలా పరీక్షలు పాసవడమే ఓ ఘనకార్యమాయిరి….
ఏమిటో ఈ చదువులేమిటో, ఈ టెస్టులేమిటో.. చూస్తూంటే జాలేస్తుంది. చేసేదేమైనా ఉందా అంటే, ” అమ్మయ్య ఈ గొడవలన్నిటినుండీ బయట పడ్డామూ ఆ భగవంతుడి దయ వలనా ” అని  ఆ పైవాడికి ఓ దండం పెట్టుకోవడం…

 

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి