ఈవారం ( 4/10 – 10/10) మహానుభావులు
జయంతులు
అక్టోబర్ 4
శ్రీ కమలాకర కామేశ్వర రావు : వీరు అక్టోబర్ 4, 1911 న బందరు లో జన్మించారు. పౌరాణిక చిత్రాల బ్రహ్మ గా గుర్తింపు పొందిన దర్శకుడు. సాంఘిక చిత్రాల మాటెలా ఉన్నా తెలుగు పౌరాణిక చిత్రాలకు సాటి రాగల పౌరాణికాలు యావద్భారతదేశంలోనే మరే భాషలోనూ లేవు. తెలుగు పౌరాణికాలకు ఆ ఘనతను సాధించి పెట్టిన చిత్రాలు చాలానే ఉన్నాయి. నర్తనశాల, పాండవ వనవాసం మొదలైనవి వాటిలో ముఖ్యమైనవి.
అక్టోబర్ 5
శ్రీ మధురాంతకం రాజారాం : వీరు అక్టోబర్ 5, 1930 న మొగరాల లో జన్మించారు. ప్రముఖ కథకులు. ఈయన సుమారు 400కు పైగా కథలు, రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితి వ్యాసాలు రచించారు. పెక్కు తమిళ రచనలనుతెలుగులోకి అనువదించారు. ఈయన కథలు అనేకం తమిళ, కన్నడ, హిందీ, ఆంగ్ల భాష లలోకి అనుమతించబడ్డాయి. చిన్ని ప్రపంచం-సిరివాడ నవల రష్యన్ భాషలోకి తర్జుమా చేయబడి ప్రచురితమైంది. 1993 లో మధురాంతకం రాజారాం కథలు పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
అక్టోబర్ 8
శ్రీ పేకేటి శివరామ సుబ్బారావు : వీరు అక్టోబర్ 8, 1918 న, పేకేరులో జన్మించారు. “ పేకేటి శివరాం “ గా ప్రసిధ్ధులు. ప్రముఖ సినిమా నటుడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 100 కి పైగా చిత్రాలలొ నటించారు. దర్శకుడిగా కూడా పేరు పొందారు.
అక్టోబర్ 10
శ్రీ ముదిగొండ లింగమూర్తి : వీరు అక్టోబర్ 10, 1908 న తెనాలి లో జన్మించారు. పాత తరానికి చెందిన నటుడు. హాస్యం, క్రౌర్యం, శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు. ప్రతి విషయాన్నీ తర్కం, స్వభావం, శాస్త్రాలతో రంగరించి, విపులీకరించేవారు.
శ్రీ నేదునూరి కృష్ణమూర్తి : వీరు అక్టోబర్ 10, 1927 కొత్తపల్లి లో జన్మించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు.వీరు స్వర పరచిన కీర్తనలలో - దాశరథి శతకం పద్యాలు, రాగ సుధా రసాలతో భద్రాచల రామదాస కీర్తనలు ప్రసిధ్ధమైనవి. రెండు సీడీలు వెలువరించారు. అన్నమాచార్య సంకీర్తనలు, పదకదంబం మీద పలు సీ డీలు, కెసెట్లు విలువడించారు. ఆల్ ఇండియా రేడియో భక్తి రంజనిలో కూర్చిన నారాయణ తీర్థ తరంగాలు, రామదాస కీర్తనలు బగా వాసికెక్కాయి.
వర్ధంతులు
అక్టోబర్ 4
శ్రీ ఏడిద నాగేశ్వరరావు : ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు..
వీరుఅక్టోబర్ 4, 2015 న స్వర్గస్థులయారు.
అక్టోబర్ 6
శ్రీ చిత్తజల్లు పుల్లయ్య : సి. పుల్లయ్య గా ప్రసిధ్ధులు. మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నటుడు, నిర్మాత.. సినిమా థియేటర్ ను ఒక ఉద్యమం లాగా చేపట్టి గుడారాలు, ప్రొజెక్టర్లూ, కుర్చీలు తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలోనే కాక బెంగాల్, ఒరిస్సాల్లో కూడా ఊరూరా తిరిగి వాటిని ప్రదర్శించారు. వీరు అక్టోబర్ 6, 1967 న స్వర్గస్థులయారు.
అక్టోబర్ 9
శ్రీ శ్రీహరి : తెలుగు సినిమా నటుడు. ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా పదోన్నతి పొందిన నటుడు.. సినిమాల్లో తెలంగాణ యాసకు గొప్ప గౌరవాన్ని తీసుకువచ్చిన నటుడు శ్రీహరి.. వీరు అక్టోబర్ 9, 2013 న స్వర్గస్థులయారు..
అక్టోబర్ 10
శ్రీ సుద్దాల హనుమంతు : ప్రజాకవి. కవిగా, కళాకారుడిగా, అంతకుమించి క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టుగా జీవితమంతా కష్టజీవుల కోసం, కమ్యూనిస్టు ఉద్యమం కోసం అంకితం చేసిన వ్యక్తి. తెలంగాణ జాతి యావత్తుని తన కవితలతో మేల్కొలిపిన మహా కవి సుద్దాల హనుమంతు. ఆయన కవితలో ఆవేశం ఉంటుంది. ఆ అర్థాల్లో ఆలోచన ఉంటుంది. ఆ భావాల్లో సామాజిక స్పృహ ఉంటుంది. సామాజిక స్పృహతో ఆవేశంగా అర్థవంతంగా చేసే ఆలోచనే సుద్దాల కవిత. వీరు అక్టోబర్ 10, 1982 న స్వర్గస్థులయారు.