ఈ మధ్య అందరూ పెద్ద ఫ్రిజ్ లు కొనుక్కుని, అన్నీ అందులో పెట్టేస్తున్నారు. పప్పు, బెల్లం కూడా! ఎందుకంటే పురుగు పట్టదు.. చీమలు పట్టవంటారు. ఫ్రిజ్ ఖాళీ వుంటే పెట్టుకోవచ్చు కానీ.. కొన్ని పదార్ధాలు పెట్టుకోకూడదు. అందులో ముఖ్యంగా.. అరటిపళ్ళు, ఉల్లిపాయలు ఎందుకంటారా? అరటి తొక్క లోంచి మంచుకు ఫంగస్ వస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అలాగే ఉల్లితొక్క కూడా! ఉల్లితొక్క ఒలిచి పెట్టుకుంటామని కొందరి వాదన! చూడాలి మరి.. ఇలా అయితే స్టోర్ రూం బదులు స్టోర్ ఫ్రిజ్ కొచ్చే ప్రమాదం వుంది. ఇప్పటికే డబుల్ డోర్ ల హవా నడుస్తోంది. ఫ్యూచర్ లో ఏమవుతుందో చూడాలి.!