4-10-2019 నుండి 10-10-2019 వరకు వారఫలాలు - - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

 ఈవారం సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ఉద్యోగంలో ఒకింత పనిభారం పెరుగుటకు అవకాశం ఉంది , నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. సంతానం విషయంలో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. గతంలో మీరు చేసిన అర్థకసహాయం విషయంలో ఒత్తిడికి గురయ్యే ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్త ఆవసరం. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతాయి. బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. దైవపరమైన విషయాల్లో సమయం గడపడం వలన మేలుజరుగుతుంది. 
 

 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం సంతానం విషయంలో గతంలో ఉన్న ఆందోళన తగ్గుతుంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే అవకాశం ఉంది. రుణపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే ఆవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మీ మాటతీరు కొంతమందికి ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. మీ ఆలోచనలను పెద్దలతో లేక సోదరులతో పంచుకొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. మిత్రులను కలుస్తారు.

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం కలదు. కుటుంబ పరమైన విషయాల్లో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. పెద్దలతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి.

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. చేపట్టిన పనులను పూర్తిచేసే విషయంలో తోటివారి సహకారం తీసుకోవడం మంచిది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సాధ్యమైనంత మేర అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి, స్వల్ప ఇబ్బందులు తప్పక పోవచ్చును. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన నిర్ణయాలు తీసుకొనే విషయంలో స్పష్టత కలిగి ఉండుట మంచిది.
 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు, నూతన పెట్టుబడులకు ఆస్కారం కలదు. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. కుటుంబంలో నూతన విషయాలను కుటుంబపెద్దలతో పంచుకొనే అవకాశం ఉంది. సంతానం విషయంలో గతంలో ఉన్న ఆందోళనలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు, మీ ఆలోచనలు వారితో పంచుకొనే అవకాశం కలదు. మిత్రులను కలుస్తారు.

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

 ఈవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. చర్చాపరమైన విషయాల్లో పాల్గొనే ఆస్కారం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. కుటుంబంలో జరిగే కార్యక్రమాల విషయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటారు.

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం మానసికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును. గతంలో మీకున్న పెద్దల పరిచయాలు ఉపయోగపడుతాయి. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు కాస్త వాయిదా పడే ఆస్కారం ఉంది. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట సూచన.

 

 


వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి, అధికారులతో మీకున్న పరిచయాలు ఉపయోగ పడుతాయి. బంధువులను కలుస్తారు, వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. తల్లితరఫు బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. చర్చాపరమైన విషయాల్లో కాస్త నిదానంగా ఉండుట సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది, వాహనాలను కొనుగోలు చేయాలనే ఆలోచన ముందుకు సాగుతుంది. మీ మాటతీరు విషయాల్లో స్పష్టత లేకపోతే ఇబ్బందులు తప్పవు.

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. గతంలో తీసుకున్న నిర్ణయాల వలన సమాజంలో గుర్తింపును పొందుతారు. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశం ఉంది. పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోండి. విదేశీప్రయాణాల కన్నా స్వదేశీ ప్రయాణాలు చేయువారికి అనుకూలమైన సమయం. రుణపరమైన విషయాలల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన

 

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చును, సర్దుబాటు విధానం మంచిది. ఎవరితోనూ మాటపట్టింపులకు వెళ్ళకపోవడం మంచిది. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పెద్దలను కలుసుపుకొని వెళ్ళండి. సంతానం నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. రుణపరమైన విషయాల్లో స్పష్టత కలిగి ఉండి ముందుకు వెళ్ళండి. తండ్రితరుపు బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం కలదు.

 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం చేపట్టు పనుల విషయాల్లో స్పష్టత కలిగి ఉండుట మంచిది. స్వల్పఆరోగ్య స,సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ఊహించని విధంగా విభేదాలు వచ్చే ఆస్కారం ఉంది, కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. చిన్న చిన్న విషయాల్లో సైతం శ్రద్ధను కలిగి ఉండుట సూచన. అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. విదేశాల్లో ఉన్నవారు చేసే నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన మేర ఫలితాలు వస్తాయి. మిత్రులను కలుస్తారు.

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం కుటుంబపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాల్లో స్పష్టత మంచిది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

 

 

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి