‘మోహన’ రాగం- రాజావాసిరెడ్డి మల్లీశ్వరి - డా దిలావర్

mohanaragam  book review
రాగాలోకెల్లా మనసుకు  హాయినిచ్చేది మోహన రాగం. కవిత్వ ప్రక్రియల్లో ఆహ్లాదకరమైనది ‘గజల్‌’. రాజావాసిరెడ్డి మల్లీశ్వరి గారు రాసిన ‘మోహన’ గజల్‌ సంపుటి మోహన రాగంలా రవళిస్తుంది. హృదయాన్ని ఆహ్లాదంలో ముంచెత్తుతుంది. మల్లెపూ పరిమళాన్ని గుబాళిస్తుంది.
 
తీవెనై సాగి నీ కలువ నై పూసి
మోవినై నీ మాట వినిపించానుంది

ఎంత తియ్యని కోరిక! ఎంత అందమైన వాంఛ. ఇందులో అంత్య ప్రాసలే కాక యతి కూడా కుదరడంతో గజల్  అదనపు సొబగ్గుసమకూడిరది. ‘నే కలువనై పూసి’ అని వుంటే అది సాధారణోక్తి అయ్యేది. కాని మల్లీశ్వరి కదా! అలా ఎందుకంటుంది. ‘నీ కనులలో నే కలువనై పూసి’ అనడంలో ఎంత సరసత ఉంది!

ఎందుకు నీవు శశివైనను ఒంటరి కువను చేస్తావు
నా చూపు వెన్నెలవక దిగు గాటేస్తావు?

నిష్ఠూరాన్ని కూడా ఎంత అందంగా చెప్పవచ్చునో ఈ షేర్‌ చెబుతున్నది. నువ్వు చందమామ లాంటి అందగాడివే. కాని నన్ను ఒంటరి కలువను చేస్తావెందుకు? వాప్‌ా! క్యా బాత్‌ హై!
రెప్పచాటు కలనై కరిగానిలా నీ కోసం
చూపు చాటు చికిలి నవుతూవెలిశానిలా నీ కోసం

కలగా కరిగిపోవడం తెలిసినవారే యిలా హృద్యంగా చెప్పగుగుతారు. అయితే ఉత్తినే కాదు. రెప్పచాటు కలై కరిగిందట! అంత అందమైన భావన!

ఎన్ని కన్నీళ్ళు నేల రాలితే ఓ కలౌతుందో తెలుసా
ఎన్నికలలు కనుల ఒడివాలితే ఓ కళౌతుందో తెలుసా...

కవిత్వం ఒక తపస్సు. ఆ తపస్సు చేసినవాడికే కవిత్వం సాక్షాత్కరిస్తుంది. నా నృషి:కురితే కావ్యం అని కదా పెద్దల ఉవాచ. ఎంత తపస్సు చేస్తే, ఎంతగా తపిస్తే, హృదయాన్ని రాపాడితే, ఘర్షణ పడితే ఇలాంటి కళాత్మక, కవితాత్మక అభివ్యక్తి సాధ్యమవుతుంది!

వచ్చే నిన్ను తలచి మల్లె గుబురునై పోయాను
నచ్చే నిన్ను తలచి ప్రేమ మొగులునై పోయాను....

ఇది కూడా మనసుల్ని దోచే అభివ్యక్తే. ఉర్దూ గజల్‌ అభివ్యక్తికి చేరువగా వున్న షేర్‌. వచ్చే ప్రియుణ్ణి తుచుకోగానే తాను ‘మల్లి’ గుబురై పోయింది. ప్రేమను వర్షించే మొగులు అయిపోయింది! స్త్రీ సహజమైన కోమత్వం యీ వ్యక్తీకరణలో ఒదిగిపోయింది.

చెట్టును కొట్టిన గొడల్డల్లే నువు మరచిపోయావు..
పూను రాల్చే గాలిలా నను వదిలిపోయావు
 
చెట్టును కొట్టిన గొడ్డలి చెట్టును గుర్తుంచుకోదు. దాని స్వభావమే అంత! అలాంటి కఠినమైన హృదయం నీది అని పిండితార్థం. పూలను రాల్చే గాలి! ఎంత సున్నితమైన పోలిక! ఎంత సుకుమార భావుకత! రసోల్లాసమైన ఉపమానాు.
 
"గచ్ఛతి పురశ్శరీరం ధావతి పశ్చాదసంస్తుతం చేత:
చీనాంశుక మివకేతో ప్రతివాతం నీయమానస్య"....
అన్న మహాకవి కాళిదాసు శ్లోకం గుర్తుకొస్తుంది.
పగటెండ గడచి మల్లె తావై మిగిలింది రేయెండ గడిచి
మనసు ఆవై మిగిలింది....

పగటి ఎండ గడచిపోగానే ‘మల్లి’ తావై మిగిలిందట. వెన్నె రాగానే మనసు ఆవై మిగిలిందెట! ‘ఎన్నెంతా మేసి ఏరు నిదరోయింది’ లాంటి వ్యక్తీకరణ! ‘పగ` టెండ’` రేయెండ ఎంత అందమైన పోలికలు  పద హృదయం తెలిసన వారే ఇలాంటి సున్నిత పద ప్రయోగం చేయగుగుతారు.

... ఓటి కుండ మనిషి కన్నీరు కారుతూనే ఉంది
పోంతకుండ మనిషి కన్నీరు కాగుతూనే ఉంది..
 
ఇందులో కవయిత్రి గడుసు పద ప్రయోగం కనిపిస్తుంది. అలాగే ఓ జీవన తాత్త్వికత కూడా ఇందులో గుబాళిస్తున్నది. వ్యాఖ్యానం అక్కర లేని వ్యక్తీకరణ.

నే సింగారించుకోద ఆకట్టుకునే వనాలతో
నా హృదయం చూస్తోంది సరమై అంకరిస్తావని

నీకు వనాలే అందం. ఆమనులే ఆనందం.  పుష్ప సంభరితమైన వనాలతో నే సింగారించుకుంటుంది. అలాగే నువ్వు సరమై అంకరిస్తావని నా హృదయం చూస్తున్నది. గొప్ప స్వారస్యాన్ని ఇముడ్చుకునే షేర్‌ యిది. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రంథాన్నంతటినీ ఉదాహరించవసి వస్తుంది.
కోమ్మపైట గాలితో సందడి చేస్తోంది`

నదిలాగా గుండె కోతను కోయలేదా అంటుంది మనసు!`
నా మనసు మల్లెపూ పొట్లు విప్పిపోయింది కాం`
ఆశ మెట్లపై మదిని జారనీకు ఏనాడు`
ఎందరి ప్రాణాు ఈ పయస్సు నింపుతోంది`
నిన్ను నమ్మిన నను సుడిలో తరిగా చేశావు`
వేసవిలో నదిలా నీరసమౌతుంది`
లాంటి అద్భుత భావ చిత్రాతో ‘మోహన’ కవితా ‘మోహన రాగం’ ఆపిస్తున్నది.
ఇందులో అరుదైన మారుమూల పదాలను కూడా
ప్రయోగించి కవయిత్రి తన వైదుష్యం ప్రదర్శించింది.

కనుకనె` ఆయము` దాయము` గారతనము` సికత విరాళి` తొగ లాంటి పదాను ప్రయత్న పూర్వకంగా కాక, అలవోకగా ప్రయోగించింది కవయిత్రి. ఈ గజళ్ళలో ఆర్తి ఉంది. కవితా ఉంది. నివేదన ఉంది. పరివేదన ఉంది. ఉద్వేగం ఉంది. భావుకత ఉంది. ప్రేమతత్వ ముంది.
అన్ని విధాలా యీ ‘మోహన’ ప్రశంసనీయమైనది. కవయిత్రి రాజావాసిరెడ్డి మల్లీశ్వరి గారిని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను.

మరిన్ని వ్యాసాలు

సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
డప్పు గీతాలు.
డప్పు గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు