
మల్లెపూల కత్తితోడ
ఎవరిని పొడిచేస్తావు?
అందమైన చూపూతోడ
ఎవరిని తడిపేస్తావు?
నడము మడుత బాకుతోడ
ఎవరిని మడిచేస్తావు?
బాలా!నీచూపులోన
గమ్మత్తేదో ఉంది?
ఫాలంతో బ్రహ్మనైన
బాదే శక్తేదొ ఉంది!
ధైర్యం నీ గుండెనిండ
దర్శన మిస్తుంది కదా!
యువరాజులు నీవలలో
పడకుండా ఎటుపోదురు?
యుగళానికి స్వయంవరం
ప్రకటించగ మానుదురా?
మల్లెపూల కత్తితోడ
ఎవరిని పొడిచేస్తావు?
కనుబొమతో ములుకులిడుచు
ఎవరిని దోచేస్తావు?