ఫ్యాషన్‌.. ట్రెండ్‌ మారింది బాస్‌.! - ..

fashion trend change boss

ఫ్యాషన్‌ అంటే కేవలం డ్రస్సింగే కాదు, హెయిర్‌ స్టైల్‌ నుండీ కాలికి వేసే చెప్పల్స్‌ వరకూ అంతా ఫ్యాషనే. ఇప్పుడీ ఫ్యాషన్‌ ట్రెండ్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. యువతను కొత్త కొత్తగా ఆకర్షిస్తోంది. ఫ్యాషన్‌ ఫాలో అయ్యేవారు ఎక్కువ కావడంతో, తద్వారా వచ్చే ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరిగాయి. అసలు ఫ్యాషన్‌ అంటే ఏంటీ.? ఏయే అంశాల పట్ల ఫ్యాషన్‌ ప్రియులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఎలా ఉపాధి పొందుతున్నారో రీసెర్చ్‌ చేయడమే ఇప్పుడో ఉపాధి అవకాశంగా మారిపోయింది. దీనికంతటికీ పెరిగిన సాంకేతికత బాగా ఉపయోగపడుతోంది.
హెయిర్‌ స్టైల్‌ విషయానికి వస్తే, ఒకప్పుడు హెయిర్‌ కటింగ్‌.. అదే క్షౌర వృత్తి (సెలూన్‌) అంటే చాలా తక్కువగా చూసేవారు. కానీ, ఇప్పుడు హెయిర్‌ స్టైలిస్ట్‌కి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. హెయిర్‌ సెలూన్స్‌, భూలోకపు హెవెన్స్‌లా మారిపోయాయి. బోలెడన్ని ఎట్రాక్షన్స్‌తో కళకళలాడిపోతున్నాయి సెలూన్‌ పాయింట్స్‌. అందుకు కారణం ముఖ్యంగా యువత హెయిర్‌ స్టైల్స్‌ పట్ల చూపుతున్న అపారమైన ఆసక్తే. అమ్మాయిలు, అబ్బాయిలూ కూడా డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్స్‌ని ఫాలో చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఒకప్పుడు అబ్బాయిలకు హెయిర్‌ స్టైల్స్‌ అంటే ఒకటీ, అరా మాత్రమే ఉండేవి. కానీ, అమ్మాయిల్ని మించి హెయిర్‌ స్టైల్స్‌ అబ్బాయిలు ఫాలో చేస్తున్నారిప్పుడు. సెలబ్రిటీలు ఫాలో చేస్తున్న హెయిర్‌ స్టైల్స్‌ని మించిన ట్రెండ్స్‌ కామన్‌ యూత్‌ సొసైటీలో ఫాలో చేస్తోందని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఇక అమ్మాయిల గురించి ఏమని చెప్పగలం. డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్స్‌ చేయడంలో అమ్మాయిలకు ఆకాశమే హద్దు.
బ్యూటీషియన్‌ కోర్సుల కోసం ఏకంగా విదేశాల్లో శిక్షణ పొందుతున్నారు. ఉన్నతమైన చదువుల కోసమే కాదు, ఫ్యాషన్‌ రంగాన్ని ఉపాధి రంగంగా ఎంచుకున్న యువత కూడా విదేశాల్లో శిక్షణ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఓ అధ్యయనం ప్రకారం పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగాల ద్వారా వచ్చే ఆదాయం కన్నా, అధిక రెట్లు ఆదాయం ఫ్యాషన్‌ రంగం ద్వారా ఆర్జిస్తున్నారని తేలిందట. నిజంగా నమ్మశక్యం కాని సమాచారమే కదా. అంటే అర్ధం చేసుకోవాలి ఫ్యాషన్‌ పట్ల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో. ఇక ఒక్కసారి ఫ్యాషన్‌ కళలో మెలకువలు తెలుసుకుంటే చాలు, ఎన్ని రకాలుగా అది ఉపాధి అవకాశాల్ని తెచ్చిపెడుతుందో చెప్పలేం. మినిమమ్‌ ట్రిక్స్‌ తెలుసుకుని, కొద్దిగా బుర్రకు పదును పెడితే లక్షల్లో ఆదాయం ఆర్జించొచ్చునట. అంతేకాదు, ఓ వైపు ఫ్యాషన్‌ రంగంలో సత్తా చాటుతూనే, ఇతర రంగాల పైనా దృష్టి పెట్టే అవకాశం ఒక్క ఫ్యాషన్‌ రంగానికే ఉందంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు, టైలరింగ్‌, హెయిర్‌ కటింగ్‌, మేకప్‌.. ఇలా ఒక్కటేమిటి ఈ కళకేదీ కాదు అనర్హం.

ఫ్యాషన్‌ పట్ల యువతకున్న ఆసక్తిని బట్టి, ఆ కళను మరింత మెరుగుపరిచే దిశగా శిక్షణ ఇచ్చేందుకు బోలెడన్ని ఫ్యాషన్‌ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. స్తోమత, ఆసక్తి ఉన్నవాళ్లు ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి, విదేశాల్లో ట్రైన్‌ అయ్యి వస్తుంటే, అంతటి స్తోమత లేని వాళ్లు స్వదేశీ శిక్షణలోనే ఆరితేరి లాభాలు ఆర్జిస్తున్నారు. దటీజ్‌ ది ఫ్యాషన్‌. ఇంకెందుకాలస్యం. మీక్కూడా ఆసక్తి ఉంటే, జస్ట్‌ ట్రై చేసి చూడండి. మీతో పాటు, పది మందికి ఉపాధి పంచే అవకాశం కలుగుతుంది ఈ రంగం ద్వారా. అదీ సంగతి.  

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు