నిత్య దీపావళి * - డా.కె.ఎల్ .వి.ప్రసాద్ , హనంకొండ

nitya deepavali

అదిఒక సాధారణ పల్లెటూరు .ఆ ..వూరిలో దిగువ  మద్య తరగతి ,కుటుంబం మాది .కానేటి వంశం . కాస్తో ..కూస్తో పేరున్న చదువరుల కుటుంబం _ మాది .ఊరిపేరు ' దిండి '.కోనసీమగా ,అందాల .. సుందర సీమగా పేరుపొందిన ,తూర్పుగోదావరి  జిల్లా ,మల్కీ పురం మండల్ (పూర్వం రాజోలు .. తాలూకా )ఇప్పుడు ,మంచి సందర్శక స్థలంగా మారింది ,దిండి ..రిసార్ట్స్ వెలిశాయి.

మా గ్రామంలో పేదల ఇళ్లు ఎక్కువ ,ధనికుల (క్షత్రియులు )ఇళ్లు ,బహుతక్కువ .అందుచేత  పండుగల సంబరాల సందడి ,ఆ ధనికుల ఇళ్లల్లోనే  ఎక్కువగా కనిపించేది . మా ఇళ్లల్లో సంక్రాంతికి తప్ప ,ఇతర పండుగలకు  అంత గ ,ప్రత్యేకత కనిపించేది కాదు .పైగా నేను  ' బోగి పండుగ ' రోజున పుట్టిన వాడిని . దీపావళి కి ,అందరూ ,ఆనందంగా ,టపాకాయలు కాలుస్తున్నా ,అసలు టపాకాయలు  ఎందుకు  కాలుస్తారో తెలియకున్నా ,నేను వాటిని కాల్చలేక . పోతున్నానన్న బాధ ,గుండెలను పిండేస్తుండేది. కారణం ...పేదరికం ,కమ్యూనిస్టు కుటుంబ వాతావరణం .చెప్పలేనంత క్రమశిక్షణతో  కూడిన జీవన  శైలి ..పండుగలకు ప్రాదాన్యత లెని కుటుంబ వాతావరణం.చదువే ద్యేయంగ కలలుకన్న జీవితం .

*           *         **

ఇప్పుడేముంది గానీ ,నా చిన్నతనం లో  దీపావళిని గుర్తు చూసుకుంటే ,ఒకపక్క ఆనందం,మరొపక్క బాద కలుగుతాయి . ఇప్పుడు ,దీపావళి టపాసులు ,ఇతర క్రేకర్స్ కొనే స్థోమత ఉన్నా ,ఆ ..ఉత్సాహం అడుగంటి పొయింది !చిన్నప్పుడు వీటిని  కొనే స్తోమత లేదు ,పైగా ఇంట్లో కమ్యూనిస్టు  సంస్కృతి వాతావరణం ,పండుగలు , పబ్బాలు ఉండేవి కాదు !సహజంగా టాపాసు లకు ,ప్రాధాన్యం ఉండేది కాదు . నిజం చెప్పాలంటే ,కొనుక్కునే స్తోమత  తల్లిదండ్రులను అడిగే ధైర్యము ఉండేవి కాదు ! స్వయంగా చిటికెల పొట్లం తయారు చేసుకుని గిర గిరా తిప్పుతుంటే ,అగ్ని పూలు రాలుతున్నట్టు ఉండేది.అప్పటిలో  మా పెద్దన్నయ్య స్వర్గీయ కె.కె.మీనన్ , నిరుద్యోగిగా ఉండేవాడు.దీపావళి రోజు  చీకటి పడే సమయానికి ,తాటాకు టపాకాయల గుచ్చేమ్ తెచ్చి ఇచ్చేవాడు ! వాటిని ,అప్పటిలో మేము 'పేటెపికాయ లు ' అనేవాళ్ళం.వాటిని చూసినప్పుడు కలిగే  మధురానుభూతిని ,ఇప్పటికీ నేను మరచిపోలేను .

ఇప్పుడు నా వయసు పెరిగింది , పండుగలమీద ప్రీతి తగ్గింది అన్నయ్య మీనన్ కూడాలేడు !! దీపావళి మాత్రం వచ్చిపోతూనే ఉంది .రోజులు మారాయి .ఆర్థిక స్తితిగతులతో సంబందం  లేకుండా పండుగ లు  తమ తమ స్థాయిల్లో జరుపుకునే అవకాశాలూ ఏర్పడ్డాయి .కానీ సమాజంలో ,పండగల పట్ల ఆశక్తి క్రమంగా తగ్గిపోతూ  ఉంది .మన సంస్కృతి ,సంప్రదాయాలు ,దైవభక్తి  మనుష్యుల మాదిరిగానే పరదేశాలకు వలస వెళ్లిపోతున్నాయి.ఇతరదేశాలలో ,మన సంస్కృతి సంప్రదాయాల వ్యాప్తి ని ,నిరోధించ మనడం  నా  ఉద్దేశ్యం కాదుగానీ ,తర తరాలనాటి మన సంస్కృతీ సంప్రదాయాలను ,ముందు తరాలకు అందకుండా చేయడం నేరం అంటున్నాను.వీటికి కులం ,మతం ,ప్రాంతం ,ఆపాదించ కూడదు అంటున్నాను. సంపాదన వెంట పరుగులు తీస్తున్న మానవ మనః స్తత్వం ,టపాకాయలు కాల్చడం అంటే ,కరెన్సీని బూడిద చేయడమేనని భావిస్తున్నది.

ఒకప్పుడు పెద్దల ఆలొచన దీనికి బిన్నంగా ఉండేది.దీపావళి సమయం లో ఎదురయ్యె వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ,సమస్యలను సృష్టించే ,క్రిమి ...కీటకాదుల కు ,విరుగుడుగా ,టపాకాయలు ,కాకర ..పువ్వొత్తులు ,మతాబులు ,చిచ్చుబుడ్ల ద్వారా వెలువడే వాయువులు పని చేస్తాయన్నది ,నాటి ఆలోచన !ఇందులో ,నిజంలేకపోలేదు .అయితే ప్రతిదానికి కొన్ని హద్దులంటూ ..వుంటాయికదా ! అవి మితిమీరినప్పుడే ,సమస్యల ప్రమాదం చుట్టుకుంటుంది మరి . పర్యావరణ శాస్త్ర వేత్తల అంచనాల ప్రకారం  బాణాసంచా ,ఇతర ఉత్పత్తులు ,అదికంగా  వాడడం  వల్ల ,వాతావరణ కాలుష్యం ఏర్పడి,మనిషికి  ప్రణాపాయం వరకూ తీసుకు వెళుతున్నది .దీనికి ముఖ్య ఉదాహరణ ,మన దేశ రాజధాని అయిన  ఢిల్లీ వంటి నగరాలు ఎన్నెన్నో .ఇలాంటి చోట్ల  ప్రభుత్వ పరంగా ఆంక్షలు విధించే పరిస్తితులు  ఏర్పడుతున్నాయి .ఇటువంటి అంశాలు మతపరమైన అపార్ధాలకు దారి తీస్తున్నాయి.అందుచేత ,పరిస్థితులను బట్టి ,మన ఆచార వ్యవహారాలలో స్వల్ప మార్పులు చేసుకుని ,పండుగలను కొనసాగించ వలసిందే !మనకున్న ప్రత్యేక సంస్కృతి ,సంప్రదాయాలను ముందు  తరాలకు అందించ వలసిందే ...మూఢ నమ్మకాలకు  స్వస్తి పలకవలసిందే ,జీవితాన్ని నిత్య దీపావళిగా మలుచుకొవలసిందే !!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు