చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaram

దేశంలో ప్రతీవారూ, అంతస్థితిమంతులు కాదుగా.. ఒకానొకప్పుడు  తాటాకు విసినికర్ర లుండేవి. గాలి ఆడకపోయినా, ఉక్కబోత పోసినా, హాయిగా వాటితో పని కానిచ్చేసేవారు. శ్రీరామనవమి వచ్చిందంటే, రామాలయంలో, పానకంతో పాటు, తాటాకు విసినికర్ర కూడా ఇచ్చేవారు.. (పెద్దవాళ్ళకు మాత్రమే) వంటింట్లో కుంపట్లోని బొగ్గులు మండాలంటే  వెదురు విసిని         కాలక్రమేణా ఫాషనుగా , చూడ్డానికి పొందిగ్గానూ, మడతపెట్టడానికి వీలుగానూ ఉండేవి వచ్చాయి.

ఎలెట్రిసిటీ రావడంతో  ఓపికున్నవాళ్ళందరూ  Table Fans  లోకి దిగారు… టేబుల్ మీద పెట్టి, మొత్తం ఇంటి సభ్యులందరూ దాని చుట్టూరా చేరేవారు.. రాత్రిళ్ళు ఎవరికివారే ఆ హాల్లోనే నిద్రపోయేవారు. ఈ పై చెప్పినవన్నీ కాల గర్భంలో కలిసిపోయాయి.  గోడలకి వేల్లాడతీసే  Air Circulatorలూ, అవేవో  Pedastal Fan లూ వచ్చాయి.

ఇవి కాకుండా  రైళ్ళలో ఇంకో రకం ఫాన్లు అవి సాధారణంగా తిరగవు. ఓ పుల్లో, పెన్సిలో పెట్టి తిప్పితే కానీ, అవి తిరగడం మొదలెట్టవు. పైగా వాటికి ఒకే స్పీడు. తగ్గించడం, హెచ్చించడం లాటివి ఉండవు. ప్రయాణికుల్లో , ఫాన్ గాలి పడదని ఒకరూ, గాలాడటంలేదని ఇంకోరూ ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు.  కాలక్రమేణా, సీలింగు ఫాన్లలోకి దిగాము ఈ రోజుల్లో సీలింగ్ ఫాన్ లేని ఇళ్ళుండవు.   వారి వారి ఆర్ధిక స్థోమతని బట్టి, అవేవో విండో ఏసీలూ, స్ప్లిట్ ఏసీలూ ఉన్నా సరే, సీలింగు ఫాన్ మాత్రం తప్పకుండా ఉంటుందే.

ఈ రోజుల్లో ఆత్మహత్యలు చేసుకోడానికి అనేక కారణాలు చెప్తున్నారు. ఏదో ఒకటీ అరా తప్పించి, ఏ రాజకీయనాయకుడూ ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు తక్కువే… వాళ్ళు ప్రజలనుండి దోచుకున్నదంతా అనుభవించొద్దూ..?

మనందరికీ ధారాళంగా గాలి ఇస్తూన్న ఈ సీలింగు ఫాన్లని, కొంతమంది , ప్రాణాలు తీసికోడానికి కూడా ఉపయోగించుకోడం, చాలా విచారకరం. ఈమధ్యన ఆత్మహత్యలు చేసికోడానికి దీన్నో సాధనంగా ఉపయోగిస్తున్నారు.. ఆత్మహత్యలు ఎందుకు చేసికుంటున్నారూ అనేది కాదు విషయం.. ఎవరి కారణాలు వారికుంటాయి.   ప్రముఖులు ఎవరైనా ఈ అఘాయిత్యానికి పాల్పడితే  అదో పతాక శీర్షిక. అదే ఏ రైతో తను చేసిన అప్పులు తీర్చలేక, ఆత్మహత్య చేసికుంటే, వార్తా పత్రిక లోని ఏ అయిదో పేజీలోనో… ఫలానా చోట… ఇంతమంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసికున్నారూ, అని  చేతులు దులిపేసికుంటున్నారు.

పరీక్షలో తక్కువ మార్కులొస్తాయేమో అని ఒకరూ, కార్పొరేట్ కాలేజీల్లో ragging  భరించలేక ఇంకోరూ, ఇలా చెప్పుకుంటూ పోతే, దేశంలో ఎక్కడో అక్కడ ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. చిత్రం ఏమిటంటే,  చాలామంది ఈ సీలింగు ఫాన్లనే సాధనంగా ఉపయోగిస్తున్నారు.  అలాగని రాత్రికి రాత్రి ఈ సీలింగ్ ఫాన్లని, నిషేధించమంటే  ఎలాగండి బాబూ?   ఒంటిమీద తెలివుండి మాట్టాడే మాటెనా ఇది? ఏదో నోరుందికదా అని నోటికొచ్చినట్టు వాగడం. దానికి  ప్రసారమాధ్యమాలు publicity  ఇవ్వడం.   అప్పుడప్పుడు రైళ్ళు పట్టాలు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని, రేపు ఏ తలమాసినవాడో  రైళ్ళు ఎత్తేయండంటే చెల్లుతుందా? అలాగే ఎన్నో ఎన్నెన్నో ప్రమాదాలు జరుగుతూంటాయి ప్రతీ రోజూ, అలాగని వాటిని మూసేయమంటే కుదురుతుందా? పురుగుమందులు  (pesticides) తాగి ఆత్మహత్యలు చేసికుంటున్నవారు ఎంతమందో. కానీ, వాటిని నిషేధిస్తే, పంటలకు పట్టే చీడ ఎలా తగ్గించడం? 

ఈ ఫాన్ లకి ఉరిపోసుకుని ఆత్మహత్యలు చేసుకోవడం ఈ మధ్య చాలా ఎక్కువయింది… మధ్యమధ్యలో కొత్త పధ్ధతులుకూడా ఉంటున్నాయి, కానీ చేతికందుబాట్లో ఉండేది ఈ సీలింగ్ ఫాన్లే..

కల్తీ సారాలు తాగికూడా జనాలు ప్రణాలు కోల్పోతూంటారు.. అసలు వాళ్ళని తాగమన్నదెవడూ? ప్రభుత్వాలే హాయిగా  క్వాలిటీ సారా అదీ చవకలో సరఫరా చేస్తే గొడవుండేది కాదు కదా… మళ్ళీ దాన్ని తయారు చేయడం కంటే, కల్తీసారా తాగు చనిపోయినవాళ్ళకి పరిహారం ఇవ్వడం చవకలో తేలిపోతుందేమో ?

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి