25-10-2019 నుండి 31-10-2019 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

 ఈవారం సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు, చేపట్టిన పనుల విషయంలో స్పష్టత క్లైగి ఉండుట సూచన. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నం విఫలం చెందుతారు. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకునే ప్రయత్నం మంచిది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. మిత్రులనుండి రావాల్సిన సహాయం కాస్త ఆలస్యంగా అందుతుంది. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం కలదు. పూజాదికార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు.

 

 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం ముఖ్యమైన విషయాల పట్ల స్పష్టత కలిగి ఉండుట సూచన, పెద్దలతో చర్చలకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయ వంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం ఉపయోగపడుతుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. సామజికపరమైన రంగాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. మిత్రులను కలుసుకుంటారు. 

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

  ఈవారం కుటుంబపరమైన విషయాల్లో కీలకమయిన నిర్ణయాలు తీసుకుంటారు. చర్చాపరమైన విషయాల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ముందుగా గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో కాస్త తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. మీ మొండితనం కొన్ని పనులను పూర్తిచేసేలా చేస్తుంది. స్త్రీ పరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం సూచన.

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. పెద్దలతో మీకున్న పరిచయం మీకు ఉపయోగపడుతుంది. సంతానం విషయంలో నూతన ఆలోచనలకు అలాగే నిర్ణయాలకు ప్రధాన్యం ఇస్తారు. రావాల్సిన ధనం సమాయానికి చేతికి అందుతుంది. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన నలుగురిలో మంచి పేరు లభిస్తుంది. ఉద్యోగంలో బదిలీ లేక ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులతో లేక మిత్రులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. సంతానం విషయంలో వేచిచూసే ధోరణి మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా పడుతుంది.

 

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

 ఈవారం సొంత నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారు, కుటుంబసభ్యులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. కుటుంబంలో శుభకార్యక్రమాల గురుంచి చర్చ జరుగుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. పెద్దలతో విభేదాలు రాకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది,నూతన అవకాశాలు పొందుతారు. 

 

 

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం ఆరంభంలో కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. ముందుగా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుట మంచిది. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. వాహనాల విషయాల్లో కాయస్థ జాగ్రత్తగా ఉండుట సూచన. స్త్రీ పరమైన లేదా నూతన భాగస్వామ్య విషయాల్లో ఓపిక అవసరం. ఊహించని ఖర్చులకుఆస్కారం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. చర్చలకు దూరంగా ఉండుట సూచన.

 

 


వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

 ఈవారం బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది, వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభ్సితుంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. కాస్త మీ నిర్ణయంలో తడబాటు ఉండిన , అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. స్వల్పఅనారోగ్య పరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు.

 

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం ఉద్యోగంలో చేసే నూతన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపారంలో నూతన ఆలోచనలకు అవకాశం ఉంది, పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నంలో కాస్త అనుకున్న ఫలితాలు పొందే అవకాశం ఉంది. రుణపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. సంతానం నుండి నూతన విషయాలు తెలుస్తాయి, వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి.

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

 ఈవారం చర్చాపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది, వేచిచూసే ధోరణి మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండుట సూచన, చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు నలుగురిని సహకారం అడిగే ప్రయత్నం మంచిది. మిత్రులతో సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది.

 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం మొదట్లో చేపట్టిన పనుల్లో ఊహించని ఇబ్బందులకు అవకాశం ఉంది. ఫలితాలు ఆశించిన మేర రాకపోవచ్చును. చర్చాపరమైన విషయాల్లో అందరిని కలుపుకొని వెళ్ళుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముద్నుకు సాగుతాయి. చిన్న చిన్న నిర్ణయాల్లో మీరు తొందరపాటు విధానం కలిగి ఉండుట వలన ఇబ్బందులను పొందే అవకాశం ఉంది. సంతానం నుండి ముఖ్యమైన విషయాలు లేదా సమాచారం పొందుతారు. వాహనాల వలన ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది, కాస్త జాగ్రత్త అవసరం. ప్రయాణాలు చేస్తారు.

 

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది, వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి ఈవారం పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారితో మనస్పర్థలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ పరమైన విషయాల్లో ఎదో తెలియని ఒక నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది. విదేశీప్రయానాలు చేయువారికి అనుకూలమైన సమయం. స్వల్పఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కోల్పోయే ఆస్కారం ఉంది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడిపే విషయంలో కూడా కొంత వ్యతిరేక ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది.
 

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి