చర్మం పొడిబారుతోందా.? జరంత జాగ్రత్త సుమీ.! - ..

Dry skin? Careful

ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి. దాంతో చలి ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. చలికాలమొచ్చిందంటే, ముఖ్యంగా బాధించే ఆరోగ్య సమస్య చర్మ సమస్య. చర్మం పొడిబారి నిర్జీవంగా మారిపోతుంటుంది. చిన్న పిల్లల దగ్గర నుండి, పెద్ద వయసు వారి వరకూ అతి కీలకంగా బాధించే సమస్య ఇది. ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి ఈ సీజన్‌లో చాలా రకాల మాయిశ్చరైజర్లు వాడుతూ ఉంటారు. ఈ స్కిన్‌ క్రీమ్స్‌ శరీరానికి ఎంత మేర శరీరానికి క్షేమకరం.? ఈ చలికాలంలో చర్మం పొడిబారకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఈజీగా మార్కెట్లో దొరికే క్రీములతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి.? క్లుప్తంగా తెలుసుకుందాం.

మారిన వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్ల కారణంగా, మనిషి మళ్లీ రాతియుగంలోకి వెళ్లిపోతున్నాడని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే, అప్పుడెప్పుడో మట్టి పాత్రల్లో వండుకుని, మట్టి పాత్రల్లోనే తినేవాళ్లం. అదే ఇప్పుడు ట్రెండీ ఫ్యాషన్‌ పేరుతో మళ్లీ వాడుకలోకి వచ్చింది. ఫ్యాషన్‌ వెర్రితలలు తొక్కుతున్న నేటి తరుణంలో, ఓల్డ్‌ ట్రెడిషన్స్‌ని న్యూ ట్రెండ్స్‌గా మార్చేస్తున్నారు. అలాగే సౌందర్య లేపనాల విషయంలోనూ సహజంగా లభించే పసుపు, గంధం, కొబ్బరినూనె వంటి ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఎప్పుడో చర్మం మర్చిపోయిన ఈ ప్రొడక్ట్స్‌ని మళ్లీ చర్మానికి అలవాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సీజనల్‌ క్రీములు వాడే కన్నా, అమ్మమ్మలు, బామ్మలు చెప్పే సహజమైన హెల్త్‌ టిప్స్‌ని వాడేందుకు ముఖ్యంగా యువత ఎక్కువ ఆసక్తి చూపుతోంది.

ఆ క్రమంలోనే, వాడే సబ్బుల దగ్గర నుండి, చర్మానికి పూసుకునే రకరకాల క్రీముల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో హైలీ కాన్‌సన్‌ట్రేటెడ్‌ సబ్బుల జోలికి పోకూడదు. కొబ్బరి నూనెతో ఒంటిని మర్దన చేసుకుని, తక్కువ గాఢత గల సబ్బుతో స్నానం చేయాలి. ఆ తర్వాత చర్మం పొడిబారకుండా ఉండేందుకు వాడే క్రీముల్ని, చర్మ నిపుణుల సూచనలు, సలహాల మేరకే ఉపయోగించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.అనవసరంగా స్కిన్‌ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ బారిన పడేయకుండా ఉంచాలంటే, కమర్షియల్‌ యాడ్స్‌లో చూసి, మార్కెట్లో దొరికే రకరకాల స్కిన్‌ క్రీమ్స్‌ని విచ్చల విడిగా ఉపయోగించే అలవాటుకు చరమ గీతం పాడాల్సిందే.
చర్మానికి  సంబంధించి ముఖం అతి సున్నితమైంది. కానీ, శీతాకాలంలో ముఖం పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. ఏదో ఒక ఫేస్‌ క్రీమ్‌ రాయకపోతే, గుమ్మం దాటి బయటికి వెళ్లలేని పరిస్థితి. ఇక్కడే ఏమాత్రం కాంప్రమైజ్‌ కాకూడదు. అన్ని రకాల ఫేస్‌ క్రీములు అన్ని చర్మ తత్వాలకూ సరిపడవు. అన్ని వయసుల వారికీ ఒకే స్కిన్‌ క్రీమ్‌ కూడా సూటవకపోవచ్చు. ఆ ఎఫెక్ట్‌ శీతాకాలంలో మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే మన చర్మ తత్త్వానికీ, వయసుకు సరిపడే ఫేస్‌ క్రీమ్‌కి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. చర్మం అంటే కేవలం ముఖం, పైకి కనిపించే చేతులు మాత్రమే కాదు, ఈ కాలంలో ఎఫెక్ట్‌ అయ్యే మరో ముఖ్యమైన సమస్య చుండ్రు సమస్య. చర్మం పొడిబారిపోవడంతోనే ఈ చుండ్రు సమస్య మరింత ఎక్కువవుతుంది. చుండ్రు బాధ నుండి దూరంగా ఉండాలంటే, ఆయిల్‌ ఫుడ్స్‌, జంక్‌ ఫుడ్స్‌ జోలికి పోకుండా ఉంటే మంచిది.

చర్మ సమస్యల నుండి దూరంగా ఉండాలంటే, అన్నింటికన్నా ముఖ్యమైనది డైట్‌. ఇక డైట్‌ విషయానికొస్తే, వాటర్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం పొడిబారడాన్ని చాలా వరకూ నివారించుకోవచ్చు. రోజులో కనీసం 4 నుండి 5 లీటర్ల వరకూ నీటిని తీసుకోవాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు మన చర్మాన్ని తాజాగా ఉంచుకునేందుకు సహకరిస్తాయి. చేపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాల వృద్ధి జరిగి, తగినంత తేమ అందుతుంది. చేపలు తినే అలవాటు లేని వారు వాల్‌ నట్స్‌, బాదం వంటి వాటిని ప్రిఫర్‌ చేయాలి. ఇవి చర్మం పొడిబారడాన్ని కాస్త తగ్గిస్తాయి. ఈ సీజన్‌లో దొరికే శీతాఫలం, జామ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే, శీతాకాలం పొడిబారిన చర్మం నుండి ఒకింత ఉపశమనం పొందే అవకాశముంది. ఎంత చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అన్ని సమస్యల నుండీ పూర్తిగా బయటపడడం సాధ్యం కాదు కానీ, ఎంతో కొంత ఉపశమనం పొందగలమనడంలో సందేహం లేదు.

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి