చెట్టులెక్కగలవా.? ఓ నరహరి పుట్టలెక్కగలవా.? - ..

Chettulekkagalava.

ఒకప్పుడు పొద్దున్న లేస్తే ఏదో ఒక పని ఉండేది. ఆరేళ్ల చిన్న పిల్లాడి నుండి, ఆరు పదుల ముదుసలివరకూ తమకు తోచిన పని చేయడంతో, శరీరానికి తగినంత వ్యాయామం జరిగేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉన్న చోట నుండి కదిలే అవసరం లేదు. చేతిలో ఇంటర్నెట్‌. లేదా స్మార్ట్‌ మొబైల్‌. ఏది కావాలన్నా, అరనిమిషంలో మన ముందుంటుంది. దేని కోసమూ ఎక్కువ దూరం వెళ్లాల్సిన పని లేదు. పెద్దగా కష్టపడాల్సిన అవసరమూ లేదు. చిన్నపిల్లల విషయానికి వస్తే, ఆట కూడా రెడీమేడ్‌ అయిపోయింది. ఏడాది వయసు నుండే చేతికి మొబైల్‌ ఫోన్‌ ఇచ్చేస్తే, చక్కగా కూర్చొని కార్టూన్స్‌ వీక్షిస్తున్నారు. ఇంకొంచెం హైపర్‌ యాక్టివ్‌ అయితే, వీడియో గేమ్స్‌ కూడా ఆడేస్తున్నారు. అలా మారిపోయింది నేటి ట్రెండ్‌. శారీరక వ్యాయామానికి బొత్తిగా దూరం కావడంతో, అనేక రోగాల బారిన పడుతున్నారు.

ముసలి వాళ్ల వ్యవహారం ఇంకో తీరు. ఒకప్పుడు తమ తోటి వయసు వారితో కలిసి ముచ్చటించేందుకు కాసేపు అలా నడిచి వెళ్లేవాళ్లు. కానీ, వారి వయసుకూ సరిపడా మొబైల్‌ గేమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. దాంతో వారికీ శారీరక వ్యాయామం అందడం లేదు. స్కూళ్లలో ఆటలకు సంబంధించిన ప్రాధాన్యతే కనిపించడం లేదు. అపార్ట్‌మెంట్‌ స్కూళ్లు, ప్లే గ్రౌండ్‌ ఊసే లేదు. దాంతో మెదడుకి ఒత్తిడే కానీ, శరీరానికి సరిపడా వ్యాయామం పిల్లలకూ ఉండడం లేదు. దాంతో పిల్లల్లోనూ రకరకాల ఆనారోగ్య పరిస్థితులు తలెత్తుతున్నాయి. చిన్న వయసు నుండే మోకాలి నొప్పులు వగైరా, వగైరా సమస్యలు చూస్తున్నాం. ఇక ఆడవాళ్ల విషయానికి వస్తే, వంటగదిని ఓ డెకరేటివ్‌ ఆబ్జెక్ట్‌గా మార్చేశారు. స్విగ్గీస్‌ తదితర ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్స్‌ వచ్చేశాకా, మహిళలు వంట జోలికే పోవడం లేదు. దాంతో కనీసపాటి వ్యాయామం మహిళల్లో ఉండడం లేదు. చాలా మంది పురుషుల్లోనూ వర్క్‌ ఎట్‌ హోమ్‌ పేరిట శారీరక వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు. ఇలా కారణాలేమైనా కావచ్చు, శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. దాంతో అక్కడ నొప్పీ, ఇక్కడ నొప్పీ అని డాక్టర్‌ దగ్గరికెళ్తే, శారీరక వ్యాయామం ఉండాలని సలహా ఇస్తారు. అందుకోసం మళ్లీ డబ్బులు పెట్టి, జిమ్‌లలో జాయిన్‌ అవడం, నాలుగు గోడల మధ్య కంజెస్టెడ్‌ ఏరియాల్లో ఆ జిమ్‌ వాతావరణం. అక్కడా శాటిస్‌ఫేక్షన్‌ లేదు. మరి ఏం చేసేది.?

అలా పుట్టిందే ఈ నయా ట్రెండ్‌. వీకెండ్స్‌ ఎంజాయ్‌మెంట్‌. అందులో భాగంగా, సిటీకి దూరంగా, పల్లె వాతావరణానికి వెళ్లిపోతున్నారు. కనీసం వారంలో ఒక్కరోజైనా శరీరానికి వ్యాయామం అవసరమని గుర్తించిన కొన్ని ఫ్యామిలీలు గ్రూపులు గ్రూపులుగా సిటీ అవుట్‌ కట్స్‌కి వెళ్లి అక్కడ చెట్టూ, చేమా, పుట్టా, గట్టులను ఎంజాయ్‌ చేస్తున్నారు. తమ వయసును మర్చిపోయి సహజమైన వాతావరణంలో కాసేపు ఊపిరి పీల్చుకుంటున్నారు. తద్వారా మానసికోల్లాసంతో పాటు, శారీరక శ్రమ కూడా దక్కుతోంది. ఈ క్రమంలోనే నగర శివార్లలో ట్రెక్కింగ్‌ తదితర ఎంజాయింగ్‌ గేమ్స్‌ ఏర్పాటయ్యాయి. వాటిని వీకెండ్‌ ఎంజాయ్‌మెంట్‌లో భాగంగా నగర వాసులు ఎంజాయ్‌ చేసి అలసిపోతున్నారు. వారి అభిరుచులకు తగ్గట్టుగా ఆయా సంస్థలు అదే ఉపాధిని ఆర్ధిక ఆర్జన పొందుతున్నారు.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి