నవ్వుల జల్లు - జయదేవ్

రక్షక భటుడు : బుగ్గ మీద చిన్న మొటిమ లేచింది... ఆ మాత్రానికే రాజుగారు విచారపడిపోతున్నారే?
రాజ వైద్యుడు : రాచకురుపు లేవ లేదే అని, అవమానకరంగా వుందని, మధనపడిపోతున్నారు!!


రాజుగారు : నేను దేశాటనకి వెళ్తున్నాను. తిరిగొచ్చేదాకా, రాజ్యభారం, రాజ్యరక్షణ, రాజ్యపాలన అంతా నీదే!
రాణిగారు : ఐతే నెమ్మదిగా తిరిగి రండి!!!

భటుడు : చెరసాల - 214 నుంచి, ఖైదీ - 116 తప్పించుకు పారిపోయాడు ప్రభూ!
ప్రభువు : ఆ ఖైదీని చివరిసారిగా కలిసిన వాళ్ళెవరు?
భటుడు : యువరాణీ గారు ప్రభూ!
ప్రభువు : ఐతే యువరాణి గారూ కనిపించటం లేదా?
భటుడు : యువరాణిగారున్నారు! మహారాణి గారు కనిపించడం లేదు ప్రభూ!


ముసలి రాజు : నువ్వు కవల పిల్లల్ని కన్నావ్! ఆ ఇద్దర్లో ఒకడు దుర్మార్గుడైతే, ఇంకొకడు సన్మార్గుడుగా ఎదగాలిగా?
ముసలి రాణి : ఏం చేయమంటారు... మన దురదృష్టం, ఇద్దరూ దుర్మార్గులయ్యారు! మనం ఈ చెరసాలలో మగ్గుతున్నాం!!


మిత్రుడు : మిత్రమా నువ్వు రచించిన వీధి నాటకం, ప్రదర్శనకు సిద్ధముగా నున్నదా?
నాటక రచయిత : అన్నీ సిద్ధముగానే వున్నాయి. వీధి మాత్రం సిద్ధంగా లేదు. ఎక్కడ చూసినా గుంటలు, బురద నీళ్ళు!!


పెద్ద పూజారి : ఈ రోజు విఘ్నేశ్వరుడికి పాలాభిషేకం జరిగింది కదా? కొంచెం పాలు, ఆ తీర్ధం చెంబులో పోసివ్వు!
చిన్న పూజారి : ఇంకెక్కడి పాలు? వినాయకుడు చుక్క మిగల్చకుండా తాగేశాడు గా!!
 


తపస్వి : స్వామీ... పిలచిన తడవుగానే వచ్చేశావు! ముందుగా రంభ, మేనక, తిలోత్తమలని పంపిస్తా ననుకున్నానే?
బ్రహ్మ దేవుడు : నువ్వొట్టి బుద్ధావతారమని తెలిసి, వాళ్ళని వేరే చోట్లకి పంపించి, నీకు ప్రత్యక్షమయ్యాను నాయనా!!


వైద్య శిరోమణి : ఈ లేహ్యంలో పదహారు వనమూలికలు, ఇరవై రెండు శక్తివంతమైన లవణాలూ వున్నాయి. ఇది సర్వరోగ నివారిణి. ఐతే దీన్ని చిక్కటి గవుడు గేదె పాలు తోనే సేవించాలి!!
ముసుగు మనిషి : (ముసుగు తొలగించి), పాలుతో గాక నీటితో సేవించానయ్యా, ఇలా ఐపోయాను!!
వైద్య శిరోమణి : ఎవర్రా అక్కడ? ఈ అస్థిపంజరాన్ని స్మశానంలో పడవేసిరా పో.
 


ఒకడు : నీకు రాజుగారి ప్రధాన అంతఃపురంలో ఉద్యోగం దొరికిందటగా? ఏం ఉద్యోగం?
ఇంకొకడు : "ఎవర్రా అక్కడ" ఉద్యోగం!!


భటుడు : సేనాధిపతి గారూ, కోట తలుపులు బిగుసుకు పోయాయి!
సేనాధిపతి : పాతిక మంది చేత ఒక దుంగను మోసుకెళ్ళి తలుపులుకి గుద్ధించండి!!
భటుడు : గుద్ధించాం... తలుపులు తెరుచుకోలే... కోట గోడకి పెద్ద చిల్లు పడింది!!!

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి