మేష రాశి : (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )
ఈవారం ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకొనే విషయంలో తొందరపాటు వద్దు. ఉద్యోగంలో శ్రమ అలాగే పనిఒత్తిడి తప్పక పోవచ్చును. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో జీవిత భాగస్వామి విషయాల్లో సర్దుబాటు విధానం మంచిది. అనుభవజ్ఞుల సూచనలు మీకు లబ్దిని కలుగజేస్తాయి. అనుకోకుండా దూరప్రదేశం ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్త అవసరం. మానసికం ఇబ్బందులు పెరుగుటకు అవకాశం కలదు. దైవ పరమైన విషయాలకు సమయం ఇవ్వండి.
వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)
ఈవారం కుంటుంబపరమైన విషయాలకు బాగా ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబంలో పెద్దల నుండి వచ్చే సూచనలు గౌరవించడం ద్వారా మేలు జరుగుతుంది. సంతానపరమైన విషయంలో కొంత ఒత్తిడి తగ్గుతుంది. బంధువులను కలుస్తారు. బంధువులతో సమయం సరదాగా గడుపే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వలన తప్పక మేలుజరుగుతుంది. గతంలో పెద్దలతో మీకున్న విభేదాలు సద్దుమణిగే ఆస్కారం ఉంది. చర్చల్లో కాస్త నిదానంగా ఉండటం సూచన. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది.
మిథున రాశి : (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో కలిసి సమయాన్ని గడుపుతారు. చేపట్టు పనుల విషయంలో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. చేసేప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దలతో మీకున్న పరిచయం లబ్దిని కలిగిస్తుంది.వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. కుటుంబంలో పెద్దలతో చర్చలకు అవకాశం ఉంది , మీ ఆలోచనలను వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తారు. బంధువులనుండి పూర్తిగా సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో బాగానే ఉంటుంది.
కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)
ఈవారం ఆరంభంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. గతంలో చేపట్టిన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోవచ్చు. మిత్రులతో కలిసి సమయం సరదాగా గడుపుతారు. సోదర సంబంధ విషయాలలో మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటారు. మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టమైన అవగాహన కలిగి వుండడం ద్వారా మేలు జరుగుతుంది. ఆర్థిక విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు.
సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )
ఈవారం కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పెద్దలతో చర్చలకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలు ఏర్పడుతాయి. సంతాన పరమైన విషయాలకు సమయం ఇస్తారు.వారి విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. రుణపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును. మీ శక్తికి మించిన హామీలకు దూరంగా ఉండుట వలన తప్పక మేలుజరుగుతుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.
కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )
ఈవారం గతవారంలో కంటే పనులు వేగంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. చేపట్టే పనులు విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అనుభవఘ్నల నుండి సలహాలు, సూచనలు పొందుతారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింత ధృడమయ్యే అవకాశం వుంది. చిన్న చిన్న విషయాలను అశ్రద్ధ చేయకుండా ముందుకు వెళ్ళడం ద్వారా లబ్ధి పొందుతారు. బంధువులతో కలసి శుభకార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగాఉంటుంది , నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.
తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )
ఈవారం పెద్దలను కలుస్తారు, వారి నిర్ణయాల మేర ముందుకు వెళ్ళండి. గతంలో చేపట్టిన పనులను విజయవంతనగా పూర్తిచేసే అవకాశం ఉంది. పెద్దల అభిప్రయాలను గౌరవించుట అలాగే చర్చల్లో కాస్త నిదానంగా ఉండుట సూచన. నూతన పెట్టుబడుల విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. బంధువులను కలుస్తారు, కుటుంబంలో శుభకార్యాక్రమాలు జరుగుటకు అవకాశం కలదు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )
ఈవారం వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు శ్రీకారం చుడతారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. చిన్న చిన్న విషయాలకు సైతం ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకోవడం కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అవుతాయి. పెద్దలతో విభేదాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో మీ నిర్ణయాలను వాయిదా వేసుకోవడం సూచన. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు.
ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )
ఈవారం వ్యాపార విషయాలలో నూతన నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తారు. గతంలో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఆరంభంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదుర్కకొన్నప్పటికి రాను రాను చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సమయం సరదాగా గడుపుతారు. శుభకార్యక్రమాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. వారం చివర్లో చిన్న చిన్న మానసిక ఒత్తిడులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మిత్రులతో ఊహించని విధంగా విభేదాలు ఏర్పడుటుకు ఆస్కారం కలదు , జాగ్రత్త అవసరం.
మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )
ఈవారం నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వమితో మీ ఆలోచనలు పంచుకోవడం సూచన. చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట మేలు. స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండుట ఉత్తమం. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆత్మీయులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. సంతాన పరమైన విషయాల్లో ఒకింత ఆందోళన పొందిన, చివరకు కాస్త సమస్య తగ్గుతుంది.
కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )
ఈవారం పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చర్చాపరమైన విషయాలకు సమయం ఇవ్వకపోవడం సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. జీవితభాగస్వమితో మీకున్న విభేదాలు మరింతగా పెరుగుటకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత మేర విభేదాలకు దూరంగా ఉండుట మంచిది. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.
మీన రాశి : (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )
ఈవారం ఆరంభంలో చక్కగా ఉంటుంది. స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళితే ఈ వారం అంతా చక్కగా ఉంటుంది. చేపట్టే పనులలో స్పష్టత కలిగి చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకుండా ముందుకు వెళ్ళడం సూచన. మీ మాట తీరు కొంత మందికి ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుంది కావున మాట్లాడే ముందు ఆచితూచి వ్యవహరించాలి. సంతాన ప్రయత్నాలకు పెద్ద పీట వేస్తారు. వ్యాపార విషయాలలో మిశ్రమ ఫలితాలు. తండ్రితరుపు బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన పనులను మొదలు పెడతారు.