దేహానికి అవసరమైన శక్తి - సామర్ధ్యాలను అందించడానికి మనం తీసుకునే ఆహార పదార్ధాలు అవి ఎలాంటివైనా ,మెత్తగా నామలబడాలి ,తర్వాత సులభంగా జీర్ణమై శక్తినీ, రక్తాన్ని అందివ్వగలగాలి. అంటే, ఈ ప్రక్రియలో దంతాల ప్రధాన పాత్ర ఎంతటిదో మనకు అర్ధం అవుతుంది. అలాంటి దంతాలను జీవితాంతం సంరక్షించుకోవడానికి ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఈ నేపథ్యంలో దంత సంరక్షణ -నోటి పరిశుభ్రత గురించి తెలుసుకునేముందు ,మన దంతాల స్వరూప ,స్వ-భావాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మన నోరు తెరవగానే కనిపించేది నోటి కుహరం (oral cavity)అందులో ఒక నాలుక రెండు దౌడలూ ఉంటాయి. పై దౌడ పుర్రెతో అతకబడి కదలకుండా ఉంటుంది. దీనిని పై దౌడ లేక మాక్సిలా (maxilla)అంటారు. రెండవది అతిముఖ్యమైనదీ ,క్రింది దౌడ లేదా మాండిబుల్ (mandible) అంటారు. ఇది పుర్రెలోని పక్క భాగంలో ఇరువైపులా కీలు సహాయం తో అమర్చబడి కదిలే గుణాన్ని కలిగి ఉంటుంది. దీనివల్లనే ఆహార పదార్ధాలు నమలడం (mastication) అనే ప్రక్రియ సుసాధ్యం అవుతున్నది. ఇలా క్రింది దౌడ కదిలే గుణాన్ని సాధ్యం చేస్తున్న కీలును దౌడ కీలు లేదా --Tmporo mandiular joint (TMJ)అంటారు. రెండు దౌడలూ పళ్ళను కలిగి ఉంటాయి. ఇవి రెండు దశలలో ఉంటాయి.
మొదటిది పాలపళ్ళు దశ (deciduous teeth)రెండవది స్థిరదంతాల దశ (permanent teeth)పాలపళ్ళు పై దౌడలో పది ,క్రింది దౌడలో పది మొత్తం కలిపి 20 ఉంటాయి. ఇవి ఆరవ నెల వయసులో రావడం ప్రారంభించి ,రెండు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి దంతాల రాకడ పూర్తి అవుతుంది. ఇవి ఆరు సంవత్సరాలవరకూ నిలకడగా వుండి ఆ తర్వాత రెండు ఊడడం మొదలు పెడతాయి. ఆ స్థానంలో స్థిర దంతాలు రావడం మొదలు పెడతాయి. ఈ ప్రక్రియ 12 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు కొనసాగుతుంది.ఈ పరిస్థితి లో పై దవుడలో చివర,కుడివైపు ఒకటి ,ఎడమవైపు ఒకటి ,అదేవిధంగా క్రింది దవుడలో ,చివర కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి ,విసురుడు దంతాలు (molars) తప్ప అన్నీ ఉంటాయి. ఈ చివరి విసురుడు దంతాలను ‘ జ్ఞాన దంతాలు ‘(wisdom teeth) ఇవి 17- 22 సంవత్సరాల మధ్యకాలంలో దవుడలలో కని --పిస్తాయి. ఇవి నమిలే విషయంలో అంతగా ఉపయోగానికి రావు. ఈ చివరి పై దవుడ క్రింది దవుడ,దంతాలు ఒకదానికొకటి ఆనుకోకపోవడం వల్ల (occulusal contact ) ఈ ప్రక్రియకు అవకాశం ఉండదు. ఈ విధంగా పై దవుడ లో16,క్రింది దవుడలో 16 కలసి మొత్తం 32 స్తిరదంతాలు ఉంటాయి. దంత సంరక్షణ లో జాగ్రత్తలు పాటిస్తే బ్రతికినంత కాలం ఈ పళ్ళన్నీ దవుడ లో వుండి చక్కగా ఆహార పదార్ధాల ను,నమిలే శక్తిని కలిగి ఉంటాయి. ఆ విధంగా పై దవుడ లో --రెండు ఇన్సిజార్లు (కొరికే పళ్ళు ) రెండు పక్క చిన్ని ఇన్సిజార్లు (కొరికే పళ్ళు ) రెండు కె నైన్ లు (చీల్చే సూది పళ్ళు ) నాలుగు చిన్న విసురుడు దంతాలు (ప్రీ -మోలార్స్ ) ఆరు విసురుడు (మోలార్స్ )దంతాలు (నమిలే పళ్ళు ) ఉంటాయి.
క్రింది దవుడ లో కూడా పై పద్దతిలోనే ఉంటాయి. ధవుడలో ఈ పంటి అమరికను సూచించడాన్ని ‘ డెంటల్ ఫార్ములా ‘అంటారు. పాల పళ్ల సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం ఆ వయసులో ఘాన పదార్ధాలు తినే అవసరం ఉండదు కనుక ,8 ప్రీ -మోలార్లు ,నాలుగు మూడు -----మోలార్లు నాలుగు జ్ఞాన దంతాలు పాలపళ్ళల్లో కనిపించవు. దవుడల ఆకృతి కూడా వయసును బట్టి,పళ్ళ సంఖ్యను బట్టి ,పిల్లల దవుడ లు చిన్నగానే ఉంటాయి పుట్టుకతోనే పళ్ళు వున్నవారు ,జీవితకాలం లో అసలు పళ్ళు రానివారు కూడా వుంటారు. సందర్భాన్ని బట్టి వీటి వివరాలు తర్వాత క్షుణ్ణంగా తెలుసుకుందాం