8-11-2019 నుండి 14-11-2019 వరకు వారఫలాలు, - శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

  ఈవారం పెద్దలతో మీ ఆలోచనలను పంచుకుంటారు , వారై సూచనల మేర ముందుకు వెళ్ళండి. మీ బంధువులతో సమయం గడుపుతారు. నూతన వాహనాలను కొనుగోలు చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. వారం ఆరంభంలో తల్లి తరుపు బంధువులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది, సర్దుబాటు విధానం మేలుచేస్తుంది. చర్చల్లో నిదానం మంచిది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సంతానం నుండి ఆశించిన మేర ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాలలో ఉన్న సోదరుల నుండి సహకారం లభిస్తుంది. మీ మాటతీరు కొద్దిగా మార్చుకోవడం ద్వారా ఇంకా మేలుజరుగుతుంది. 

 

 

 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం మీ ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగంలో నూతన అవకాశాల కోసం ప్రయత్నం మొదలు పెడతారు. చర్చల్లో పాల్గొనే ముందు పూర్తిగా స్పష్టత ఉండుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం ద్వారా మానసికపరమైన ఇబ్బందులను తగ్గించుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో పనిభారం తప్పక పోవచ్చును. వాహనాలను అమ్ముకొనే అవకాశం ఉంది, కొంత ఇబ్బంది పొందుతారు. బంధువులతో మాటపట్టిమ్పులకు వెళ్ళకండి. సోదరులతో కలిసి నూతన పనులను మొదలు పెడతారు. మీ మాటను అదుపులో ఉంచుకోవడం ద్వారా సగం వివాదాలను తగ్గించిన వారవుతారు. 

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

 ఈవారం మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన.  అనుకోని ఖర్చులు అయ్యే అవకాశం ఉంది, ఏమాత్రం అశ్రద్దగా ఉన్న ఖర్చులను అదుపులో ఉంచుకోవడంలో విఫలం చెందుతారు. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనల దిశగా అడుగులు వేస్తారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం కలదు, ఏమాత్రం ఆలోచన అవసరం లేదు. 

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం ముఖ్యమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మీ ఆలోచనలను పెద్దాలతో పంచుకుంటారు. తలపెట్టిన ప్రయాణాలు అనుకోకుండా వాయిదాపడే అవకాశం కలదు. విలువైన వస్తువుల విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించుట సూచన. సోదరుల నుండి మీరు ఆశించిన మేర సహకారం రాకపోవచ్చును, కొంత నిరాశకు గురయ్యే అవకాశము ఉంది. కుటుంబంలో పెద్దలకు మీ చర్యలు నచ్చుతాయి. మిత్రులతో మీ సహకారం గురుంచి చర్చలు చేస్తారు. ఆరోగ్యపరమైన విషయంలో కాస్త మంచిమార్పుకు అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో మీ భాగ్యస్వాములతో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది.తారు.
 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. పెద్దలతో మీకున్న పరిచయం బలపడుతుంది , మీ ఆలోచనలను వారితో పంచుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. భూ సంభందమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోకపోవడం సూచన, వాయిదా వేయుట మంచిది. అనుభవజ్ఞులతో మీఋ చేసే పనుల విషయంలో సలహాలను తీసుకొని, వాటిని పాటించుట మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, అలాగే స్థిరమైన ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. 

 

 

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం రావాల్సన ధనము సమయానికి చేతికి అందుతాయి. మీ వ్యాపార భాగస్వమితో మీ ఆలోచనలను పంచుకుంటారు,చర్చలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం, అలాగే అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. ముఖ్యముగా ఆరోగ్యపరమైన విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో మీ నిర్ణయాల విషయంలో సభ్యుల నుండి మిశ్రమ స్పందన వచ్చే ఆస్కారం ఉంది. వారంచివరలో కాస్త మీ ఆలోచనల్లో వేగం తగ్గించుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుతుగుతుంది. 

 

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది, మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. నూతన పనులను మొదలు పెట్టుటలో తొందరపాటు వద్దు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. ఖర్చు, ఆదాయం సమాపాలలో ఉంటాయి. కుటుంబపరమైన విషయాల్లో మీకంటూ ఒక స్పష్టమైన ఆలోచన మేలుచేస్తుంది. విదేశాల్లో ఉన్న బంధువులను కలుసుకునే అవకాశం ఉంది, వారితో చర్చలకు ఆస్కారం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు సానుకూల ఫలితాలను కలుగజేస్తాయి. సంతానం వలన పెద్దలనుండి ప్రశంశలు పొందుతారు, ఇంకా వారికి కాస్త సమయం ఇవ్వడం మేలు.  

 

 


వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

 ఈవారం ముఖ్యమైన పనులకు ప్రాధాన్యం ఇవ్వడం సూచన , అలాగని చిన్న చిన్న పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట మంచిది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన, నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వాహనాల వలన అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. మీకు రావాల్సిన సహకారం మిత్రులనుండి అందుతుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. సంతానం విషయంలో నూతన ఆలోచనలు చేస్తారు. 

 

 

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం ఆరంభంలో సమయాన్ని వృధాచేస్తే ఆతరువాత ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్పష్టమైన ప్రణాలిక కలిగి ఉండి ముందుకు వెళ్ళుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీకు రావాల్సిన దనం చేతికి అందుతాయి. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర మితులతో చర్చలకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. జీవితభాగస్వామితో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును, సర్దుబాటు విధానం కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది.   

 

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం ఆరంభంలో ఉద్యోగంలో పనిఒత్తిడి ఉండుటకు అవకాశం ఉంది, తోటివారి సహకారంతో పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు ఉన్న ఆదాయం వస్తుంది. పెద్దలతో చేపట్టిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. బంధువులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సంతానం వలన నలుగురిలో మంచిబు గుర్తింపును పొందుతారు. జీవితభాగస్వామితో మనస్పర్థలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. స్త్రీ పరమైన విషయాల్లో మీకంటూ ఒక హద్దు కలిగి ఉండుట మేలు. పెట్టుబడుల విషయంలో చిన్న పెట్టుబడులు అనుకూలం. 

 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకండి. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. గతమ్లో మీకున్న పరిచయాలను తిరిగి తెచ్చుకొనే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. కుటుంబంలో కొన్ని మార్పులకు ఆస్కారం ఉంది, స్వాగతించుట మేలు. విదేశాల్లో ఉన్న మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. 

 

 

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. నూతన వ్యాపారప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. గతంలో మిత్రులతో చేసిన చర్చలు ముందుకు సాగుతాయి. కుటుంబంలో పెద్దలనుండి సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో పై అధికారులతో సంభందాలు బాగుంటాయి. మీ మాటతీరు కొంతమందిని ఆకట్టుకుంటాయి. విదేశాల్లో ప్రదేశం మార్పుకు ఆస్కారం ఉంది. సంతానం వలన నూతన ఆలోచనలు ఏర్పడుతాయి, వారికి సమయం ఇస్తారు. సోదరులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మేలుజరుగుతుంది.  

 

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు