అనాచ్ఛాదిత నవల సమీక్ష - చిట్టె మాధవి

book review

ఆత్మీయ పలకరింపులు ఎప్పుడూ పన్నీటి చిలకరింపులే...మనసు పదాలన్నీ మమతల విరాజాజులే...మదిలోని మకరందాలన్నీ..మానసిక ఉల్లాసాలే..విరిసే బంధాలన్నీ బాంధవ్య  అనురాగదీపికలే.బలమైన బంధాలెప్పుడూ..విలాసాల  మనోవీచికలే .. మనసు పదాలన్ని మమతల విరాజాజులే...మౌన వారధి పై విహరిస్తూ..పరిమళాలు వేదజల్లుతుంటే..కానీ జీవితమే ఒక విలాపమైఒక అవేదనా గీతికను ఆలపిస్తే...ఛిద్రమైన మనో చిత్రాన్ని అవిష్కరిస్తే అది అచ్చు ఈ నవల అనాచ్ఛాదితలా అగుపిస్తుంది..అనిపిస్తుంది.

విధ మనస్తత్వాల సమాహారం...వివిధ కోణాల మనో ఆవిష్కారం..బాధలను ఓర్చుకొని బాధ్యతలను మోస్తూ తన సుఖాన్ని మరిచి పిల్లల భవిష్యత్తు కై అనుక్షణం తపించిన త్యాగశీలిగా నళిని అగుపిస్తే , మనసు..నచ్చిన వారి బంధం ఆత్మ బంధమై..ఒకవైపు పలకరిస్తే వారే నళిని..నిత్యానందం లా కనిపిస్తారు. నిత్యానందానికి నళిని పై ఉన్న అవాజ్యమైన అనురాగం ఆరాధన...నళినికి అతనిపై వీటన్నింటికి మించిన భరోసా మనసులో ఉన్నప్పటికీ ఎప్పుడూ బైటపడలేదు. .బాధ్యతల బరువుతో  ఉన్న ఆమె సమాజంలో పల్చపడకూడదు అని...తాను ఉన్నంతవరకూ నిత్యానందం ఆమెకు భరోసాగా నిలిచాడు..కానీ అతను దూరమయ్యాక వచ్చిన శూన్యం తెలిపింది...తన అవసరం ఆమె జీవితానికి ఎంత భరోసా అని . తుషార భింధువులై...కురిసి...కమలమై విరిసి ముత్యమై మెరిసి ఒక్కోసారి భేల లా మారి పోయేది ఎవరని చూస్తే జానకిలా కనిపిస్తుంది. చురుకుదనం విజ్ఞానం ,మంచితనం...మరికొంచెం ప్రేమతత్వం వెరసి చూస్తే కృష్ణలా కనిపిస్తాడు. కోరిక ,ఇష్టం ప్రేమ ఈ మూడింటి తత్వాలను చాలా నిశితంగా విశ్లేషిస్తే చంద్రమై సాక్షాత్కరిస్తాడు.స్వార్థానికి పరాకాష్ట సంధ్య అయితే మగవాడి దురహంకారానికి,వ్యసనాలకు  నళిని భర్త నిలువెత్తు సాక్ష్యం.ఎన్నోపాత్రలకు సజీవ రూపాన్ని ఇచ్చి...మన చుట్టువున్న వారిని పరిచయం చేస్తారు.

 విధాత తీర్పు ఎంత బలీయమైనదో ఒకే ఇంటిలోని వ్యక్తుల మానసిక వేదన,అవ్యక్తమైన...భావాలు ..నలిగిన మనసుల మూగ భాధ మేము చూడగలిగాము .వేదనాభరిత భావ తరంగాలు మనసును తాకి గుండె బరువెక్కుతుంది.విడాకులు తీసుకోకుండానే తన భర్తనుండి వేరుగా జీవించే నళిని..జానకి కూడా ఒకే చోట నివసిస్తూ...భర్తకు దూరంగా ఉండటం...కృష్ణకు అతని భార్యే పరస్పర విడాకులకు ప్రొపోస్ పెట్టడం..ప్చ్...దేవుడు..ఒక్కోసారి ఎంత నిర్దయగా జీవితాలను నిర్దేశిస్తాడో కదా...!  కోరిక ఇష్టం,ప్రేమ..ఈ మూడింటి తత్వాలను చాలా నిశితంగా విశ్లేషించి చంద్ర జీవితానికి అపాదించి చూస్తే విచ్చలవిడి కోరికలతో ఇష్టమైన భార్యను నిర్లక్ష్యం చేసాడు.విధి ఆడిన వింత నాటకంలో జానకి  ప్రేమలోని అమరత్వాన్ని చవిచూసాడు. పశ్చాత్తాపంతో..ప్రాయశ్చిత్త కాంక్ష..తో కుమిలిపోయిన చంద్ర వచ్చే జన్మలోని ప్రారబ్ధం నుండి తప్పించుకోవొచ్చు గాని..జానకి కి చేసిన అన్యాయాన్ని ఎప్పుడూ..ఎవ్వరూ పూడ్చలేనిది. ఒక్కో వ్యక్తి స్వాభావిక లక్షణాలు విలక్షణం. చంద్రం యొక్క వ్యక్తిత్వాన్ని కళ్ళకు కట్టినట్లు వ్రాశారు.తనకున్న ఆ రెండు అవలక్షణాలు తప్ప అన్నీ మంచివే.. నిత్యానందం ను సంధ్య ధాటి నుండి కాపాడిన వైనం...అన్నీ బాగున్నా..

జీవితాన్ని చేజార్చుకొని...నలుగురిలో తన వ్యక్తిత్వం నీరుగారిపోయే ఆ లక్షణాలు చాలవు...చంద్ర దిగజారుడు తనానికి.చంద్ర లాంటి క్యారెక్టర్లు చాలా మంది మన చుట్టూనే వుంటారు..లోకంలో ఇలాంటి జానకిలు ఎందరో చంద్రలాంటి వారు మరెందరో..సంధ్యలాంటి వారు ఇంకెందరో .    మనిషి వ్యక్తిత్వాన్ని నిలిపేది మంచితనమే కానీ ,ఆ మంచితనాన్ని కూడా గుర్తించలేని పరిస్థితుల ప్రభావం..దీనికి రాధ మనస్తత్వం ఉదాహరణ...రాధ కోణంలో ఇసుమంత తప్పుకుడా పట్టలేము.రాధ తల్లి లాంటివారితో  తో... మరింత మానసిక ఆందోనళకు తప్పక గురవుతారు.ఈ నవలలో పాత్రల మనస్తత్వాలకు ముసుగులేకుండా ఆవిష్కరించిన తీరు చాలా సహజంగా ఉండటంతో  వారితో పాటూ పాఠకుల్ని తమవెంటే తీసుకెళుతూ అనుభూతిని పంచుతాయి. అడుగడుగునా బంధాల బంధనాలే ఏదో ఒక రూపంలో ఆకాంక్షిస్తూ..ఆక్షేపిస్తూ ప్రాణాన్ని ఉసూరుమనిపిస్తూ ఘనీభవించిన భాధలన్నీ  కన్నీరై ద్రవీభవింపక మానవు, చెంపల చెలిమి కై చేతుల స్పర్శకై అంటూ స్పందించడమే పాఠకుల స్పందన అదే రచయిత  విజయం. దీనిలో కొప్పిశెట్టి జాన్సీ గారు ముందంజలోనే వున్నారు. 

మీ భావాలతో...మీ వైవిధ్య రచనా శైలితో మీ నవల చదువుతున్నప్పుడు మాకు పెదవులపై ఒక విరక్తి నవ్వును ,కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించావు ఝాన్సీ డియర్. మా హృదయ స్పందన మీరు మంచి రచయిత్రి అని చెప్పకనే చెబుతోంది. మీనుండి మరిన్ని రచనలు ఆశిస్తూ...మీ ఆత్మీయురాలు.,❤️❤️❤️

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి