నగరంలోని బిగ్ షాట్స్ ఉండే కాలనీలో అదో ఖరీదైన బంగళా. ఆ బంగళాలోని హాల్లో లైట్ బ్లూ కలర్ తో ఉన్న గోడకు ఓ పెద్ద గోల్డెన్ ఫ్రేం. అందులో చిరునవ్వులు ఒలకబోస్తున్నది లత, రఘులు. కొత్త దంపతులు. పెళ్లై జస్ట్ సిక్స్ మంథ్స్!
రఘు ఎంటర్ ప్రెన్యూర్. వాళ్ల నాన్న ఫణిభూషన్ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ లో గెజిటెడ్ లెవెల్. తల్లి శకుంతల సెక్రెటెరియట్ లో సీనియర్ ఎంప్లాయి. అందుచేత చిన్నప్పట్నుంచీ తమకున్న ఒక్కగానొక్క కొడుకుని చక్కగా పెంచారు ఆ తల్లిదండ్రులు. డబ్బూ, హోదా అతనికేం కొత్తకాదు, అందులోనే పుట్టి పెరిగాడు. చిన్నప్పట్నుంచి షార్ప్. కంప్యూటర్ సాఫ్ట్ వేర్ మీద మంచి గ్రిప్ ఉంది. దాంతోనే ఓ యాప్ డెవలప్ చేశాడు. అది సూపర్ డూపర్ క్లిక్ అయింది.
దాదాపు ఆరడుగులుండే రఘు పాతికేళ్ల మిస మిసలతో కుర్రాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. కాకపోతే ధనవంతుల కళ ప్లస్సయింది. మెరిసే బంగారపు రంగులో, మనసులోని స్పష్టమైన ఆలోచనలను సూటిగా వ్యక్తపరచే కళ్లు. నుదుటిమీద తారాట్లాడే కర్లీ హెయిర్, మంచి డ్రెస్ సెన్స్ తో చూడగానే అమ్మాయిలు చూపు తిప్పుకోడం కష్టం. ఆ పోష్ కాలనీలోని అందరి అందమైన అమ్మాయిల సెల్ ఫోన్ లలో అతనుంటాడు. ఆ కన్నెలందరూ వాళ్ల వాళ్ల తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి, రఘు తండ్రిని వివాహ విషయమై కలిసేలా చూశారు. కాని ఆయన ‘కొడుకు ఎప్పుడంటే అప్పుడు, ఎవర్ని చేసుకోవాలనుంటే వారిని చేసుకునేందుకు’ కావలసిన ప్రైవసీ ఇచ్చాడు. అందుచేత ఏదో కారణం చెప్పి సున్నితంగా దాటేసేవాడు.
గచ్చీబౌలీలో తనకంటూ ఓన్ బిజినెస్ ఎస్టాబ్లిస్ చేశాడు. పాతికమంది ఎంప్లాయీస్ తో సక్సెస్ ఫుల్ గా రన్నవుతోందది. ఏడెనిమిదినెల్ల క్రితం తనాఫీసులో మోస్ట్ సీనియర్ పర్సన్ పెళ్లి భీమవరంలో జరుగుతోందంటే, అతను మరీ మరీ రావాలని రిక్వెస్ట్ చేయడంతో కారులో బయలుదేరి వెళ్లాడు.
ఆ ఊరిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. సిటీలోనే పుట్టి పెరిగిన అతను కలీగ్ పెళ్లయ్యక, చెట్లూ, పుట్టలు, చెరువులు, తామర్లూ, ఫ్రెష్ ఎయిర్, గుళ్లూ ఉన్న ఆ ఊరిని చూసి ఎంజాయ్ చెయ్యాలని మరో నాలుగురోజులు ఉన్నాడు. ఒకసారి అలా పచ్చని పంట పొలాల మీదుగా నడుచుకెళుతుంటే పరికిణీ ఓణీలో, పాలమీగడకు గులాబీలు రంగరించిన రంగులో, అందమైన ముఖ వర్ఛస్సుతో, లటుక్కున అతని మనసు చేపను కళ్ల గాలంతో లాక్కుని తన మనసు చెరువులో వేసేసుకుంది.
ఎప్పుడూ కంప్యూటర్ స్క్రీన్, ప్రోగ్రామ్స్, టెండర్స్ మదిలో మెదిలే రఘుకు వాటన్నింటినీ తోసిరాజని ఆమె రూపం ముద్రించుకుపోయింది. ఇహ ఉండబట్టలేక ఆమెకి సంబంధించిన వివరాలు సేకరించాడు. ఆమె పేరు లత, తండ్రి దశరథరామయ్య పంట పొలాలు, రైస్ మిల్స్ తో ఆ ఊళ్లోనే గొప్ప ధనవంతుడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు. ఈ మధ్యే పట్నం లో చదువు పూర్తి చేసుకుంది. ఆమెకి పల్లెటూరన్నా, తాతయ్యా, నానమ్మలన్నా ప్రాణం. అందుకే కాస్త వెసులుబాటు దొరికితే ఊరుకొచ్చేస్తుంది.
రఘు తల్లిదండ్రులతో ఆమె విషయం చెప్పి, ఆఘమేఘాల మీద మధ్యవర్తులతో మాట్లాడించి, హైద్రాబాదులోని నాగార్జున కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా వివాహమాడి ఆమె అందాన్ని తన సొంతం చేసుకున్నాడు.
వాళ్ల శోభనం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో హనీమూన్ ప్యాకేజ్ బుక్ చేశాడు దశరథరామయ్య. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా లగ్జరి హోటల్లో ఉన్నారు. పొద్దున్నంత ఫిల్మ్ సిటీలో ఉన్నవి చూసి రాత్రి కాండిల్ లైట్ డిన్నర్ చేసి, తమ గదిలోకి వెళ్లి ఆశ్చర్యపోయారు. రకరకాల పూలతో హోటల్ వాళ్లు డెకరేట్ చేసిన మంచాన్ని చూడంగానే ఇద్దరిలోని మూడ్ తారాస్థాయికి చేరింది.
ఆ గదిలో ఉన్న అటాచ్డ్ బాత్ రూం లో ముందుగా రఘు సువాసన షాంపూలు, సోప్ లతో గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేసి టవల్ చుట్టుకుని బయటకొచ్చాడు. అతని శరీరంపై నుంచి సువాసనలు గదంతా కమ్మగా వ్యాపించాయి. ఆ వెంటనే లత బాత్ రూం లోకి వెళ్లి తలుపేసుకుంది. కొంత సేపటి తర్వాత టవల్ చుట్టుకుని బయటకొచ్చింది. మళ్లీ సువాసన ఆ రూం లో స్ప్రెడ్ అయింది. ఆమె బంగారు రంగు శరీరం మీద నీటి చుక్కలు ముత్యాల్లా భాసిస్తున్నాయి. ఆమెని అలా చూస్తున్న రఘుకు యవ్వనం కట్టలు తెంచుకున్న కొత్తనీటి నది అయింది. ఆమెని చుట్టుకుపోయి ముద్దుల వర్షం కురిపించాడు. ఆమె తమకంతో గట్టిగా అతణ్ని కరుచుకుపోయింది. ఆ విజృంభనలో, శృంగారపు ఉప్పెనలో వాళ్లు చుట్టుకున్న టవల్స్ ఇహ తమవళ్ల కాదని నేలకు జారిపోయాయి. ఇద్దరూ మెత్తని పరుపుపై ఒరిగిపోయారు. ఆ పరుపు రాత్రంతా పున్నమినాటి ఉత్తుంగతరంగ సంద్రమయింది.
రెండు, మూడు రాత్రులు కూడా అమరానంద సుఖాలు కైవశం చేసుకుని తియ్యని స్మృతులతో వదల్లేక వదల్లేక ఆ హోటల్ రూం ను వదిలి వెళ్లారు.
***
ఫణిభూషన్ ఖరీదైన బంగళా తీసుకుని కొడుకూ కోడలిచేత వేరు కాపురం పెట్టించారు. ఆయన దగ్గర కేర్ టేకర్ గా యాభై ఏళ్ల నర్సయ్య చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. నమ్మినబంటు. నర్సయ్యని, ఫణిభూషన్ తమ ఇంట్లో మనిషిలా చూసుకుంటాడు. నర్సయ్య కొడుకు ఇరవై ఏళ్ల రాము కి చదువబ్బలేదు. అందుకని వాడికేదన్నా దారి చూపించమని ఫణిభూషణ్ని బతిమాలితే తమ కొడుకూ కోడలితో ఉంటూ వాళ్ల బాగోగులు చూస్తూండమని కొత్తదంపతులతో పంపించాడు. అప్పటి నుంచి వాళ్లతో పాటే అతనూను. ఇదిలా ఉండగా రఘుకి ఒక ప్రాజెక్ట్ విషయమై ఒక నెల పాటూ అమెరికా వెళ్లవలసిన పని పడింది. అది అత్యవసరం కూడానూ. లతకి విషయం చెప్పి తనకు వెళ్లాలని లేదని బెంగగా చెప్పాడు. ఆమె "నెలరోజులు ఎంతలోకి గడుస్తుంది? మీరు వెళ్లకపోతే నాతో జరిగిన మీ పెళ్లి మీ కరీర్ కి అడ్డంకి అయిందనుకుంటారు. పైగా అది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని మీరే చెప్పారు, వెళ్లండి" అంది. బాధ కనిపించకూడదనుకున్నా మాటల్లో ద్యోతకమవుతూనే ఉంది.
"వెళతాను కానైతే నువ్వు ఈ నెల రోజులూ మీ అమ్మావాళ్ల ఊరెళ్లు"అన్నాడు.
"ఊహూ..ఇది నా ఇల్లు. ఎక్కడికీ వెళ్లను. అయినా నన్ను కనిపెట్టుకుని ఉండడానికి రాము, ఆంజనేయుడులా ఉన్నాడుగా"అంది.
అతను అమెరికాకి ప్రయాణం అయ్యే రోజు వచ్చేదాకా ప్రతీరాత్రీ వాళ్ల బెడ్రూంలో శృంగారకేళిలో ఓలలాడుతూ మనసులో కమ్మని అనుభూతులు ప్రోది చేసుకున్నారు. నెలరోజుల పాటూ ఇద్దరూ వాటినే స్మరించుకుంటూ, నిగ్రహించుకోవాలి. ఆ రోజు అతణ్ని షంషాబాద్ లో ఫ్లైట్ ఎక్కించి అందరూ తిరుగుముఖం పట్టారు.
రఘు వచ్చేవరకూ ఆమెను తమ తమ ఇళ్లలో ఉండమని దశరథరామయ్య, ఫణిభూషన్లు పిలిచారు. కాని ఆమె తనింట్లో తనుంటానని అంది.
***
వాళ్ల ఇంటికి పక్కనే ఉండే మరో బంగళాలో సురేష్ అనే అతను పని చేస్తాడు. రఘు అమెరికాకు వెళ్లడం అతను గమనించాడు. ఒకసారి కూరలు తెస్తున్న రాముతో మాటలు కలిపి రఘు నెలరోజుల కోసం అమెరికా వెళ్లిన విషయం తెలుసుకున్నాడు. అతను రెండు మూడుసార్లు లత అందాన్ని కళ్లతో జుర్రుకున్నాడు. అవకాశం దొరికితే శరీరంతో జుంటి తేనే తాగాలని వాడి ధ్యేయం. వాడికి తన స్థాయి తెలుసు, కానీ ఆమెని చూసిన దగ్గర్నుంచి మనసు మనసులో ఉండడం లేదు. ఏం చేసైనా ఆమెని అనుభవించి తర్వాత జరిగే ఏ పరిణామాలకైనా సిద్ధమవ్వాల నుకున్నాడు. నాలుగైదు రోజులు రామూతో స్నేహం పెంచుకున్నాడు. ఆ నెపంతో లతకీ దగ్గరయ్యాడు. ఆమె అతని మనసులో ఉన్న దురుద్దేశం గమనించకుండా, రామూని చూసినట్టే చూస్తోంది.
పదిరోజుల స్నేహం తర్వాత ఒకరోజు రామూను తనగదిలోకి తీసుకెళ్లి తన ఫోన్లో ఉన్న బ్లూ ఫిల్మ్స్ ను చూపించాడు. రామూకు ఒళ్లు వేడెక్కిపోయింది. తమ పల్లెటూళ్లో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు. రెండు మూడు సార్లు సురేష్ ఇంటికెళ్లి అడిగి మరీ చూశాడు. ఒళ్లంతా ఏదో తెలియని మత్తూ, మైకం అలుముకుంటోంది.
"ప్లీజ్ నా ఫోనుకు వాటిని పంపవా! నేను రాత్రి నా గదిలో పడుకుని చూసుకుంటాను" సురేష్ తో అన్నాడు. అతను వెంటనే పంపాడు. "ఇవి ఉత్త బొమ్మలే! మీ మేడం స్నానం చేస్తున్నప్పుడు తలుపుకు కంత పెట్టి చూడు మజాగా ఉంటుంది"అన్నాడు.
"ఛ..ఛ..ఏం మాట్లాడుతున్నావు? ఆమె నాకు అమ్మలాంటిది"అన్నాడు గాబరాగా.
"చూడు రామూ ఈ ఇంటి కోడలు ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఆమె నాకూ అలాగే అనుకున్నాను. తర్వాత ఇద్దరం..."వంకరగా నవ్వాడు.
"అలా అయితే నేను నీతో మాట్లాడను"అని లేచి విసురుగా వెళ్లిపోయాడు.
"వెళ్లు, అసలే పెళ్లయిన కొత్త, మగడు అమెరికా వెళ్లాడు. అవకాశం మళ్లీరాదు. పోనీ నాకివ్వు"అని అరిచాడు. వేగంగా వెళుతున్న రామూ వెనక్కి వచ్చి సురేష్ చెంపలు వాయించి పరిగెత్తుకెళ్లిపోయాడు. సురేష్ లత ఇంటికి వస్తున్నాడు. లతతో మాట్లాడి వెళుతున్నాడు. ఆ సమయంలో రామూ ముభావంగా ఉంటున్నాడు. ఆమె అది చూసి బాధపడుతూ "సురేష్ రామూని ఏవన్నా అన్నావా? అతను నీతో ఎందుకు మాట్లాడట్లేదు" అంది.
"ఏమో మేడం నాకు తెలియదు ఒట్టు"అని ఆమె నాజూకైన చేతిని తన చేతుల్లోకి తీసుకుని నిమరసాగాడు. రామూ అది చూసి వాళ్ల దగ్గరగా వచ్చి చేతులు విడిపించి అతని చేతిని విసురుగా విదిలించాడు. అభం శుభం తెలియని లత "తప్పురామూ, ఫ్రెండ్ చేయి అలా విసిరి కొట్టొచ్చా" అంది చిరుకోపంతో. సురేష్ వంకరగా చూసి నవ్వుతూ వెళ్లిపోయాడు.
***
అయిదురోజులయింది. సురేష్ కనిపించడం లేదు. లత "రామూ, ఈ మధ్య సురేష్ నీ కోసం రావడం లేదేమిటి?"అడిగింది.
"ఏమోనమ్మా.."అన్నాడు అమాయకంగా.తమ ఏరియాలోనే ఉండే ఎస్సై దగ్గరకెళ్లి, సురేష్ గురించి, అతని పైశాచిక ఆలోచనలూ చెప్పి, అతను తనకు పంపించిన పోర్న్ వీడీయోలు చూపించి, అతను ఆ కాలనీలో ఉండడం ఎంత ప్రమాదమో తెలియజేశాడు. దాంతో ఎస్సై, సురేష్ ను పట్టుకుని తన పద్ధతి మార్చుకుని, ఊరెళ్లకపోతే, లోపలేసి కుమ్ముతామని హెచ్చరించాడని, ఆ దెబ్బకి భయపడి సురేష్ సొంతూరు వెళ్లిపోయాడని ఒక్క రామూకి తప్ప ఎవ్వరికీ తెలియదు. సీతమ్మను గీత దాటకుండా రావణుడి నుంచి తను కాపాడుకున్నాడు.
***
రఘు అమెరికా నుంచి వచ్చాడు. ఇద్దరూ ఆకలి మీద ఆవురావురుమంటున్నారు. పైగా ప్రాజెక్ట్ సక్సెస్ చేసుకొచ్చి మాంచి ఊపు మీద ఉన్నాడు రఘు. ఆ బెడ్ రూం లోని మంచం వాళ్ల ఫస్ట్ నైట్ కి ఎలా డెకరేట్ చేసి ఉందో అలా ఉంది అది, వాల్లిద్దర్నీ ఆహ్వనిస్తూ. కథ సుఖాంతం కావడానికి లత చుట్టూ ఉన్న రామూ అనే కంచె కారణం.