
జీవితం
అక్వేరియం...
నాలుగు చేపలూ
స్మార్ట్ ప్రపంచంలో...!!!
****

ఆమెది
వృత్తికి న్యాయం చేసే నైజం...
అతడు మాత్రం
జీతమిచ్చే వ్యాపారి!!!
****

గురువుమీద
ఎత్తిన చేయి...
భావి విద్యావ్యవస్థకి
కొడవలి ప్రశ్న?...!!
****

బోధించేవాడు
విజ్ఞానదాత ఆనాడు...
విద్యార్థి
విధాత ఈనాడు...!!!