పులకించిన పెనుమాక - డాక్టర్ రావెళ్ల

penumaka
పద్మ గారి మనుమరాలి  పుట్టినరోజు సందర్భంగా, కిరణ్ గారి హాస్య పత్రిక హ్యూమర్ టూన్స్  ఆవిష్కరణ సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 17. 11. 2019 ఆదివారం ఏర్పాటుచేసిన కార్తీక వన సమారాధన (పిక్నిక్) ఆనందోత్సాహాలతో జరిగింది. కార్టూనిస్టులందరూ ఒకచోట కలపడం, వారికి చిత్రవిచిత్రమైన పోటీలు పెట్టి బహుమతులు ఇవ్వడం చూస్తే పద్మ గారు ఈ కార్యక్రమాన్ని ఎంత మనసుపెట్టి చేశారో అర్థమవుతుంది. కిరణ్ గారు కూడా  పెద్ద పెద్ద వేదికలు కాకుండా పత్రికను ఎక్కువ  మంది కార్టూనిస్టుల మధ్య ప్రకృతి వాతావరణలో అవిష్క రించాలనుకోవడం  అభినందించదగ్గ విషయం.   పద్మ గారు 20 రోజుల నుండి శ్రమపడి 20 రకాల పోటీలను, వాటికి సరిపడా మెటీరియల్ను కూడా అందించి కార్టూనిస్టుల్లో ఉత్సాహాన్ని నింపారు.  పోటీలలో పాల్గొన్న కార్టూనిస్టులంతా పిల్లలై పోయారు.

ఇచ్చిన సబ్జెక్టు కుఅనుగుణంగా కార్టూన్లను తక్కువ సమయంలో చిత్రించి పలువురి మెప్పు పొందారు. ఉదయం అల్పాహారంతో మొదలైన కార్యక్రమం చక్కని వాతావరణం లో కొండల ప్రక్క మామిడి తోటలో  కార్టూనిస్టుల కబుర్లతో  ఆహ్లాదకరంగా మారిపోయింది. ఇంతమంది  కార్టూనిస్టులు హాజరు కావడం, నేను పనిచేసే పాఠశాలలోనే  రెండవసారి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మా పాఠశాల చేసుకున్న పుణ్యం .బాచి గారు పోటీలను సమర్థవంతంగా నిర్వహించారు. దాదాపు పాల్గొన్న ప్రతి కార్టూనిస్టు కూడా బహుమతులు గెలుచుకున్నారు. అందరితో కలిసి శివుడి బొమ్మ వేయడంతో మొదలైన పోటీ సరదాగా సరసి, అష్టదిగ్గజాలు, ప్రశ్న మా  ఇష్టం-. గిఫ్ట్ మీ ఇష్టం, 15 మందిని పట్టు కోండి, ఇలాంటి వెరైటీ పోటీలను తయారు చేశారు పద్మ గారు.

పోటీలను బాచి గారు సమర్ధవంతంగా నిర్వహించారు. విజేతలకు పుస్తకాలు ,రకరకాల గిఫ్ట్ ఆర్టికల్స్ అందించారు.  అలాగే ఎక్కువ బహుమతులు  గెలుచుకున్న వినోద్ సూపర్ మాన్ గా నిలిచారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా సీనియర్ కార్టూనిస్టులు టీవీ, బాలి
గారలు రావడం కార్యక్రమానికి మరింత అందం చేకూరింది.  కార్యక్రమం చివరి వరకు ఉండి వారి అనుభవాలను, జ్ఞాపకాలను అందరితో పంచుకొన్నారు. ఎన్నో పనులు ఉన్నా హాస్యానందం సంపాదకులు రాము గారు కార్యక్రమానికి హాజరై అందరినీ పలుకరించారు .  కొత్తగా హాస్య పత్రికను తీసుకు రావాలని, ఇంకా కార్టూనిస్టులకు కొత్తదనాన్ని ఎక్కువ సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో కిరణ్ గారు తీసుకువచ్చిన  హ్యూమర్ టూన్స్  హాస్య పత్రిక ఆవిష్కరణ జరిగింది. పత్రిక అందుకున్న కార్టూనిస్టులు అందరూ ముఖచిత్రం చూసి ఆశ్చర్యంతో పేజీలను తిరగేయడం కనిపించింది. ఈ ద్వి భాషా హాస్య పత్రిక   ముందు ముందు మరిన్ని శీర్షికతో ఇంకా కొత్తదనం  నింపుకొని అందరినీ ఆకట్టుకుంటుందని  ఆశించవచ్చు.

పనులతో అటు ఇటు తిరుగుతూ ఒక చోట కుదురుగా లేని నా కళ్ళకు చాలా విషయాలు కంట పడ్డాయి. మా పాఠశాల పిల్లలు ఉదయం బల్లలు చేర్చడం దగ్గర నుండి చివరి వరకు బహు శ్రద్ధగా పని  చేసి మాకు సాయపడ్డారు. రమణ గారు ఫోటోలు రకరకాల యాంగిల్స్ లో చిత్రీకరించి ఉత్తమ కార్టూన్ ఇస్ట్ గా కనిపించారు . పద్మ  గారి అక్క ,తమ్ముడు  తమ తల్లి దండ్రులయిన రామచంద్ర రావు,సక్కుబాయమ్మ
ల పేరు మీద పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. ఏ వీ యం గారు కార్టూనిస్టులు అందరికీ రెండు రకాల కార్టూన్ 
పెన్ను లను పంపించారు. సీనియర్ కార్టూనిస్టులు బాలి గారికి, టీ.వీ గారికి ఆత్మీయ సత్కారం జరిగింది కార్యక్రమం నిర్వహణ చేసిన బాచి గారికి  చిరు సత్కారం చేశారు. సదరు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పూర్ణ చంద్రశేఖర రావుగారికి, ఆంగ్ల ఉపాధ్యాయులు రాజు గారికి  చిరు జ్ఞాపిక లను అందజేశారు .

ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం తో పాటు సాయంత్రం స్నాక్స్ టీ తో పిక్నిక్ ముగిసింది. పాఠశాల ప్రాంగణానికి ముందుగా చేరుకున్న పద్మ, కిరణ్ గారలు అందరికీ టాటా చెప్పి సాయంత్రం 6 గంటలకు తిరిగి ఇంటికి బయలుదేరారు.ఈ కార్యక్రమంలో లో కిరణ్, పద్మ కామేష్, బాచి ,కాజా ప్రసాద్ సుభాని రేమో ,శేఖర్ ,టీవీ ,బాలి ప్రసిద్ధ ,నాగిశెట్టి ,జాకీర్, వినోద్ కళాసాగర్, జగన్నాథం ,కృష్ణ శ్రీ ఆదినారాయణ, స్వాతి రాజ్  రామకృష్ణ ,హరికృష్ణ ,కె ప్రభాకర్ ప్రభాకర్  , కొండ రవి ప్రసాద్, పద్మ దాస్ , గాలి శెట్టి ,యాదగిరి ,రమణ, రావెళ్ళలు పాల్గొన్నారు.     

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి