యువత - కీళ్ల నొప్పి: జాగ్రత్తలివే.! - ..

Youth - joint pain: Beware!

ఒకప్పుడు 65 ఏళ్లలో వచ్చే కీళ్ల నొప్పులు ఇప్పుడు 35 ఏళ్లకే సంక్రమిస్తున్నాయి. ముఖ్యంగా యువతను ఈ కీళ్ల నొప్పులు పట్టి పీడిస్తున్నాయి. ఇందుకు కారణం పౌష్టికాహార లోపం, అధిక బరువు అని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి, నిద్రలేమి వంటివి కూడా యువతలో ఈ సమస్యకు కారణంగా చెప్పుకోవచ్చు. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల ఎముకల్లో లవణ సాంద్రత తగ్గిపోయి ఎముకలు గుల్లబారి, ఆర్దరైటిస్‌కి దారి తీస్తుంది. నాగరికత పెరిగిపోవడం, అందునా స్మార్ట్‌ మొబైల్‌ యుగం కావడంతో, యువతకు కంటి నిండా సరిపడ నిద్రే ఉండడం లేదు. తద్వారా ఇలాంటి వ్యాధుల బారిన సులువుగా పడుతున్నారు.

గ్రేటర్‌ వైద్యుల అధ్యయనాల ప్రకారం, రోజులో సగటున 40 శాతం యువత మోకాలి నొప్పులతో వైద్యుల్ని సంప్రదిస్తున్నారట. ప్రధమ దశలో కీళ్ల నొప్పులకు కొన్ని మందులతో చికిత్స చేస్తున్నారు. మరికొన్ని నొప్పులకు ఇంజెక్షన్స్‌ ద్వారా, ఇతరత్రా కొన్ని నొప్పులకు ఫిజియో థెరఫీ చికిత్స ద్వారా ఉపశమనం కలిగిస్తుంటే, 20 శాతం సర్జరీలను ఆశ్రయించక తప్పడం లేదట. పెరిగిన పొల్యూషన్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ కల్చర్‌తో శరీరానికి తగినంత పౌష్టికాహారం అందని కారణంగా పిన్న వయసు వారే ఎక్కువగా ఈ కీళ్ల నొప్పి బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నొప్పుల బారి నుండి విముక్తి పొందాలంటే, ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉన్న ఫుడ్‌ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దాంతో పాటు, మొలకెత్తిన గింజలు ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్‌ సి, డి ఎక్కువగా ఉన్న పండ్లు తరచూ తినాలి. శరీరానికి కావల్సినంత పరిమాణంలో వాటర్‌ అందిస్తూ ఉండాలి. చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుండాలి. తప్పదు.. చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందాలంటే, ఈ చిన్న చిట్కాలని తప్పక పాఠించాల్సిందే.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి