తెలుగు తేజం వెల్లివిరిసిన వెన్నెల సభ . - ఆదూరి.హైమావతీశ్రీనివాసరావు

అది నవంబరు 24వ తేది.ఏ ఎఫ్ ఎకోసెంటర్,లెనిన్ నగర్ అనంతపురం .ఉదయం 10.30ని. తెలుగు మాతృభాషాభిమానుల గుంపు కన్నులపండువుగా కమ్మనైన అమ్మభాషలో విస్తృతం గా రచనలు చేసిన రచయిత-[త్రు]లూ పోగైన శుభవేళ ఆకాశాన్నంటిన తెలుగుతేజం సంబ రాలు చూడను రెండుకళ్ళూ చాలలేదు. తాము చేసిన ప్రతిలిపి తెలుగు వెబ్ సైట్ లో తమ రచనలను తామే పోస్ట్ చేసుకునే అవకాశం కలిగించిన నిర్వాహ కులు జనీజీ బృందం నిర్వ హించిన తేనె తెలుగు సభ అది.

సుమారుగా వందమందిని చిన్న పెద్ద [వయస్సులో నూ,రచనల్లోనూ] అనేబేధం లేక అందరినీ మన్నింపుగా ఆదరించి ,ఆహ్వానించి ప్రతిలిపి నిర్వాహకుడు జానీజీ అందరినీ సత్కరించి అందరిమనస్సులూ తస్కరించాడు.  ప్రముఖ రచయిత ఆచార్య మేడిపల్లి రవికుమార్ కధ ,కధానికలకు తేడా సోదాహరణంగా వివరించారు.డా.ప్రభాకర్ జైనీ అనే మహా మేటి రచయిత , సినీడైరెక్టర్ తమఉపన్యాసంతో అందరినీ అలరించారు. సమయపాలనకు  ప్రతిలిపి పెట్టింది పేరా అన్నట్లు సరిగా  భోజనసదుపాయాలూ, సభానిర్వహణ అమూల్య సమయపు మూల్యాన్ని తెలిసినవారుగనుక  వృధా చేయక నిర్వహించి అందరి స్నేహ పూర్వ క అభినందనలూ అందుకున్నారు. 

అంతా ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ,పలకరించుకుంటూ తమ అభిమానాన్ని తెలు పు కుంటూ వారి రచనలగురించీ ప్రస్తావించుకుంటూ తెలుగు సువాసనలను వెదజల్లిన సభ. అంతా విడువలేక విడువలేక విడువక తప్పదుకనుక తమ తమ ప్రాంతాలకు తరలి వెళ్లారు. మారుగా 45వరకూ రచయితలూ,30 మందివరకూ రచయిత్రులు తమ మాతృ భాషాభిమా నాన్ని చాటుకుంటూ  హుదూరప్రాంతాలనుంచీ మద్రాసు, విజయనగరం, విశాఖ, హైదరా బాదు ,బెంగుళూరు, తిరుపతి ఇంకా ఇంకా దూరాలనుంచీ వ్యయప్రయాసలకోర్చి అనారోగ్యా న్ని, వయస్సునూ   లెక్కచేయక తోటి ప్రతిలిపి రచయితల నందరినీ చూడాలనే ఆశతో రావ డం తెలుగు భాషపట్ల వారికున్న ప్రేమను చూపింది.మనతెలుగు చిరకాలం బ్రతికే ఉంటుం దని వారినంతా చూసిన వారికి విశ్వాసం,సంతసం వెల్లివిరిసింది.

 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి