
పశ్చాత్తాపం
నిలువునా దహిస్తేచాలు...
ఆత్మ సంతృప్తి
దీపం వెలిగినట్టే...!
సమాధులపై
వెలిగే దీపాలు..
న్యాయంకోసం
కరిగి కన్నీరౌతూ...!!!
కొన్ని క్షణాల
మృగతత్వము
నూరేళ్ళజీవితానికి
ముళ్ళకిరీటమై...!!!
ఆవేశాలు చల్లారి
కొవ్వుత్తులు కొడికట్టాక...
న్యాయమైన శిక్ష
యావజ్జీవమే...!!!