తలనొప్పియే కదా.. అని నిర్లక్ష్యం చేస్తే.! - ..

If you ignore that ..!

తనదాకా వస్తే కానీ, తలనొప్పి తెలీదంటారు. అవును ఆ తలనొప్పి బాధ అలాంటిది. అయితే, నొప్పి అలాంటిదైనా, తలనొప్పి అంటే ఎప్పుడూ చిన్న చూపే. ఏదో మందు రాస్తేనో, ఒక ట్యాబ్లెబ్‌ వేస్తేనో తగ్గిపోతుంది కదా.. అనుకుంటాం. కానీ, తలనొప్పిలో చాలానే రకాలున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునది మైగ్రేన్‌ సమస్య. ఇది వచ్చిందంటే నాలుగైదు రోజులు చుక్కలు చూపిస్తుంది. అంతేనా. మైగ్రేన్‌తో ఇతర సమస్యలు కూడా అనేకం ఉన్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది. మైగ్రేన్‌ వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ గర్భస్రావం కాకున్నా, పుట్టిన బిడ్డకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు, మూర్ఛవ్యాధి తదితర దీర్ఘకాల వ్యాధులతో పుడతారనీ, ముఖ్యంగా బరువు సమస్య తలెత్తుతుందనీ వారు పేర్కొన్నారు.

మైగ్రేన్‌తో బాధపడే గర్భిణులనూ, మైగ్రేన్‌ లేని గర్భిణులనూ పోల్చి చూస్తే, ఈ సమస్యతో బాధపడేవారి ప్రసవాలు ఎక్కువగా సిజేరియన్స్‌కి దారి తీసినట్లు తెలుస్తోంది. అందుకే తలనొప్పిని అస్సలు అశ్రద్ధ చేయొద్దంటున్నారు వైద్యులు. గర్భిణుల సంగతి పక్కన పెడితే, తలనొప్పి సమస్య తీవ్రతరం అయితే, కంటి చుట్టు పక్కల నరాలు బలహీనమై మెల్లగా కంటి చూపు సన్నగిల్లే అవకాశమున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న తలనొప్పే కదా అని అశ్రద్ధ చేస్తే, అది పెరాలసిస్‌ వంటి పెద్ద సమస్యలకూ దారి తీస్తుందంటున్నారు.|

తలనొప్పి ఒక్కొక్కరికీ ఒక్కో రకం. నాకింతే, ఇలాగే ఉంటుంది. అదే తగ్గుతుందిలే.. అని నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే, తలనొప్పిని లైట్‌ తీసుకుని అనవసరమైన పెయిన్‌ కిల్లర్స్‌ అస్సలు వాడొద్దనీ, తీవ్రతను బట్టి సరైన సమయంలో వైద్యుని సంప్రదించి, వైద్యుని సలహా మేరకు తగు చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సో తన దాకా వస్తే కానీ, తెలియని తలనొప్పితో జర భద్రం సుమీ.

మరిన్ని వ్యాసాలు

సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
డప్పు గీతాలు.
డప్పు గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు