ఓంకారేశ్వర్ మధ్య ప్రదేశ్ రాష్ట్రము లోని ఖాండ్వా జిల్లలో గలదు . సూర్య వంశానికి చెందిన మాంధాత రఘువంశానికి మూల పురుషుడు . మాంధాత వింధ్య పర్వతం పై తపస్సు చేసి శంకరుని ప్రసన్నం చేసుకున్నాడు . శివుని అనుగ్రహంతో ఈ పర్వతంపైనే ఆలయం నిర్మించాడు .
ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రం లో శివుని అర్చించి తిరిగి వస్తూ వస్తూ విద్య పర్వతం వద్దకు వచ్చాడు. వింధ్యుని పూజ గ్రహించాడు. తనలో రత్న మాణిక్యాలు వున్నాయని వింధ్యుడు గర్వంగా నారద మునితో అన్నాడు . దానికి నారద మహర్షి “ నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే , మేరు శిఖరాలు స్వర్గం వరకూ వ్యాపించాయి “ అని అన్నాడు . ఆ మాటలకు వింధ్యుడు సిగ్గుపడి శివుని కోసం 6 నెలలు తపస్సు చేసాడు . ఆ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శంకరుని తన శిరస్సుపై శాస్వతంగా వుండి పొమ్మని విధ్యుడు కోరగా శివుడు ఇక్కడే ( విధ్యచలంపైనే ) స్థిరపడి పోయాడు.
ఓంకారేశ్వరుడని, పార్దివాకారంలో శ్రీ మమలేస్వరుడని 2 పేర్లతో ఈ క్షేత్రం లోని జ్యోతిర్లిన్గాన్ని పూజిస్తారు. ఓంకార్ క్షేత్రం లోనే శంకరాచార్యుల వారు ఉపనిషత్తులకు భాష్యం వ్రాసారు . ఓంకార మమలేశ్వర లింగముల పుణ్యక్షేత్రం ఈ ఓంకారేశ్వర్. ఈ రెండు దివ్య లింగ క్షేత్రములను ఆకాశ మార్గం నుండీ చూస్తె “ఓం “ ఆకారం “ కనిపిస్తాయి. అందుకే దీని ఓంకారం అనే పేరు వచ్చింది. ఓంకారేశ్వర క్షేత్రం నర్మదా నదీ తీరం లో గలదు . ఓంకారేశ్వర్ మరియు మమలేస్వర్ రెండు కొండలమీద వుండగా వాటి మధ్య నుండీ నర్మదా నది ప్రవహిస్తుంది. అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి సముద్రం లో కలుస్తూ వుంటే కానీ నర్మదా నది మాత్రం పడమరగా ప్రవహించి సముద్రం లో కలుస్తుంది.
ఈ రెండు క్షేత్రాలను చేరడానికి నర్మదా నదిపై వంతెనలు నిర్మించారు . స్టీం బోట్స్ కూడా నడుపుతున్నారు. ఈ క్షేత్రానికి చేరడానికి దగ్గరలోని అతి పెద్ద రైల్వే స్టేషన్ ఇండోర్ ( 77 కిలో మీటర్లు ) . ఉజ్జయిని నుండీ ( 133 కిలో మీటర్లు ) రవణా సౌకర్యాలు గలవు . ఖాండ్వా నుండీ కుడా ఓంకారేస్వర్ క్షేత్రానికి రవాణా సదుపాయాలు కలవు. ఖాండ్వా నుండీ ఓంకారేశ్వర్ వచ్చే మార్గం లో ప్రముఖ హిందీ చలన చిత్ర గాయకుడు కిషోర్ కుమార్ స్మారక చిహానం చూడ వచ్చు .