
తూటాలెపుడూ
బందీలే...
ప్రాణాలుఅనంతంలో
కలిసాకా కూడా..!!!
****
****
భటుత్వం
రక్షణ కవచమైతే...
ప్రజలెపుడూ
ప్రేమైకమూర్తులే...!!!
****
****
ఉపాధ్యాయుని చేత
బెత్తం నేరం...
తుపాకీ పేలితే
హర్షద్వానం...!!!
****
****
కన్నపేగు
ఆక్రోశిస్తోంది...
ఎండిపోయిన కళ్ళు
చెమరించేదెపుడని...!!!
****
****
సమీకరణాలు
సమానమైతే
ఆత్మలకు
సంతృప్తి కలిగేనా?