సింగపూర్ లో 'తెలుగు భోజనం' - బన్ను

telugu food in singapore

'సింగపూర్' అతిపెద్ద పర్యాటక స్థలంగా మారింది. సింగపూర్ లో అనేక చోట్ల ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఐతే వాటిలో 90% తమిళ రెస్టారెంట్లే. దానిక్కారణం సింగపూర్ లో అధిక శాతం తమిళయన్స్ వుండటమే! సింగపూర్ లో 'లిటిల్ ఇండియా' అనే స్థలానికి వెళ్తే మనం చెన్నై వెళ్ళినట్టే వుంటుంది.

మరి 'తెలుగు భోజనం' దొరకదా? అంటే దొరుకుతుంది అనే చెప్పాలి. తెలుగు వారికోసం 3 చక్కటి రెస్టారెంట్లు తెలుగు భోజనం పెడుతున్నాయి.

1. 'ఆంధ్రా కర్రీ' : లిటిల్ ఇండియా స్టార్టింగ్ లో వున్న ఈ రెస్టారెంట్లో 'వెజ్ థాలీ' చాలా బాగుంటుంది. కూరలు, పప్పు, రసం, పొడులు, పచ్చళ్ళతో అన్ లిమిటెడ్ రైస్ (వేడి రైస్) వడ్డిస్తారు (8 SGD).

2. సంక్రాంతి : ముస్తఫా అనే షాపింగ్ మాల్ సందులో సంక్రాంతి రెస్టారెంట్ వుంది. ఇది ఒక రెస్టారెంట్ చైన్. ఇండియా, సింగపూర్, ఓమన్ లో వీరి బ్రాంచీలున్నాయి. ఆంధ్రా కర్రీతో పోల్చితే కొద్దిగా ఖరీదెక్కువ (10 SGD).

3. వనభోజనం : సంక్రాంతి పైనే వనభోజనం అనే మరో రెస్టారెంట్ వుంది. అథెంటిక్ తెలుగు భోజనం ఇంచుమించు సంక్రాంతి రేట్లే (10 SGD) కానీ కొన్ని విచిత్రమైన రీజనల్ డిషెస్ పేర్లు చూడొచ్చు.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి