కొవ్వొత్తులు
ఊరు: కాకినాడ.
1"అమ్మా"అనే పిల్లల
పిలుపుకు కుమిలిపోతూ,
"నాన్నా"అనే పిల్లల
పిలుపుకు నలిగిపోతూ,
బాంధవ్యాల కంటే
బాధ్యతలే ముఖ్యమంటూ,
మొదటి వరుస యుద్ధ
వీరుల్లాగ ముందుంటూ,
కరోనా పీడితుల జీవితాలలో
వెలుగు నింపుటకు,
కరిగి పోతున్నారు,.
కొవ్వొత్తుల్లా మన డాక్టర్లు.
2.కరోనా పీడితులను అమ్మా.
నాన్నలుగా భావిస్తూ,.
కన్న పిల్లలకు చేసే సపర్యలు
కంటే కూడాఎక్కువగా చేస్తూ,
కంటి మీద కునుకును దూరం
చేసుకుంటూ,.
మానవ సేవే మాధవ సేవని,
నమ్ముతూ,.
కరోనా పీడితుల జీవితాలలో
వెలుగు నింపుటకు ,.
కరిగి పోతున్నారు.
కొవ్వొత్తుల్లా మన నర్సులు.
3.పహారాయే పరమావధిగా,.
భావిస్తూ,
ప్రాణాలనుఫణంగాపెడుతూ
సామ,దాన,భేద,దండోపాయ
లతో చైతన్య పరుస్తూ,.
అందరి చేత శభాష్.
అనిపించుకుంటూ,.
కరోనా పీడితుల జీవితాలలో
వెలుగు నింపుటకు,.
కరిగి పోతున్నారు
కొవొత్తుల్లా మన పోలీసులు.
4.వీది బాగుంటే మన అందరి.
విధి బాగుంటుందనుకుంటూ
గ్రామం బాగుంటేమన గమ్యం
బాగుంటుందనుకుంటూ
పట్టణం బాగుంటే మన పరి
స్థితి బాగుంటుందనుకుంటూ
అసామాన్య సేవలనుఅందరి
చేత కోనియాడబడుతూ ,.
కరోనా పీడితుల జీవితాలలో
వెలుగు నింపుటకు ,.
కరిగి పోతున్నారు.
కొవ్వొత్తుల్లా మన పారీశుద్ధ్య
కార్మికులు.
5 తాజా వార్తలను మనకు.
ఎప్పటకప్పుడు అందిస్తూ,.
గల్లీ గల్లీకి వెళ్లి, ప్రతీ తల్లికి.
జాగ్రత్తలు పదే పదే చెబుతూ,
లోపాలను సరి దిద్దుకోడానికి
పాలకులకు సూచనలిస్తూ,.
ప్రజలలో చైతన్యం తేవడానికి
అహర్నిశలు కృషి చేస్తూ,.
కరోనా పీడితుల జీవితాలలో
వెలుగు నింపుటకు ,
కరిగి పోతున్నారు
కొవ్వొత్తుల్లా మన
మీడియా వారు.
-అంగర రంగాచార్యులు.