వలస కూలీల వెతలు - అంగర రంగాచార్యులు

problems of labours

వలస కూలీల వెతలా!
చెప్పంగనలవి కాదు పరమ శివునికైనా..!    
""""""""""""""""""""""""""""""""""""
: లస వచ్చారు కూలీలు  పట్నానికి బ్రతుకు తెరవు కోసం.                              

ల : బ్ధి కోసం పనిని వెతుక్కుంటున్నారు.               

స : రి పెట్టుకుంటున్నారు వచ్చిన పని ఏదైనా.           

కూ : కూడు, గూడు, గుడ్డ కోసం   నిత్య పోరాటమే పాపం.

లీ : లీనమాయ్యారు వారికి  దొరికిన పని చేసుకుంటూ,    

ల : క్ష్మి ఎంత వస్తే అంతలోనే ఖర్చు పెట్టుకుంటూ ,         

వె : వెళ్లదీస్తున్నారు కాలం  బ్రతుకు జీవుడా అంటూ.    

త : రుముకుంటూ వచ్చింది ప్రపంచమంతా కరోనా.             

లా! : లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం అతి సడన్ గా  
     వలస కూలీల కష్టాలు  ప్రారంభమయ్యాయి.   

చె : చెప్పుకుంటే ఆర్చే వారూ,తీర్చే వారూ లేక రోడ్డున పడ్డారు.       

ప్పం : కప్పం కట్టైనా ఏదైన వాహనం మీదైన వెళ్లాలి అనుకున్నారు.                      

గ : గత్యంతరం లేక                      

న : డక ప్రయాణం సాగించారు పదులు, వందలు, వేల కిలోమీటర్ల దూరం.                    

ల : క్ష్యమైన సొంత ఊరు చేరుకోవడం కోసం లాఠీ దెబ్బలు తింటున్నారు పాపం.

వి : విధి చాలా విచిత్రమయినది. 

కా : కాలి నడకన వెళ్లే వారిని  కూడా జిల్లా, రాష్ట్ర, సరిహద్దులలో వెళ్లకుండా అడ్డుకున్నారు. 

దు : దుస్థితిని దిగమింగుకుంటూ చేసేది లేక,

ప : ట్టెడన్నం కూడా దొరకక, త్రాగడానికి నీరు కూడా లేక ఇబ్బంది పడ్డారు పాపం.             

ర : రహదారులు ఎక్కడికక్కడ మూసి వేయడంతో,. 

మ : మధ్యలోనే చిక్కుకొని   దిక్కు తోచని స్థితిలో,          

శి : శివరాత్రి లాగే ప్రతీ రాత్రీ  గడుపుతున్న వారికి ఆ 

వు :శివుడు శుభం కలగచేయాలని,వారిని వారి వారి

ని : నిజ వాసాలకు చేర్పించాలని  

కై : కైమోడుపులు సమర్పించుకుంటూ..

న : నమ్మకం ఉంచి వేడుకుంటున్నానయ్యా పరమశివా! 

వారి కష్టాలు తొలగించాలని వారిని,  వారి స్వగృహాలకు   క్షేమంగా  చేర్పించాలని....    ఆర్తితో.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి