
ఈ సబ్జెక్టు కొంచం కష్టమనిపించింది కానీ...117 కార్టూనిస్టులు 200 కి పైగా కార్టూన్లు పంపించారు. మొదటి, రెండవ, మూడవ బహుమతులతో బాటు 20 ప్రత్యేక బహుమతులు ప్రకటించాము. కానీ ఎంతో చక్కటి కార్టూన్లు రావటం తో మరో 15 ప్రత్యేక ప్రచురుణకి పరిగణ లోకి తీసుకున్నాం. పాల్గొన్న ప్రతీ కార్టూనిస్టుకు ప్రశంసాపత్రం (e - certificate) పంపించాము. అందరికీ కృతజ్ఞతాభివందనాలు !!
- బన్ను

జుట్టు అనే సబ్జెక్ట్ మీద కార్టూన్లు గీయాలీ అంటే, మన బుర్రలో వెంటనే తట్టే ఊహలు :తలనీలాలు , విగ్గులూ, డైలూ, బుట్ట తల, బట్ట తల, గుండూ, గెడ్డం మీసాలు, జడలు, హెయిర్ కట్టింగ్ సెలోన్లూ కు సంబంధిచే వుంటాయి. వీటి మీద నాటి తలిసెట్టి , బాపూ నుండి నేటి ధీరజ , సునీల వరకు వందల వేల సంఖ్యలో కార్టూన్లు, ప్రింటు , వెబ్బు పత్రికల్లో గీసేశారు.
ఇప్పటి కొరోనా లాక్డౌన్ కారణంగా జుట్లు పెరిగిపోయి సెలోన్లకెళ్ళే అవకాశాలు లేక మగజనం పడ్డ అగచాట్లు అంతా ఇంతా కాదు. కార్టునిస్టులకి జుట్టు మీద అయిడియాలు అల్లడానికి మాంఛి అవకాశం ఇప్పుడు గాక మరెప్పుడు అనుకుని , ఈ అంశం మీద హాస్యానందం రామూ , గోతెలుగు బన్నూ గార్లు, కార్టూన్ పోటీ సంకల్పించారు. ఎక్కువ బహుమతులు ప్రకటించి కార్టూనిస్టులని ప్రోత్సహించడనికి ముందుకు వచ్చారు. రామూ ,బన్నూ గార్లని మనసార అభినందిస్తున్నాను.
పోటీ కి మూడువందల పైచిలుకు కార్టున్లు రాగా ,పత్రిక ల సంపాదక వర్గం వాటిని వడపోసి , తొంభై రెండు కార్టున్లను ఎంపిక చేసి జ్యూరీ మెంబర్లకి అందించారు. నేనూ, సరసీ ఆ కార్టూన్లను నిశితంగా పరిశీలించి, సమీక్షించి, చర్చించి , ఇరవై మూడింటిని వేరు చేశాము. వాటిల్లో మొదటి, రెండవ, మూడవ బహుమతులకు , ఇరవై కన్సొలేషన్ బహుబమతులకు అర్హమైన వాటిని నిర్ణయించి రామూ, బన్నూ గార్లకి సమర్పించాము.
ఈ లాంటి సైలెంట్ కార్టూన్ పోటీ ఇంతకు ముందెప్పుడూ నిర్వహించబడలేదు. ఇంతపెద్ద సంఖ్యలో బహుమతులు ఇవ్వడం కూడా ఇదే తొలి సారి. ఈ పోటీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న కార్టూనిస్ట్ మిత్రులనందరినీ పేరు పేరునా అభినందిస్తున్నాను. విజేతలకి నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు.
తెలుగు కార్టూన్ వర్ధిల్లు గాక.
కార్టునిస్ట్ జయదేవ్.

ఎంపిక కానంతమాత్రాన మిగిలిన కార్టూనిస్టులు నిరుత్సాహ పడవలసిన అవసరం లేదు. మరింత మెరుగ్గా కార్టూన్లను వెయ్యడానికి ప్రయత్నించాలి.
'కాప్షన్ లెస్ కార్టూన్లు' అని ప్రకటిస్తే వ్యాఖ్యలతో కొన్ని కార్టూన్లు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే ఇంతకు ముందే వచ్చి, పాపులర్ అయిన కార్టూన్ ఐడియాలానే తిరిగి గీసి పంపడం కూడా!!
పోటీని నిర్వహించి కార్టూనిస్టులను ప్రోత్సహిస్తున్న 'గో తెలుగు డాట్ కామ్' వారిని, విజేతలను, పోటీలో పాల్గొన్న వారిని అభినందిస్తున్నాను.
-- సరసి
గౌరవ కార్టూన్లు


బహుమతి పొందిన కార్టూన్లు





































