Eyes - చంద్ర శేఖర్ కోవూరు

Eyes (మనిషి) కళ్ళు కన్నీటి పర్యంతమైన (మనిషి) కళ్ళు. ఆవేదనతో భగవంతుడికి మొరపెట్టుకుంటున్న (మనిషి) కళ్ళు. భగవంతుడా! నేను లేని వాళ్ళు నేను కావాలని నిన్ను ప్రార్థిస్తుంటే, నేను ఉన్నవాళ్లు మాత్రం నన్ను నిర్లక్ష్యం చేయటమే కాకుండా, నన్ను ఎంతో క్షోభ పెడుతున్నారు. అనుక్షణం నన్ను కష్టపెడుతున్నారు. అందమైన దృశ్యాలు చూడటానికి, ప్రకృతిని ఆస్వాదించడానికి, మంచిపనులు చేయటానికి, వెలుగుని పంచటానికి నువ్వు నన్ను వాళ్ళకిస్తే, వాళ్లేమో అనుక్షణం మొబైల్ ఫోన్స్ అని, ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, యు ట్యూబ్ అని, టీవీ అని, కంప్యూటర్ అని, లాప్టాప్ అని, ఐపాడ్ అని, సినిమాలని, వీడియో గేమ్స్ అని వేళా పాళా లేకుండా, రాత్రి పగలు తేడా లేకుండా, చిన్న, పెద్ద తేడా లేకుండా, వాళ్ళు శ్రమ పడటమే కాకుండా, నన్ను నానా హింస పెడుతున్నారు భగవంతుడా. తప్పు జరిగే చోట కేవలం చూడటానికే నన్ను ఉపయోగిస్తున్నారు కానీ చూసి కూడా ఏమి చేయలేకపోతున్నారు, కనీసం మాట్లాడ లేకపోతున్నారు. ఏంటో ఈ జనం, నన్ను కూడా ఒక వస్తువులాగా చూస్తున్నారు కానీ, నా విలువ తెలుసుకోవడం లేదు. నా బాధ పట్టించుకోవడం లేదు. వీళ్ళ అలవాట్ల వల్ల, రోజు రోజుకి నేను చిక్కిపోతున్నా, సరిగా చూడలేకపోతున్నా, క్రుంగి కృశించి పోతున్నా కూడా, కళ్ళజోడు పెట్టి మరీ నన్ను బాధిస్తున్నారు, అవసరమైతే నాకు సర్జరీలు చేయిస్తున్నారు కానీ, నాకు క్షణమైనా రెస్ట్ ఇవ్వడం లేదు భగవంతుడా. ఇలా చేస్తే నేనుండను అని హెచ్చరించినా కూడా భయపడటం లేదు. వీళ్ళని చూసి జాలిపడాలో, బాధపడాలో, కోపపడాలో, నవ్వాలో, ఏడవాలో అర్ధం కావడం లేదు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు, కానీ వీళ్ళు నన్నే లెక్క చెయ్యడం లేదు. నా విలువ తెలుసుకోవటం లేదు. వీళ్ళు చేసే పాడుపనులు చూడలేక చస్తున్నా. వీళ్ళు చేసే తప్పులు లెక్కపెట్టాలంటే జీవితం సరిపోదు. వీళ్ళు చేసే ప్రతిపనికి మొదటి సాక్ష్యం నేనే అని తెలుసుకోలేకపోతున్నారు. తెలిసి చేస్తారో, తెలియక చేస్తారో, వ్యసనానికి లోనయి చేస్తారో కానీ నన్ను మాత్రం శ్రమ పెడుతున్నారు. నన్ను కాపాడు భగవంతుడా. ఈ మనుషులకన్నా జంతువులు చాలా మేలు అవి నన్ను ఎంత వాడాలో అంతే వాడుతాయి. నాకు తగినంత విశ్రాంతిని ఇస్తున్నాయి. వాటికి ఉన్న జ్ఞానం కూడా మనుషులకి లేకపోవటం విచారకరం. దయ చేసి ఈ మనుషుల బారి నుండి నన్ను నువ్వే రక్షించు. వీళ్ళకి నా విలువ తెలియ చేయి. నన్ను నువ్వే కాపాడాలి భగవంతుడా. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కనీసం ఇప్పుడైనా కళ్ళను గుర్తించండి కళ్ళను కాపాడుకోండి కళ్ళకు విశ్రాంతినివ్వండి కళ్ళను శ్రమపెట్టకండి మీ తర్వాత మీ కళ్ళను దానం చేయండి. Csk

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు