శిష్యుడు : రుద్రాక్షలు ధరిస్తే, రక్తపు పోటు, మలబద్ధకం, చర్మ వ్యాధులు, స్థూలకాయం సమస్యలుండవట! అందుకనే యిన్ని మాలలు ధరించారా గురువర్యా? |
||
|
||
అనామక రూపం : విశ్వకర్మా... నువ్వు నిర్మించిన ఈ కట్టడంలో వాస్తుదోషం వుంది! |
||
|
||
పాండవ పక్షపాతి - 1 : తటాకమనుకుని అద్దంలో, అద్దమనుకుని తటాకంలో కాలుపెట్టి పడ్డాడట గదా... దుర్యోధన చక్రవర్తి? |
||
|
||
గంధర్వుడు - 1 : మత్తు, మత్తుగా వుంది! |
||
|
||
శిష్య పరమాణువు : "కొండ అద్దమందు కొంచెమై కానదా!" అన్నారే వేమన గారు! అర్ధమేమిటి? |
||
|
||
గంగులు : సీతమ్మవారిని, రావణాసురుడే ముహూర్తంలో, అపహరించాడో అదే ముహూర్తంలో, యీ నగలూ, ధనం దోచాం, రా!! |
||
|
||
సుబ్బాయమ్మ : గోపికల జడలు పైకి లేచి, పాములు పడగవిప్పి ఆడేలా, ఆడుతున్నాయి గమనించావా? |
||
|
||
వెంకట్రెడ్డి : "ఇందుగలడందులేడని సందేహము వలదు" అని భగవంతుడి గురించి అంత నిక్కచ్చిగా పోతన గారెలా చెప్పగలిగారంటావ్? |
||
|
||
సేవకుడు : ఇందు మూలంగా తెలియచేసేదేమనగా... దానవీరశూర కర్ణుల వారు, ఈ సభా స్థలానికి, నిర్ణీత సమయంలో రాలేక పోతున్నారని వార్త వచ్చింది! ఆయన గారి రధా చక్రాలు దారి మధ్యలో కూరుకుపోయాయటహో!! |
||
|
||
దండ నాయకుడు : ఒరేయ్... హిరణ్యకశిపుల వారి ఆజ్ఞ ప్రకారం ప్రహ్లాదుడ్ని ఏనుగుల చేత తొక్కిస్తున్నారా లేదా? |
||
|
||
తానీషా సిబ్బందిలో ఒకడు : కారా గృహంలో వుండే రామదాసుకు, బాగా ఉప్పు దట్టించిన, రొట్టెలు పడేశారా? |