శతాధిక కార్టూనిస్టుల కార్టూన్ల ప్రదర్శన - .

Cartoons Exhibition

21-3-2021 ఆదివారం నాడు విజయవాడలో బందరురోడ్డులోగల మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో శతాధిక కార్టూనిస్టుల కార్టూన్ల ప్రదర్శన లో160 మందికి పైగా కార్టూనిస్టుల కార్టూన్లు ప్రదర్శించబడ్డాయి. తొలి తెలుగు కార్టూనిస్టు కీ.శే. తలిశెట్టి రామారావు గారి కార్టూను నుంచి నేటి వర్ధమాన యువకార్టూనిస్టుల కార్టూనుల వరకు అందరివీ ప్రదర్శించబడ్డాయి. ఈ ప్రదర్శనను శ్రీ కే వి వి సత్యన్నారాయణగారు ప్రారంభించగా ఆసక్తిగ ఎదురుచూస్తున్న సందర్శకులు కార్టూన్లను చూడడానికి ఎగబడ్డారు.

ఆద్యంతమూ హైకోర్టు అడ్వొకేటు అయిన కార్టూనిస్టు శ్రీ బాచిగారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్టూనిస్టు శ్రీ లాల్ గారు సంకలనం చేసిన "ఆలిండియా తెలుగు కార్టూనిస్టుల డైరెక్టరీ 2021" పుస్తకాన్ని ప్రముఖ కార్టూనిస్టులు శ్రీ సరసిగారు, శ్రీ బాచిగారు, శ్రీ హాస్యానందంరాముగారు, శ్రీమతి పద్మగారి సమక్షంలో ఆత్మీయ అతిధి శ్రీ మురళిగారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలందించిన శ్రీ కే వి వి సత్యన్నారాయణ గారికి హాస్యానందం తరఫున సన్మానం చేయడం జరిగింది.

హాస్యానందం సంపాదకులు శ్రీ రాము పండా గారి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమం ఇరు తెలుగు రాష్ట్రాల నుంచీ హాజరైన 90 మందికి పైగా కార్టూనిస్టుల తో కళకళలాడింది. వివిధ కార్టూనిస్టుల కార్టూను సంకలనం పుస్తకాలు, కార్టూనిస్టులకు కావలసిన పెన్నులు, పెన్సిల్లు, పేపరు ఇతర సామగ్రిని తగ్గింపు రేట్లతో అమ్మకానికి ఉంచడంజరిగింది.. అన్నీ ఒకచోట దొరకడం సంతోషమని కార్టూనిస్టులు తెలిపారు. ఈ కార్యక్రమానికి గోతెలుగు.కాం సంపాదకులు శ్రీ బన్నుగారు మరియు శ్రీ ఏవియమ్ గారు హాజరయారు. శ్రీ సరసిగారు , శ్రీ బాచిగారు తదితరులు మాటాడుతూ కార్టూనిస్టులకు తగిన సూచనలు అందజేశారు.. శ్రీ లాల్ గారు కార్టూను కళను వ్యాపార ప్రకటనల వేపు మళ్ళించి అటు వ్యాపారస్తులు, ఇటు కార్టూనిస్టులూ ఆర్ధిక లబ్ధి పొందాలని సూచన యిచ్చారు.

మధ్యాహ్నం 1 గం. నిర్వాహకులు ఏర్పాటుచేసిన విందు ఆరగించిన తరవాత కార్టూనిస్టులందరూ తమ తమ అనుభవాలను పంచుకున్నారు. లంచ్ బ్రేక్ కి ముందర కార్టూనిస్టుల చక్కని గ్రూపు ఫోటో సెషన్ జరిగింది.. శ్రీ ప్రసాద్ కాజగారు వైడ్ యాంగిల్ లో ఈ ఫోటో తియడ జరిగింది. హాజరయిన ప్రతి కార్టూనిస్టుకూ ఒక డెస్కు కేలండరు, పెన్సిల్, చిన్న నోట్ బుక్ అన్నిటినీ మించి "ఆలిండియా తెలుగు కార్టూనిస్టుల డైరెక్టరీ2021" పుస్తకాన్ని ఉచితంగా అందజేశారు..

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, కార్టూనిస్టులు, సందర్శకులు అందరూ మాస్కులు ధరించి వచ్చారు.. మాస్కులు లేనివారికి నిర్వాహకులు మాస్కులు ఉచితంగా అందజేశారు.. శానిటైజర్ కూడా ఏర్పాటుచేసి కరోనా నిబంధనలు అందరూ పాటించేటట్టు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించినందుకు హాజరైన కార్టూనిస్టులు, సందర్శకులు తమ విలువైన అభిప్రాయాలను విజిటర్స్ బుక్ లో రాసారు. కార్టూనిస్టులందరూ ఆనందోత్సాహలతో ఎవరి ఇళ్ళకువాళ్ళు ప్రయాణమయారు..

మరిన్ని వ్యాసాలు

Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పిల్లనగ్రోవి పిలుపు...
పిల్లనగ్రోవి పిలుపు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన  సినిమాల్లో నారద పాత్రధారులు .
మన సినిమాల్లో నారద పాత్రధారులు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు