నాకు, రోజూ భోజనం చేసిన తర్వాత 'అన్నదాతా సుఖీభవ!' అనటం అలవాటు. దాంట్లో చాలా అర్ధాలు ఉన్నాయి. జన్మనిచ్చిన తల్లి తండ్రులు, జన్మకు కారణ భూతుడైన భగవంతుడు, పండించే రైతు, అమ్మే వర్తకుడు, ఉద్యోగం ఇచ్చిన వారు, అన్నం వండిపెట్టే యిల్లాలు.... ఇలా చెప్పుకుంటూ పొతే, యింకా చాలామంది 'అన్నదాతలకు' మనం ఋణపడి ఉన్నాం. అందునా, నాకు శ్రీ సీతారామయ్య గారు ప్రాతఃస్మరణీయులు. వారి చేతుల మీదుగా స్థాపించబడిన ఆంధ్రా బ్యాంకులోనేను పనిచేసాను. ఆ విధంగా నాకు సంబంధించి, శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు నా 'అన్నదాతలలో' అతి ముఖ్యులు. వారిని గురించి, నాకు తెలిసిన విషయాలు క్లుప్తంగా వివరించుతాను.
శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, 24 -11 -1880 వ తేదీన కృష్ణా జిల్లాలోని గుండుగొలను(ప్రస్తుతం అది ప. గో. జిల్లలో ఉందనుకుంటాను) అనే కుగ్రామములో అతి బీద కుటుంబంలో జన్మించారు. బాల్యం అంతా కృష్ణాజిల్లాలోనే గడిపారు. ప్రాధమిక, మాధ్యమిక విద్య కూడా కృష్ణా జిల్లాలోనే, బంధువుల సహాయంతో పూర్తి చేసారు. వీరు ఏక సంథాగ్రాహి. అటు తదుపరి కాలేజీ విద్య కోసం మద్రాస్ వెళ్లి, 'Madras christian College' అనే ఒక ప్రఖ్యాత కాలేజీలో M. B. C. M అనే వైద్య వృత్తికి సంబంధించిన డిగ్రీ తీసుకొని, మచిలీపట్నంలో వైద్యవృత్తిని ప్రారంభించారు. వైద్యునిగా బాగా రాణిస్తున్న సమయంలో, స్వాతంత్ర ఉద్యమం వైపు దృష్టి మళ్లి, చక్కని వృత్తిని, మంచి ఆదాయాన్ని వదులుకొని, ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అతి కొద్ది కాలంలోనే, మహాత్మా గాంధీ గారికి ముఖ్య అనుచరుడు, స్నేహితుడూ అయ్యారు. 1939 వ సంవత్సరంలో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష పోటీలో, వీరు మహాత్మా గాంధీ గారి candidate. వీరి మీద పోటీ చేసింది, శ్రీ సుభాష్ చంద్ర బోస్. ఆ రోజుల్లో, శ్రీ బోస్ బాబుకున్న popularity, craze వల్ల, పట్టాభి గారు ఓడిపోయారు. ఆ ఓటమిని పట్టాభి గారు sportive గా తీసుకున్నప్పటికీ, గాంధీ గారు జీర్ణించుకోలేకపోయారు. 'పట్టాభి ఓటమి, నా ఓటమి' అని బహిరంగంగా ప్రకటించారు. ఓడిపోయినప్పటికీ, ఉద్యమ స్పూర్తిని వదలకుండా 1942 వ సంవత్సరపు Quit India ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. బ్రిటిష్ వారి చేతులలో చాలా సార్లు arrest అయ్యి జైలు పాలు అయ్యారు. జైలు శిక్ష అనుభవించే సమయంలో, ఆయన డైరీ లో వ్రాసుకున్న విషయములు, తదుపరి రోజుల్లో 'Feathers and Stones' అనే గ్రంధ రూపంలో వచ్చినవి. బాబూ రాజేంద్ర ప్రసాద్, శ్రీ పట్టాభి గారు వ్రాసిన 'కాంగ్రెస్ చరిత్ర' అనే గ్రంధానికి ముందుమాట వ్రాసారు.
1948 వ సంవత్సరంలో మళ్ళీ జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీలో, శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారి support తో గెలిచారు. రాజ్యసభ సభ్యునిగా, మధ్య ప్రదేశ్ Governor గా అనేక ముఖ్యమైన పదవులు అలంకరించినారు. 28 -11 -1923వ తేదీన, ఆయన మచిలీపట్నంలోAndhra Bank ను స్థాపించారు. ఒక చిన్నBank గా ప్రారంభమైన ఈసంస్థ, నేడు కొన్ని వేల శాఖలు, కొన్ని వేలమంది ఉద్యోగులుతో, దేశంలోనే ఒక ఒక ప్రముఖ బ్యాంకుగా వెలుగొందుచున్నది. ఆంద్ర సైంటిఫిక్ కంపెనీ, Hindustan Ideal insurance company, వీరు స్థాపించిన సంస్థలలో ప్రఖ్యాతి చెందినవి. భారత లక్ష్మి బ్యాంకు అనే బ్యాంకును కూడా వీరు ప్రారంభించినారు. తదుపరి కాలంలో, ఈ బ్యాంకు, ANDHRA BANK లోనే విలీనం అయినది. ఆయన ఏది ప్రారంభించినా అది విజయవంతం అయ్యేది. వృత్తి రీత్యా వైద్యుడైనా, ప్రవృత్తి రీత్యా ఒక మహా ఆర్ధిక వేత్త. అన్నం, వైద్యం, గృహవసతి, వాహనపు ఋణాలు యిలా ఎన్నో లాభాలు పొందుతున్న ఉద్యోగులు, గ్రామీణ ప్రజలు... మన 'అన్న దాత' ను రోజూ స్మరించుకుందాము!
'అన్నదాతా సుఖీభవ!' అంటూ, ఆ మహనీయునికి, నా హృదయ పూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను!!!