మన తెలుగు ట్రావెలర్స్ - .

Telugu Travellers
YouTube లో ఈ మధ్య ట్రావెల్ వ్లాగ్స్ ఎక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే మనం చూడని, చూడలేని ప్రదేశాలని చూడవచ్చు. అదేవిధంగా మనం చూసిన ప్రదేశమైతే మన మధురస్ముతులను పెనవేసుకోవచ్చు. ఈ విడియోలని కొందరు తమదైన శైలిలో చూపిస్తూ ఉంటారు.
తెలుగు ట్రావెలర్ (రాజా రెడ్డి)
Channel URL: https://www.youtube.com/c/TeluguTraveller

వీరి వీడియోలు చాలా ప్రొఫెషనల్ గా వుంటాయి. ఎంత సమాచారం అందించాలో అంతే అందిస్తూ... సీరియస్ గా సాగిపోతుంటాయి వీరి వీడియోలు. వీరు చాలా కాలంగా YouTube లో వున్నారు.
ఉమ తెలుగు ట్రావెలర్
Channel URL: https://www.youtube.com/c/UmaTeluguTraveller

ఉమ గారు ఆఫ్రికా లోని కొన్ని దేశాలు, రష్యా లోని కొన్ని ప్రాంతాలు విశదీకరించి చూపించారు. చిరునవ్వుతో మంచి ఆక్టివ్ గా వుండే 'ఉమ' వీడియోలు మనల్ని చక్కగా ఆకట్టుకుంటాయి. మనుషులకే కాక జంతువులకు కూడా మర్యాదనిచ్చే ఉమ వీడియోలు ఫన్నీగా, ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. చెప్పాలంటే వీరి వీడియోల్లో ఏదో మ్యాజిక్ ఉంది. బోర్ కొట్టకుండా చూసేస్తాం !
రవి తెలుగు ట్రావెలర్
Channel URL: https://www.youtube.com/c/RaviTeluguTraveller

వైజాగ్ లో పుట్టి అమెరికాలో నివసిస్తున్న 'రవి' వీడియోలు చూడటానికి చాలా 'రిచ్' గా ఉంటాయి. తెలుగు ట్రావెలర్స్ లో అత్యధికంగా 186 దేశాలు చూసిన ఏకైక ట్రావెలర్ 'రవి' ! ఇటీవల వీరు తీసిన 'న్యూయార్క్' వీడియోలు చాలా బాగున్నాయి.
నా అన్వేషణ
Channel URL: https://www.youtube.com/c/NaaAnveshana

' నా అన్వేషణ' ఛానల్ ' అన్వేష్ ' అనే అబ్బాయిది. ఇతను సూపర్ యాక్టీవ్ ! ఇతను చాలా దేశాలే పర్యటించాడు. ఇటీవల 'టర్కీ' వీడియోలు బాగున్నాయి. వీరి వీడియోల్లో పదజాలం కొంచెం తేడాగా ఉంటుంది. బూతు పదాలుండటం వల్ల ఫ్యామిలీ తో చూడటం కొంచం అభ్యంతరం గా ఉంటుంది. ఐతే ఈ ఛానల్ ని సరదా కోసం చూసి అభిమానించే వారు కూడా ఉన్నారు.
భయ్యా సన్నీ యాదవ్
Channel URL: https://www.youtube.com/c/bayyasunnyyadav

భయ్యా సన్నీ యాదవ్ (BSY) గారు మోటో వ్లాగింగ్ చేస్తుంటారు. వీరి వీడియోలు చూస్తుంటే.. వీరితో పాటు మనం కూడా ప్రయాణిస్తున్నట్టే ఉంటుంది. లడక్ పర్యటన, 'హైదరాబాద్ టు గోవా' ట్రిప్స్ హైలెట్. వీరి వీడియోలు మనసుకి ఆహ్లాదాన్నిస్తాయి.
రాజు కన్నెబోయిన
Channel URL: https://www.youtube.com/c/RajuKanneboina

'ఉమ' తర్వాత యాక్టీవ్ గా వుంటూ వీడియోల్లో మ్యాజిక్ సృష్టించగల మరో ట్రావెలర్స్. వీరి వీడియోల్లో ఇన్ఫర్మేషన్ తో పాటు కొంచం ఫన్, ఎంటర్ టైన్మెంట్ పుష్కలంగా వుండి వీడియో పూర్తిగా చూసేలా చేస్తాయి.
తెలుగు ట్రావెలర్ రాము
Channel URL: https://www.youtube.com/c/TeluguTravellerRAMU

రాము గారు స్లోగా చెబుతూ వుంటారు. వీరి వీడియోల్లో కూడా మంచి ఇన్ఫర్మేషన్ వుంటుంది. వీరి వీడియోలు కంటెంట్ పరంగా బాగున్నా కొంచెం స్లోగా అనిపిస్తాయి.
సుభ వీరపనేని
Channel URL: https://www.youtube.com/c/SubhaVeerapaneni

సుభ వీరపనేని, మహిళా తెలుగు ట్రావెలర్. వీరు వివిధ దేశాలన్నీ సందర్శించారు. సోలోగా ట్రావెల్ చేసే ఈ మహిళా తెలుగు ట్రావెలర్ వీడియోలు బాగుంటాయి.
ఎక్స్ ప్లోర్ విత్ విజయ్
Channel URL: https://www.youtube.com/c/ExploreWithVijay

నెమ్మది గా సాగే వీరి వీడియోల్లో ఇన్ఫర్మేషన్ బాగానే ఉంటుంది. ఎక్కువగా వీరు రైలు ప్రయాణాలు చూపిస్తూ ఉంటారు.

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు