గోరంత అనుభవం-కొండంత సమాచారం..!! - డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్

Gorantha Anubhavam - Kondantha Samacharam

నా దృష్టిలో ఉద్యోగులు రెండు రకాలుగా వుంటారు . అదికూడా ప్రభుత్వ ఉద్యోగుల సంగతి . అదికేంద్రప్రభుత్వఉద్యోగిఅయినా కావచ్చు లేదా రాష్ట్ర  ప్రభుత్వ ఉద్యోగి అయినా కావచ్చు .  కస్టపడి పనిచేయాలనే అకుంఠితదీక్ష ,అప్పగించినపని సకాలంలో చేయాలనే  తపన ,సమయపాలన పాటించాలనే క్రమశిక్షణ ,కొత్తవిషయాలు నేర్చుకోవాల నే అభిలాషగలవారు మొదటి కేటగిరి ఉద్యోగులు  మొదటి తారీఖున తప్ప ఇటువంటి ఉద్యోగ మిత్రులకు జీతం గుర్తుకు రాదు .  సమయపాలన పాటించనివాళ్ళు ,ఇచ్చిన పని సకాలంలో చేయకుండా ప్రతీది వాయిదా వేసేవాళ్ళూ ఎప్పుడూ జీతాలగురించి ,డి . ఏ ,ల గురించి , కష్టపడకుండా సంపాదించడం ఎలా ?అని నిత్యమూ ఆలోచించేవాళ్ళు , పనిచేస్తున్నవాళ్ళ పక్కన కూర్చుని ముచ్చట్లు చెబుతూ ,వాళ్ళపని చెడగొట్టే  వాళ్ళూ రెండోకోవకు చెందిన వాళ్ళు .  ఈ రెండోకోవకు చెందిన వుద్యోగుల,లేదా అధికారుల అనుభవాలు గానీ ,జీవిత చరిత్రలుగానీ సమాజానికి అవసరం లేదు . కానీ మొదటి కేటగిరీకి చెందిన ఉద్యోగుల లేదా అధికారుల అనుభవాలు లేదా జీవిత చరిత్రలు ముందుతరా లకు అవసరం అవుతాయి . అదిగో .. ఆ ఆలోచనతో ,రాసినా రాయకపోయిన  ‘ గోరంత అనుభవం ‘ అనే ఈ పుస్తకం సమాజానికి  అందింది . అది రాసింది మామూలు వ్యక్తికూడా కాదు ,దూరదర్శన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పదవీ  విరమణ చేసిన ఎన్ . వి . హనుమంతరావు గారు .  హనుమంతరావు గారు పుట్టి పెరిగింది నరసారావు పేట అయినా వారు స్థిరపడింది హైదరాబాద్ లో . బహుశః హైదరాబాద్ లో ఎక్కువకాలం పనిచేయడం వల్ల స్నేహ గణం అక్కడే ఎక్కువవుండడం వల్ల భాగ్యనగర  సొగసులకు మక్కువ పెంచుకుని హైదరాబాద్ లో స్థిరపడి ఉంటారని నా  నమ్మకం .  రావుగారు ,ఈ పుస్తకం ‘’ నా జీవిత చరిత్రకాదు ‘’ అన్నారు . అనుభవాలు జీవితంలోనించే పుడతాయికదా !అందుకే నేనంటాను ,ఇది ఆయన జీవిత చరిత్రలోని ‘ ఉద్యోగ పర్వం ‘ అని .  దూరదర్శన్ లో చేరకముందు ,వీరు చేసిన ఉద్యోగాలు చాలా వున్నాయి . వచ్చిన దానితో తృప్తిపడిపోయి దాన్నే పట్టుకుని వ్రేలాడలేదు . శ్రమించి  ఉద్యోగం చేస్తూనే ఎన్నో పోటీపరీక్షలు రాసి విజయం సాధించిన వ్యక్తి . నేటి  యువతకు ఈ పుస్తకంలోని ‘ ఉద్యోగ పర్వం ‘ చదివితే ,ఉద్యోగం రావడానికి ఎన్నిశ్రమలు పడలో ,ఎంతకష్టపడితే ఫలితం సాధించవచ్చో తెలుస్తుంది .  ఎందుకంటె చదువు అయిపోగానే ఉద్యోగం వచ్చేయాలనుకునే యువతీ  యువకులకు ఇది మార్గం చూపుతుందని నా నమ్మకం . ఒకరి అనుభవం మరొకరికి మార్గదర్శనం చేస్తుందనడానికి ఉద్యోగ పర్వం మంచి ఉదాహరణ .  భవిష్యత్తును వూహించకుండానే నాటకరంగం వంటి అంశాలలో శిక్షణ పొందడం దూరదర్శన్ ఉద్యోగానికి ఉపయోగపడిన ,దూరదర్శన్ లో పనిచేసినంత కాలంలో డ్రామాసెక్షన్ ఆయనకు దక్కకపోవడం విచారకరమే ! పైగా’ అది నా తీరని కోరిక ‘ అని పుస్తకం చివరలో అయన చెప్పుకున్నారు కూడా ! దూరదర్శన్ లో ప్రోగ్రాం ఎక్సికుటివ్ గా హనుమంత రావుగారు సెలెక్ట్ అయినా  అక్కడి సహోద్యోగులలోని రాజకీయాలు ఆయనను కలవరపరిచాయి . ఆయనను ఒకచోట పనిచేయనీయకుండా ,ఢిల్లీ ,హైదరాబాదు ,విజయవాడ  మద్రాసు ,ఒరిస్సా ,అండమాన్ ,వంటి ప్రదేశాలకు ఇష్టం వచ్చినట్టు ఫుడ్ బాల్  ఆడు కున్న విధానం ,అప్పుడు ఆయన దైర్యం ,ఆత్మస్థయిర్యం ఎలాంటిదో  పుస్తకంలోని ఆయా చాఫ్టర్లు చదివితేనేగాని అర్ధంకాదు . ఎన్నికష్టాలు ఎదురైనా  ఆయన పనితనమే ఆయనకు ధైర్యాన్ని ,పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి .  తనకు అండగా వుండి ,తనలోని పనిమంతుడిని మేల్కొల్పి ,ప్రోత్సహించిన  అధికారులను సహోద్యోగులను కూడా మరచిపోలేదు . అలంటి వారిలో  ఆర్ . వెంకటేశ్వర్లు గారు (పూర్వ డైరెక్టర్ జనరల్ -ప్రసార భారతి -న్యూ ఢిల్లీ ) డా . పాలకుర్తి మధుసూదన్ రావు గారు (పూర్వ డైరెక్టర్ హైదరాబాద్ దూరదర్శన్ )ముఖ్యులు . ఈ ఇద్దరూ ఈ వ్యాస రచయితకు మిత్రులు కావడం  విశేషం ! హన్మంతరావుగారు రూపొందించిన కార్యక్రమాల గొప్ప తనం తెలియాలంటే  ఈపుస్తకంలోని ,గమనం -గమ్యం ,సి . నా . రే ,వైభవం ,అక్కినేని అంతరంగం  చలన చిత్ర వైతాళికుడు ,వేదిక ,విజేత ,ఒరిస్సా జీవితం ,వంటి వ్యాసాలు  చదివితీరాల్సిందే . టి . వి ,లో కార్యక్రమాలు చూసి బహుగా ఆనందిస్తాం ,కానీ దాని వెనుక ఎంతటి శ్రమ ,టెన్షన్ వుంటాయో ,మధ్యలో అడ్డుపుల్లలు పెట్టేవాళ్ళు ,గురించి  ఈ పుస్తకం చదివితే అర్ధమవుతాయి . ఏం . ఏ -జర్నలి- జం చేసిన హనుమంతరావు గారు అనేక నందిపురస్కారాలు పొందిన అధికారి  పుస్తకం చదవడం మొదలుపెడితే ,పూర్తి చేసేవరకూ మనసు నిలువ నీయదు  సందర్భోచితంగా ఫోటోలు కొన్ని పెట్టినప్పటికీ ,పాఠకుడిని అవి కొంత నిరుత్సాహ పరచడం ఖాయం ,కానీ అందులోని అంశాలు ఈ కొరతను కనిపించకుండా ముందుకు తీసుకుపోతాయి .  శ్రీ హనుమంతరావు 2019 లో ,హైదరాబాద్ దూరదర్శన్ లో ,అసిస్టెంట్ స్టేషన్  డైరెక్టర్ గా పదవీ విరమణ చేసి ,హైదరాబాద్ (మెహిదీపట్నం )లోనే ప్రశాంతంగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు . ఆయన కలానికి మాత్రం  విశ్రాంతి ఉండబోదని ,ఆయన ఇప్పుడు రచనలే చెబుతున్నాయి .  ఈ పుస్తకం ,ఉద్యోగాలు ఆశించేవాళ్ళు ,కొత్తగా ఉద్యోగంలో చేరేవాళ్ళు ,దూరదర్శన్ ,ఆకాశవాణి లో ఉద్యోగాలకోసం తపన పడుతున్న నిరుద్యోగులు  తప్పకచదవడం అవసరం అని ,ప్రత్యేకంగా చదివిన నాకు   పుస్తకం వెల ; 150/-మాత్రమే .  ఆసక్తిగలవారు కాపీలకోసం  రచయిత;ఎన్ . వి . హనుమంత రావు గారిని సంప్రదించ వచ్చు .  రచయిత మొబైల్ . నం ;9440890540

మరిన్ని సమీక్షలు

పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, సఫిల్ గూడ
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు